నూతన సంవత్సర వేడుకలు
భూపాలపల్లి అర్బన్ : నూతన సంవత్సర వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌శర్మ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మహిళలు వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి న్యూఇయర్‌కు స్వాగతం పలికారు. ఇళ్లలో కుటుంబసభ్యులతో కలిసి కేక్‌లు కట్ చేసుకున్నారు. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థఽనలు నిర్వహించారు.
నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర వేడుకలు


