రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: ప్రమాదాల భారిన పడకుండా ప్రతీ ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 వాల్‌పోస్టర్‌ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వలనే జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా వేడుకలు..
నూతన సంవత్సర వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కేక్ కట్ చేశారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులందరు ఈ ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, నారాయణ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


