వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ
● సీసీటీ ఆఫీసుకు రావుల శ్రీధరాచారి
● వరంగల్ జాయింట్ కమిషనర్‌గా టి.శ్రీనివాస్
సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్‌లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి టింగి చందు అండర్–14 వాలీబాల్ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి ఎం.రాజేందర్ గురువారం విద్యార్థిని భూపాలపల్లిలో అభినందించారు. తిరుపతిలో జరిగిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ‘ఐ బ్రో కోడింగ్’ ప్రదర్శన చేసిన మాడిగ స్నిగ్ధ, వెలగందుల తణ్మయి, గైడ్ టీచర్ మధు, ‘జీవ వైవిధ్య పరిరక్షణ’ అంశంపై ప్రెజెంటేషన్ చేసిన టీచర్ ప్రభాకర్ రెడ్డి, క్రీడల్లో శిక్షణ అందించిన పీడీ సిరంగి రమేష్‌లను కూడా సత్కరించారు.
ఆర్టీసీ డ్రైవర్లు
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీటీఓ సంధాని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీటీఓ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ సొంత భద్రత కోసం డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందూ, ఏఎంటీ అమృత, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
మెడల్స్ సాధించిన
విద్యార్థులు
కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పి.గణేష్, ఎం.అక్షిత జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో మెడల్స్ సాధించారు. భూపాలపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 30న కాటారంలో నిర్వహించిన పోటీల్లో అండర్–16 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగులో పాల్గొని సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. నేడు (శుక్రవారం) హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలను, శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పీడీ పూర్ణిమను హెచ్‌ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.
ఆర్డీఓ బాధ్యతల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, డివిజన్‌లోని తహసీల్దార్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ


