అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భూపాలపల్లి: అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగవ తరగతి సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ అధికారి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ..
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు భద్రత మాసోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీఓ సంధాని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు రవికుమార్, నాయకులు దశరథరామారావు, సురేందర్‌రెడ్డి, అన్వార్, మురళీధర్, రాజుకుమార్, షఫీ, జ్ఞానేశ్వర్‌సింగ్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులు సమన్వయంతో పనిచేయాలి


