నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం

May 11 2025 7:42 AM | Updated on May 15 2025 5:43 PM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నేడు (ఆదివారం) ప్రారంభించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి గెస్ట్‌హౌస్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.

రైతు సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి రూరల్‌: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల దశరథం తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ప్రకటించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేశాల సాంబయ్య, ఉపాధ్యక్షులుగా దానవేన రాజయ్య, గుండ రవీందర్‌, బండ రవీందర్‌, సహాయ కార్యదర్శులుగా చేపూరి దేవరాజ్‌, మన్మధ రావు, కోశాధికారిగా బిల్లా సుధాకర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గంపల రామన్న, తూటి దేవేందర్‌, పంతకాని సడవలి పుప్పాల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సీఎం రాకను అడ్డుకుంటాం..

కాటారం: గత ప్రభుత్వ హయాంలో ఎంపికై న లబ్ధిదారుల దళితబంధు మంజూరు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ నెల 15న కాళేశ్వరానికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు నమూండ్ల సంపత్‌మహారాజ్‌ అన్నారు. కాటారం మండల కేంద్రంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని దళితబంధు లబ్ధిదారులతో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం సంపత్‌మహారాజ్‌ మాట్లాడుతూ పద్దెనిమిది నెలలుగా దళితబంధు నిధులను ఫ్రీజింగ్‌ నుంచి తీయాలని పలుమార్లు రాష్ట్ర సచివాలయం ప్రజావాణి, మంత్రులు, జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేదన్నారు. దళిత కుటుంబాలకు దళితబంధు లేదా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అంబేడ్కర్‌ అభయహస్తం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తమ ఆవేదనను నేరుగా సీఎం ఎదుట నిరసన రూపంలో తెలియజేసేలా కార్యచరణ చేపడుతామన్నారు. ఈ సమావేశంలో బొబ్బిలి వెంకన్న, పులి రామన్న, రాజేందర్‌, ముత్తన్న, సడువలి, తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

కాటారం: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు పిలుపునిచ్చారు. కాటారం మండల కేంద్రంలో శనివారం సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్‌ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్‌, నాయకులు రాజయ్య, బొడ్డు స్మరణ్‌, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం1
1/1

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement