Top Stories
ప్రధాన వార్తలు

తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వివరాలను ఆయన తెలియజేశారు. నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.కాల్పులు ఇలా.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంజనీరింగ్ చదివి.. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్(తెలంగాణ) ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు.

నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో!
సాక్షి,బెంగళూరు: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో (sbi) ప్రాంతీయ (language row) భాష చిచ్చు పెట్టింది. ఎస్బీఐ మేనేజర్ తమ మాతృ భాషలో మాట్లాడడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. ఈ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు సైత్యం జోక్యం చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు సదరు మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్బీఐ చర్యలకు ఉపక్రమించింది.ఇంతకీ ఏం జరిగిందంటే? కర్ణాటక రాజధాని బెంగళూరు సూర్యా నగర్ ఎస్బీఐ (SBI Surya Nagar branch Bangalore) బ్రాంచ్‌లో కస్టమర్‌కు, మహిళా బ్యాంక్ మేనేజర్ మధ్య వివాదం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ వీడియోల్లో బ్యాంక్ మేనేజర్‌ను పదేపదే కన్నడలో (kannada language row) మాట్లాడమని కస్టమర్ సూచించడం, అందుకు బ్యాంక్ మేనేజర్ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి’ అంటూ కస్టమర్, బ్రాంచ్ మేనేజర్ మధ్య సంభాషణ జరిగింది. 🚨 Karnataka's divisive language war!SBI manager in Chandapura unfairly targeted for not speaking Kannada.India’s diversity means we can’t force one language—Hindi & English are official too.Let’s respect all tongues & unite, not vilify!🇮🇳#sbimanager #Kannada #Karnataka… pic.twitter.com/nv0Rd5W6Yr— Rahul Kumar (@RealRavani) May 21, 2025 అలా అని రాసుందా?ఒకానొక సమయంలో ‘మేమేం చేయాలో మీరు చెప్పడం కాదని బ్యాంక్ మేనేజర్..కస్టమర్‌తో అనడం. భాష విషయంలో మళ్లీ జోక్యం చేసుకున్న కస్టమర్ మీరు హిందీలో కాకుండా కన్నడలో మాట్లాడమని బ్యాంక్ మేనేజర్‌కు సూచించడం.. అందుకు మేనేజర్ బదులిస్తూ..అలా అని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించడంతో మరింత వివాదం రాజుకుంది.ఇది కర్ణాటక.. కాదు ఇండియాకస్టమర్ బ్యాంక్ మేనేజర్ తీరును ప్రశ్నిస్తూ.. ఇది ఆర్బీఐ నిర్ణయం. మీరు ముందు అది తెలుసుకోండి. ఇది కర్ణాటక ఇక్కడ కన్నడే మాట్లాడాలి అని అనడంతో.. ఇది ఇండియా అని బ్యాంక్ మేనేజర్ జవాబు ఇవ్వడం వీడియోల్లో కనిపిస్తోంది.ఎస్బీఐ సూర్యానగర్ బ్రాంచ్‌లో జరిగిన వివాదంపై ఎస్బీఐ స్పందించింది. బెంగళూరులోని సూర్యనగర్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై మేం తీవ్రంగా విచారిస్తున్నాము. ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నాం. ఎస్బీఐ తన కస్టమర్ల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రవర్తనకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఎస్బీఐ మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. మరింత వివాదం ఎస్బీఐ బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్,క స్టమర్ మధ్య చోటు చేసుకున్న వివాదం రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. ప్రో-కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. ఎస్బీఐ సూర్యాపురం బ్రాంచ్ సిబ్బంది కన్నడ కస్టమర్లను అవమానిస్తోందని, స్థానిక భాషలో ప్రాథమిక సేవల్ని అందించడంలో విఫలమవుతున్నారని కేఆర్వీ ప్రతినిధులు ఆరోపించారు.A severe protest erupted today by the #KaRaVe members against the arrogant manager at the #SBIBank in #Chandapur, #Bengaluru!#ServeInMyLanguage #StopHindiImposition #KannadaInKarnataka https://t.co/K9HNZlsiYr pic.twitter.com/2WiFLdTiBD— Safa 🇮🇳 (@safaspeaks) May 21, 2025మరోవైపు, ఎస్బీఐ బ్యాంక్‌లో జరిగిన వివాదంపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా సంప్రదించారు. బ్రాంచ్ మేనేజర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. Many bank customers, especially in rural Karnataka, face extreme difficulty when banking staff - those that have a public interface - don’t communicate in local language. This is an issue faced by millions of customers in many states. After we raised this issue at multiple… https://t.co/msr6azNuFf pic.twitter.com/juFQyNq8uj— Tejasvi Surya (@Tejasvi_Surya) May 21, 2025The behaviour of the SBI Branch Manager in Surya Nagara, Anekal Taluk refusing to speak in Kannada & English and showing disregard to citizens, is strongly condemnable.We appreciate SBI’s swift action in transferring the official. The matter may now be treated as closed.…— Siddaramaiah (@siddaramaiah) May 21, 2025

IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగుల మార్కును తాకిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడి 141.24 స్ట్రయిక్‌రేట్‌తో 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన సంజూ ఈ ఘనత సాధించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహాయించి ఐపీఎల్ కెరీర్ మొత్తం రాజస్థాన్‌కే ఆడిన సంజూ ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 4704 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడటంతో ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంజూ, ఆ ఫ్రాంచైజీ తరఫున 28 మ్యాచ్‌లు ఆడి ఓ శతకం సాయంతో 677 పరుగులు చేశాడు. 2021 సీజన్లో రాజస్థాన్ కెప్టెన్‌గా నియమితుడైన సంజూ ఐదు సీజన్లలో ఆ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.ఈ సీజన్లో సంజూ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో అతని స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మొత్తంగా ఈ సీజన్లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఊరట పొందే విజయం సాధించి సీజన్‌ను ముగించింది.నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబే (39) ఓ మోస్తరు స్కోర్లు చేసి సీఎస్కేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్ద్‌వీర్ సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్..యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57), సంజూ శాంసన్ (41), ధృవ్ జురెల్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు బిగ్ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

రామ్ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్‌చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.

పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
ఐఎఫ్ఎస్లో సత్తా చాటిన తెలంగాణ యువకులు
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
ఆర్బీఐ మరో విడత రేట్ల కోత.. 6.5% మించి వృద్ధి!
వక్ఫ్ అనేది ప్రాథమిక హక్కు కాదు.. సుప్రీంకోర్టులో కేంద్రం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
ఐఎఫ్ఎస్లో సత్తా చాటిన తెలంగాణ యువకులు
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
ఆర్బీఐ మరో విడత రేట్ల కోత.. 6.5% మించి వృద్ధి!
వక్ఫ్ అనేది ప్రాథమిక హక్కు కాదు.. సుప్రీంకోర్టులో కేంద్రం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
సినిమా

నా రేస్ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్
స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్ రేస్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్ రేస్ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్ రేస్ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు. అయితే నువ్వు స్పాన్సర్స్‌ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్ చెప్పారు.

31 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన 'విశ్వసుందరి'.. ప్రత్యేకత ఇదే
పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు సుస్మితా సేన్( Sushmita Sen) పరిచయం చేశారు. సరిగ్గా 31 ఏళ క్రితం మే 21న విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది. అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఫోటలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 'ఈ రోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది. నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే.. ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు. మిస్ యూనివర్స్ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. దానిని మాటలలో చెప్పలేం.' అని ఆమె పంచుకున్నారు.1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకుగాను 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47)

విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
సినిమా రంగంలో నటీ నటుల మధ్య అనుబంధాలు ఎంత సహజమో...బ్రేకప్స్ కూడా అంతే సాధారణం. అలాగే అలాంటి అనుబంధాలను గురించిన పుకార్లు షికార్లు చేయడం అంతకు మించి సర్వసాధారణం. అందుకు తమిళ స్టార్ హీరో, యాక్షన్ సినిమాలకు పేరొందిన విశాల్ కూడా అతీతుడేమీ కాదు. అయితే చాలా సార్లు అలాంటి రూమర్లు నిజమవుతుంటాయి కూడా. తాజాగా సాయి ధన్షికను పెళ్లి చేసుకోనున్నట్టు విశాల్ ప్రకటించడం తెలిసిందే. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్న వార్తలు నిజమేనని వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనతో ధృవీకరించినట్టయింది.(చదవండి: ఆ నటుడి వల్ల కన్నీటి పర్యంతం.. అండగా విశాల్, అదే సాయి ధన్సిక ప్రేమకు కారణం)పెళ్లితో ఒక ఇంటి వాడు కాబోతున్న సందర్భంగా ఇక విశాల్ మీద ఇలాంటి అఫైర్ల వార్తలు పెద్దగా రాకపోవచ్చునని అనుకోవచ్చు. ఈ సందర్భంగా గతంలో హీరో విశాల్ కు మరికొందరు సహ నటీమణులతో అఫైర్స్ ఉన్నట్టు వచ్చిన వార్తలు ఒకసారి ప్రస్తావించుకుంటే.... అలాంటి వార్తల్లో తమిళ, తెలుగు అని లేకుండా దక్షిణాది సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ డేటింగ్ వార్త కూడా ఒకటి. వీరిద్దరి మధ్య సంబంధం గురించి కొంత కాలం పాటు పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిని కొన్నాళ్లు కొనసాగనిచ్చాక... తాము ఇద్దరూ ప్రేమికులం కామని వీరిద్దరూ స్పష్టంగా ఖండించారు తాము సన్నిహిత స్నేహితులమని స్పష్టం చేశారు. అప్పటికీ అవి ఆగకపోవడంతో... విశాల్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని అతను పెళ్లి చేసుకుంటానంటే.. తగిన వధువును తానే కనుగొని సూచిస్తానని అతనిపెళ్లి విషయంలో తాను సంతోషంగా సహకరిస్తానని అంటూ వరలక్ష్మి బహిరంగంగా పేర్కొంది. విశాల్ కూడా ఈ పుకార్లను ఖండించాడు. తాము చిన్ననాటి స్నేహితులమని తన పెళ్లి విషయంపై నిర్ణయం జరిగినప్పుడు తనే తన వివాహాన్ని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకుంది. అదే విధంగా విశాల్ పేరుతో ముడిపడిన మరో నటి అభినయ.. అభినయ నటుడు విశాల్ మధ్య ప్రేమ సంబంధం గురించి పుకార్లు కొనసాగుతున్నంత కాలం అభినయ వాటిని నిరంతరం ఖండిస్తూ వచ్చింది, విశాల్ కేవలం తనకు ఒక నమ్మకమైన స్నేహితుడు మాత్రమే అని ఆమె పేర్కొంది. నటుడు విశాల్‌తో ప్రేమ సంబంధం గురించి పుకార్లను తోసిపుచ్చే క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఆమె వెల్లడించింది. చివరకు అభినయ గత ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో అందరి ఆశీస్సులతో అతన్ని వివాహం చేసుకుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం ఇరుంబు తిరల్ లో కలిసి నటించిన అభిరామి తో కూడా విశాల్‌కు సంబంధం ఉన్నట్టు కొన్ని పుకార్లు వచ్చినప్పటికీ... అవి ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖండించాల్సిన అవసరం కూడా వీరికి రాలేదు. హీరో విశాల్‌తో సంబంధాలు అంటకట్టబడిన వారందరూ ఇప్పటికే పెళ్లి చేసుకుని హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండగా, ఎట్టకేలకు తన చివరి అఫైర్..వార్తల్ని మాత్రం నిజం చేస్తూ విశాల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు.

Kannappa: కిరాతగా మోహన్ లాల్.. స్పెషల్ గ్లింప్స్ అదిరింది!
మోహన్‌లాల్(Mohanlal ) పుట్టినరోజు (మే 21) సందర్భంగా ‘కన్నప్ప’(Kannappa) చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్ కిరాత అనే దైవిక శక్తితో ముడిపడిన పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.ఇక కన్నప్ప విషయానికొస్తే.. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు.ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...
క్రీడలు

నా వల్ల కాదని చెప్పి.. వెంటనే రిటైర్ అయిపో!
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్థాయికి తగ్గట్లు ఆకట్టులేకపోతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్.ఇక రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా దూరం కావడంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని.. సీఎస్కేను మునుపటి విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది సీఎస్కే.అంతేకాదు.. ఆడిన పదమూడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి తమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే దుస్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ధోనిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.నా వల్ల కాదు.. అని చెప్పి వెళ్లిపో‘‘ధోని వయసు పెరుగుతోంది. కాబట్టి ఆటగాడిగా అతడి నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. అయితే, ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటోంది.ఒకవేళ నీకు హిట్టింగ్ ఆడటం కుదరకపోతే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును వీడిపోతే మంచిది. ధోని ఇలా చేయడమే మంచిది. ఒకవేళ అతడు ఇంకా ఇంకా కొనసాగుతూ... ఉంటే జట్టులో ఏ పాత్ర పోషిస్తాడు?మోకాలి నొప్పులు కూడాకెప్టెన్గా ఉంటాడా? వికెట్ కీపరా లేదంటా ఫినిషర్గానా?.. నిజాయితీ చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయింది. అతడిని మోకాలి నొప్పులు వేధిస్తున్నాయి. ఇకనైనా ధోని తప్పుకొంటే మంచిది’’ అని చిక్కా.. తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు. రాజస్తాన్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దంచికొట్టిన రాజస్తాన్.. 17.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57), సంజూ శాంసన్ (31 బంతుల్లో 41), ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. కాగా ఐపీఎల్లో సీఎస్కేను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. కానీ ఈసారి మాత్రం అతడికి సారథిగా ఘోర పరాభవం ఎదురైంది.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?.. సమీకరణలు ఇలా..Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025

వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025

ఖరీదైన ఫ్లాట్ కొన్న శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్!
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్

MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.వర్షం ముప్పు.. ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.అయితే, పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
బిజినెస్

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 108 పాయింట్లు పెరిగి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 364 ప్లాయింట్లు ఎగబాకి 81,560 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.38 శాతం పడిపోయింది.ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా ఇటీవల 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.మార్కెట్ ఇలా..అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్ సైన్స్, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.వ్యాపార ధోరణులుబయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.పెట్టుబడి, లాభదాయకతవిత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.సవాళ్లురెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లువ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్ కోడ్లు, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి.

ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..హెచ్డీఎఫ్సీ క్రెడిలాగతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్ సరీ్వసెస్ కాన్ఫిడెన్షియల్(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ను డిసెంబర్లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీబాలీవుడ్ స్టార్స్‌తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్‌ఫీల్ రియల్టీ, ధ్యాన్ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.యూరో ప్రతీక్వాల్ ప్యానల్ డెకొరేటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు. మైనింగ్, లాజిస్టిక్స్ నాగ్‌పూర్ కంపెనీ కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.జారో ఇన్స్టిట్యూట్ఐపీవోలో భాగంగా జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది. జెన్సన్స్ ఇండస్ట్రీస్ఐపీవోలో భాగంగా జెన్సన్స్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లుజెమ్ ఆరోమాటిక్స్స్పెషాలిటీ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ ముంబై కంపెనీ జెమ్ ఆరోమాటిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఫ్యామిలీ

Ashtavakra అష్టావక్ర సందేశం
మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు. అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్ సెంటర్ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.– రాచమడుగు శ్రీనివాసులు

చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!
పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్‌గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్‌ను స్పీడ్గాచేయగలరా? అసలు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా?పిల్లలూ.. పజిల్స్ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్‌లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.సుడోకు: ఇది జపాన్ దేశంలో పుట్టిన పజిల్. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.జిగ్సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన పజిల్ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్సా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి. ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.లెక్కల పజిల్స్: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం. (చదవండి: పాడ్‌కాస్ట్ చేద్దామా?)

Sagubadi : పర్పుల్ వింగ్డ్ బీన్స్
చిక్కుడు పంటలో బోలెడంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. దక్షిణ ఆసియాలోని రైతులు, వినియోగదారులకు ఈ పర్పుల్ వింగ్డ్ బీన్ (Purple Winged Beans) తెలుసు. దీనితో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని, వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారికి గమనిక ఉంది. మొక్క 3–4 మీటర్లు (9.8–13.1 అడుగులు) ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు.. అన్నీ తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నాటిన మూడు నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి. పర్పుల్ బీన్ పువ్వులను సలాడ్‌గా తినొచ్చు. లేత ఆకులను కోసి పాకూర మాదిరిగానే ఆకు కూరగా తయారు చేసుకోవచ్చు. వేర్లను పచ్చివి లేదా దుంపల్లా కాల్చుకొని తినొచ్చు. గింజలను సోయా బీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రొటీన్ ఉంటుంది. ఆకులు, పూలలో 10–15% ప్రొటీన్ ఉంటుంది. వింగ్డ్ బీన్స్ పంటకు చీడపీడల బెడద లేదని, ఒక్కసారి నాటితే మళ్లీ మళ్లీ దానంతట అదే పెరుగుతూ ఉంటుందని కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణప్రసాద్ చెబుతున్నారు.చిక్కుడు పంటలో బోలñ డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్.

'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!
రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు. కెఫిన్ లేని టీ ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ టీ సొమెలియర్గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్‌ను అందిస్తోంది. ‘టీ వ్యాపారం గురించి ప్రొఫెషనల్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్‌ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్‌ను ప్రారంభించాను. వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. దీంతో దృష్టిని ఈ–కామర్స్ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్‌కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్ గ్రీన్ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్ ఉండదు. – స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్ఇమ్యూనిటీలు‘చాయ్ డైరీస్’ పేరుతో తన లైఫ్ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్ కేఫ్‌ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్ లేకుండా చాయ్ డైరీస్ ప్రారంభించాను. కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబడి సహకారమూ లేదు. అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైమ్‌లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్ బాంబే మసాలా టీ లోపాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్టెయిల్, ఐస్డ్ టీ వంటివి సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా ఉపయోగించవచ్చు.’– అమీ భన్సాలీ, చాయ్ డైరీస్ తయారీలో సమయం తెలియదుతండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్ వాసి అనామికా సింగ్. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్‌ని సృష్టించాను. ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం. పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్ నీడిల్, ఫైన్‌వుడ్ స్మోక్డ్ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’– అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీకచ్చితమైన సమయపాలనలండన్లో ఒక గ్లోబల్ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు. ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్‌రేట్‌ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్ ప్రకారం ప్రతి కస్టమర్‌కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది.– మయూర రావు, ఆసమ్ టీ (చదవండి:
ఫొటోలు


Cannes 2025 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)


'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు )


మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)


ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)


ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)


సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)


గోవాలో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న మను భాకర్ (ఫోటోలు)


పెళ్లి తర్వాత లండన్ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)


డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
అంతర్జాతీయం

యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.

మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!

అగ్నిపర్వతం బద్దలు.. అధికారుల్లో టెన్షన్.. కారణం ఇదే..
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K— AFP News Agency (@AFP) May 18, 2025
జాతీయం

‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్(Banu Mushtaq) రచించిన చిన్న కథల సంకలనం ‘హార్ట్ లాంప్’ 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యింది. దీపా భస్తి కన్నడ నుండి ఆంగ్లంలోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి కన్నడ పుస్తకంగా ‘హార్ట్ లాంప్’ గుర్తింపు పొందింది.‘హార్ట్ లాంప్’లో ముష్తాక్ రాసిన 12 చిన్న కథలు ఉన్నాయి. ఈ పుస్తకం 2024లో ఇంగ్లీష్ పెన్ అనువాద అవార్డును కూడా గెలుచుకుంది. ఈ పుస్తకం షార్టలిస్ట్కు ఎంపికైనప్పుడు ముష్తాక్ మాట్లాడుతూ ‘ఇది ఒక పెద్ద విజయం. నేను దీనిని పాఠకులకు, కన్నడ ప్రేమికులకు మంచి హృదయాలు కలిగిన భారతీయులకు అంకితం చేస్తున్నాను. నా కథలు సామాజిక సంక్షోభాలు, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రతిస్పందనల నుండి ఉద్భవించాయి. వీటిలో కొన్ని కథలు రాయడానికి ఒక వారం పట్టింది, కొన్నింటికి పది రోజులు పట్టింది. ప్రేరణ అవసరం లేదు. బాధ, నిస్సహాయత, కోపం మాత్రమే సరిపోతుంది. నేను ఏడుస్తున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కథలు రాశాను’ అని భాను ముషాక్ పేర్కొన్నారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా బాను ముష్తాక్‌ను అభినందించారు.స్పష్టమైన కథనం, కథను నడిపించే తీరు ‘హార్ట్ ల్యాంప్’(‘Heart Lamp’)ను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. కాగా బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతలు అనువాదకుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఈ బహుమతి మొత్తం £50,000 (సుమారు రూ. 52,00,000)ను సమానంగా విభజిస్తారు. రచయితకు £25,000 (సుమారు రూ. 26,00,000) అనువాదకునికి £25,000 (సుమారు రూ.26,00,000) అందిస్తారు. న్యాయనిర్ణేతలు ప్రచురణకర్తలు సమర్పించిన 154 పుస్తకాల నుంచి ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ‘హార్ట్ లాంప్’ పుస్తకం దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలోని మహిళలు, బాలికల దైనందిన జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1990- 2023 మధ్య కాలంలో రాసిన ఈ పుస్తకంలో భావోద్వేగాలు, లోతైన సామాజిక ఉద్రిక్తతలు కనిపిస్తాయి.ఇది కూడా చదవండి: ‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’

‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ జరిపిన కాల్పులకు ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)లో సాధించిన విజయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో 13 శత్రు స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆర్మీకి చెందిన కల్నల్ ఒకరు మీడియాకు తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మే 6- 7 తేదీల మధ్య రాత్రి శత్రువులు రెండు మోర్టార్ బాంబులను(Mortar bombs) పేల్చారు. మేము ముందస్తు సమన్వయంతో కూడిన కాల్పుల ప్రణాళికతో శత్రువులకు చెందిన 13 పోస్టులను (బంకర్లు) నాశనం చేశాం. ఇందుకు మాకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఆ సమయంలో ప్రతి జవాన్ సిద్ధంగా ఉన్నారని, కమాండర్, ఉన్నత ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు అందరికీ అందాయని అన్నారు. అలాగే శత్రువులపై ఏ ఆయుధాలను ప్రయోగించాలో, వారికి గరిష్ట నష్టం కలిగించడానికి ఎంత సమయం పడుతుందో తమకు ముందుగానే తెలుసన్నారు.మే 6-7 తేదీల మధ్య రాత్రి వేళ తాము సాగించిన ప్రతీకార దాడులను చూసిన శత్రు సైన్యం, మళ్లీ ఇలాంటి తప్పు చేసేందుకు వందసార్లు ఆలోచించేలా బదులిచ్చామని ఆ కల్నల్ పేర్కొన్నారు. పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నందుకు ప్రతిస్పందనగా భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది. లష్కరే తోయిబా శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఇది కూడా చదవండి: Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నంబాల మృతి?
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 25 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతుల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు బసవరాజుపై కోటిన్నర రివార్డు ఉంది. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివిన వ్యక్తి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు ఉన్నారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి బసవరాజు.

Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?
అది 1991, మే 21.. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో యావత్‌దేశం కంటతడిపెట్టే ఉదంతం చోటుచేసుకుంది. నాటి దేశ యువ ప్రధాని రాజీవ్‌గాంధీ విద్రోహుల ఘాతుకానికి బలయ్యారు. ఈ రోజు (మే 21, 2025) రాజీవ్‌గాంధీ 34వ వర్థంతి. ఇంతకీ నాడు రాజీవ్ హత్య ఎలా జరిగింది? ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీ ఎలా ప్రాణాలు కోల్పోయారు? వివరాల్లోకి వెళితే..మరకతం చంద్రశేఖర్‌కు మద్దతుగా..శ్రీ పెరంబుదూర్.. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. నాడు రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్‌గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్‌లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్‌ను చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.పటిష్టంగా లేని బారికేడ్లు..దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్‌కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ ఏజే దాస్‌కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్.. తన కుమార్తె కోకిలను ఆ లిస్ట్‌లో చేర్చాలంటూ దాస్‌పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కుమార్తె లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేవారు. అయితే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్‌కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు.ఫ్లైట్ రిపేర్ కాకుంటే..ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ వైజాగ్ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. అయితే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్ దానిలోని లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్‌కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ తిరిగి విమానం వద్దకు వచ్చేశారు.స్వయంగా ఫ్లైట్ నడుపుతూ..సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్‌లోని మీనంబాకం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు.జనం మధ్యకు కళ్లద్దాల యువతిరాజీవ్ రాకతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. రాజీవ్‌ను చూడడానికి ప్రజలు పోటీపడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజీ దగ్గరకు చేరుకున్నారు. అయితే ఇంతలో ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది.అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తూ..రాజీవ్ చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ, పరుగులు పెడుతున్నారు. స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనన నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా ఎస్ఐ అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది.20 అడుగుల ఎత్తున మంటలుఎస్ఐ వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మారుమోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుంది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్‌ను మృత్యువు కబళించింది. ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి.

విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.

వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు.
వీడియోలు


తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా


పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ


ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు


మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..


కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం


కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్


సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు


Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా


సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు


Major Encounter: భారీ ఎన్కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు