Top Stories
ప్రధాన వార్తలు

రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి.

కట్టిన మూడేళ్లకే కూలింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు. ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది ‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మూడుచోట్లా కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు ‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. హెలీకాప్టర్‌లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్‌లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఎవరి పని వారు చేయాలి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంజనీర్ ఇన్ చీఫ్ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్ చెప్పారు. ‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది ‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు.

లిక్కర్ మాఫియా డాన్ 'చంద్రబాబే'
సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్ లిక్కర్లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్ హౌస్, హై ఓల్టేజ్ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.తదియ రా.1.46 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.26 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.8.58 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం.. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృషభం.... ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం... నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.సింహం.... కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.కన్య.... రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.తుల... ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృశ్చికం... విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.ధనుస్సు.. ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ఎవరి కోసం ఈ ఒప్పందం?
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్: 98859 83526

‘శాంతిదూత’ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది. తన రెండో దశ పాలనలో ట్రంప్ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు. అల్–షారాకు గతంలో అల్ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు. కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు. ‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు. స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు. సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్ వెన కాడలేదు. అమెరికన్ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.ఈ పర్యటనలో ట్రంప్ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు.

ద్వైపాక్షిక వాణిజ్యాల ‘లోటు’పాట్లు
మూడేళ్ల చర్చల అనంతరం మే 6న ఇండియా, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ఇండియాకు జరిగిన మేలెంతో, లోటెంతో సమీక్షించుకోవడం అవసరం.ఏదైనా రెండు దేశాల మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’గా భావిస్తాం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా వస్తు, సేవల వినిమ యానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరుగుతాయి. దిగుమతి సుంకాలు, దిగుమతి కోటాలు, ఎగుమతులపై నియంత్రణ లాంటి వాణిజ్య అడ్డంకుల నిర్మూలనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2024 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 373 వాణిజ్య ఒప్పందాలపై (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు కలుపుకొని) ఇండియా సంతకం చేసింది.ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువమార్కెట్ అందుబాటు పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా అధిక వృద్ధి సాధన లక్ష్యంగా వివిధ దేశాలతో భారత్ ఈ ఒప్పందాలు కుదు ర్చుకుంది. కానీ ఆ లక్ష్య సాధనలో ప్రతికూల, మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వ్యవసాయం, తయారీ, సేవా రంగాలను పరిశీ లించినప్పుడు ఆ యా రంగాలకు సంబంధించి కొన్ని పరిశ్రమలు ప్రయోజనం పొందగా, మిగిలిన రంగాలు అనేక సవాళ్ళను ఎదు ర్కొంటున్నాయి. వాణిజ్య ఒప్పందాల కారణంగా వాణిజ్య పరిమాణంలో పెరుగుదల ఏర్పడినప్పటికీ, ఎగుమతులతో పోల్చినప్పుడు దిగుమతుల పరిమాణం పెరిగి భారత్‌కు సంబంధించి వాణిజ్య లోటు పెరిగింది. ‘ఏషియాన్’– ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత, ఆ యా దేశాలకు సంబంధించి భారత్ వాణిజ్య లోటు 2011లో 7.5 బిలియన్ డాలర్లు కాగా, 2023లో 44 బిలియన్ డాలర్లకు పెరిగింది. దక్షిణ కొరియాతో ఒప్పందం జరిగే సమయంలో భారత్ వాణిజ్య లోటు 4 బిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం 9 బిలి యన్ డాలర్లకు పెరిగింది.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా భారత్ స్వదేశీ పరి శ్రమలు – ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, వ్యవసాయం, డైరీ రంగాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఒప్పంద దేశాల నుండి ‘చౌక దిగుమతుల’ కారణంగా భారత్‌లో స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. వాణిజ్య సరళీకరణ వలన ఐటీ, సేవలకు కొంతమేర ప్రయోజనం ఏర్పడి నప్పటికీ, సంప్రదాయ పరిశ్రమలు అధిక దిగుమతుల కారణంగా పోటీ ఎదుర్కొంటున్నాయి.స్థానిక మార్కెట్లో విదేశీ కంపెనీల ప్రవేశం వలన చిన్న, స్థానిక వ్యాపారాలు పోటీని ఎదుర్కోలేక మూసివేతకు గురవుతాయి. అలాగే కొన్ని ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అధిక సామర్థ్యంతో కూడిన సప్లయ్‌దారుల నుండి వాణిజ్య ప్రవాహం భాగస్వామ్య దేశా లకు జరుగుతుంది. 2017 నుండి 2022 మధ్య కాలంలో ఒప్పంద భాగస్వామ్య దేశాలకు సంబంధించి భారత్ ఎగుమతులలో 31 శాతం పెరుగుదల ఏర్పడగా, దిగుమతులలో 82 శాతం పెరుగుదల ఏర్పడింది. దక్షిణ కొరియా, ఏషియాన్ దేశాలు టెక్స్టైల్స్, తోలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌ను తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం వలన ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.దిగుమతేతర సుంకాల ఇబ్బందులువాణిజ్య ఒప్పందాలలో భాగంగా దిగుమతి సుంకాలకు సంబంధించి స్పష్టత ఉన్నప్పటికీ, దిగుమతేతర సుంకాలు వస్తు ప్రవాహానికి అవరోధంగా నిలుస్తున్నాయి. దిగుమతి కోటా, దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్(వస్తు తయారీ మూలానికి సంబంధించిన), శానిటరీ, ఫైటో శానిటరీ(చీడలు, వ్యాధులు లేవని చెప్పాల్సిన) చర్యలు, సాంకేతిక నియంత్రణలు, కస్టమ్స్ కార్యసరళిని దిగుమతే తర సుంకాలుగా భావింపవచ్చు.దక్షిణ కొరియా మార్కెట్ అందుబాటు భారత ఉత్పత్తులకు క్లిష్టంగా మారడానికి శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు, సర్టిఫికేషన్ ఆవశ్యకత లాంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లిష్టతరంగా ఉండటం, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యల వల్ల థాయ్‌లాండ్‌కు భారత ఎగుమతుల వృద్ధి తగ్గింది. మలేషియా అవలంబిస్తున్న వాణిజ్యపరమైన సాంకేతిక అడ్డంకులు, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగుమతేతర సుంకాల చర్యలలో భాగంగా ఆరోగ్యం, భద్రతా సర్టిఫికేషన్స్, బయో సెక్యూరిటీ ఆవశ్యకత, ఇతర ప్రమాణాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపించాయి. అధిక దిగుమతి ప్రమాణాలను పాటిస్తున్న కారణంగా జపాన్‌కు సంబంధించి భారత్ ఎగుమతులలో ప్రతిష్టంభన ఏర్పడింది. దిగుమతేతర సుంకాలు భారత్ ఎగుమతిదారుల ఎగు మతుల అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. వాణిజ్య వ్యయాల పెరుగుదల, మార్కెట్ అందుబాటు పెరగకపోవడం వాణిజ్య సరళీ కరణ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోవడానికి కారణ మయ్యాయి.ఉదాహరణకు 2019–23 కాలానికి జపాన్‌కు ఇండియా ఎగుమతుల విలువ 5,730 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 19,900 మిలియన్ డాలర్లు. ఇదే కాలానికి యూఏఈకి మన ఎగుమతుల విలువ 30 వేల మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 50,510 మి.డాలర్లు. ఇక ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు 8,730 మి.డాలర్లు కాగా, దిగుమతులు 11,300 మి.డాలర్లు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, చిలీ లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థలు మినహా పెద్ద వాణిజ్య దేశాలతో భారత్ వాణిజ్య లోటు పెరిగింది. అయితే, 2000–24 మధ్య కాలంలో మారిషస్, సింగపూర్, జపాన్, యూఏఈ నుండి భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రం ఆకర్షించగలిగింది. భారత్ మొత్తం వాణిజ్యంలో భాగ స్వామ్య ఒప్పంద దేశాల వాటా సుమారు 20 శాతం.అడ్డంకులు తొలగించుకునేలా...ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలుగా– నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్–నాఫ్టా (అమెరికా, మెక్సికో, కెనడా), ట్రాన్స్ – పసిఫిక్ భాగస్వామ్యం (జపాన్, ఆస్ట్రే లియా, సింగపూర్), సమగ్ర ప్రాంతీయ భాగస్వామ్య ఒప్పందం(ఆర్సీఈపీ), చైనా – ఏషియాన్ ఒప్పందాలను పేర్కొనవచ్చు. భారత్‌కు సంబంధించి వాణిజ్య ఒప్పందాల ముందు కాలంతో పోల్చినప్పుడు ఒప్పందం అమలు కాలంలో భారత్ వాణిజ్య పరి మాణం, విలువలో పెరుగుదల ఏర్పడింది. అయితే, ముఖ్య భాగ స్వామ్య దేశాల నుండి దిగుమతులు పెరిగిన కారణంగా భారత్ వాణిజ్య లోటులో పెరుగుదల ఏర్పడింది. అందుకే వాణిజ్యపరంగా వ్యూహాత్మకమైన దేశాలతో ఒప్పందాల కోసం భారత్ ప్రయత్నించాలి. నియంత్రణలు, దిగుమతేతర సుంకాల అడ్డంకులను భాగస్వామ్య దేశాలు తొలగించే విధంగా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలి. అమెరికాతో సహా వాణిజ్య పరంగా ముందంజలో ఉన్న ఏ దేశాలతోనైనా దిగుమతి సుంకాలు, దిగుమతేతర సుంకాల చర్యలను తగ్గించినట్లయితే భారత్ మార్కెట్ విస్తృతి పెరుగుతుంది.వ్యాసకర్తలు డా‘‘ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్ అండ్ డీన్; రితికారావు వీరిశెట్టి, పీహెచ్డీ స్కాలర్,ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్

మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

గడుల ఆట... కొత్త బాట!
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు మారబోతున్నాయి. దీంతో గడుల్లో వేసే ఎత్తులు, పైఎత్తులు కొత్త ఫార్మాట్లో జరగనున్నాయి. అయితే ఈ తరహా ఫార్మాట్ ఇప్పుడైతే ఖతర్‌లో జరిగే టోర్నీలో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొనసాగుతుందో లేదో టోర్నీ జరిగిన విధానం, ఆసక్తిగొలిపిన వైనాన్ని బట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి ఇన్నాళ్లు జరిగిన ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలది ఒక లెక్కయితే... దోహాలో జరగబోయేది మాత్రం కొత్త లెక్క! ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ మాత్రం మారలేదు. తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది. టూకీగా... ఇదీ టోర్నీ కహానీ! ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ టోర్నీకి దోహా (ఖతర్) ఆతిథ్య వేదిక కాగా... డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 10 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 9.58 కోట్లు). ఓపెన్ కేటగిరీ విజేతలకు ర్యాపిడ్, బ్లిట్జ్ (3.5 లక్షల యూరోల చొప్పున) 7 లక్షల యూరోలు (రూ. 6.7 కోట్లు), మహిళల విభాగం విజేతలకు 3 లక్షల యూరోలు (రూ.2.87 కోట్లు). ర్యాపిడ్, బ్లిట్జ్లకు లక్షన్నర యూరోల చొప్పున కేటాయించారు. బ్లిట్జ్ ఫార్మాట్ మార్పులివి... ఈ ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నాకౌట్ దశను మరింత క్రమబద్దీకరించారు. అంటే గతంలో ఎనిమిది మందితో మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ స్థానంలో ఇప్పుడు నలుగురు మాత్రమే పాల్గొనే సెమీఫైనల్‌ను తీసుకొచ్చారు. ఈ టోర్నీల తొలిదశ స్విస్ లీగ్ పద్ధతి నుంచి నేరుగా సెమీఫైనల్స్ పోటీలే జరుగుతాయి. మధ్య ఎనిమిది మంది బరిలో ఉండే క్వార్టర్ ఫైనల్స్ ఉండవిక! ఈ మార్పుతో ఒరిగేదేంటి? ‘ఫిడే’ అధికారుల వివరణ ప్రకారం కొత్త బ్లిట్జ్ ఫార్మాట్లో స్విస్ లీగ్ పద్ధతి నుంచి నాకౌట్ చేరే వరకు ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా, పోటాపోటీగా జరిగే అవకాశముంటుంది. స్విస్ లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇందులో నిలకడైన ప్రదర్శన కనబరిచిన వారే చివరకు నాకౌట్ దశ (సెమీస్)కు అర్హత సాధిస్తారు. అంటే ఒకరితో ఒక ఎత్తు పొరపాటుతో ఓడిన మ్యాచ్, మరొకరు ఒక పైఎత్తుతో గెలిచిన మ్యాచ్‌ల వల్ల నాకౌట్ అవకాశాలు కోల్పోరు. ఎందుకంటే విరివిగా ఉండే లీగ్ మ్యాచ్‌ల వల్ల ఒక పొరపాటును అధిగమించి మరో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలుంటాయి. బ్లిట్జ్‌లో 19 రౌండ్లు ఓపెన్ కేటగిరీలో బ్లిట్జ్ చాంపియన్‌షిప్ 19 రౌండ్ల పాటు జరుగుతుంది. మహిళల విభాగంలో 15 రౌండ్ల పాటు నిర్వహిస్తారు. అనంతరం నలుగురు చొప్పున సెమీఫైనల్‌కు చేరతారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరి మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, నియమనిబంధనల్ని ఫిడే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. యథాతథంగానే ర్యాపిడ్ ఈవెంట్ బ్లిట్జ్ పోరు మారింది. కానీ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను ఫిడే మార్చలేదు. ఓపెన్ కేటగిరీలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్ల మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రస్థానంలో నిలిచిన వారే విజేతగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ టాప్‌లో పాయింట్లు సమంగా ఉంటే మాత్రం విజేతను తేల్చడానికి ప్లేఆఫ్ పోటీని నిర్వహిస్తారు. గత ఏడాది న్యూయార్క్ వేదికగా ప్రపంచ ర్యాపిడ్, చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్‌లో విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల ముర్జిన్... మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి విజేతలుగా నిలిచారు. బ్లిట్జ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా), కార్ల్సన్ (నార్వే) సంయుక్త విజేతలుగా నిలువగా... మహిళల విభాగంలో చైనాకు చెందిన జు వెన్జున్ టైటిల్ సాధించింది.

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. హైదరాబాద్‌లోనూ..
అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రారంభించింది. ఇప్పుడున్న సంప్రదాయ డిజైన్లోనే మరింత అత్యాధునిక భద్రతను జోడిస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (PKI) ఎన్క్రిప్షన్తో వీటిని రూపొందించింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం(PSP) వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తోంది.ఎక్కడెక్కడ?ప్రస్తుతం నాగ్‌పూర్, రాయపూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లను పైలట్ విధానంలో జారీ చేస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వీటి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 2025 మార్చి 22 నాటికి 20,729 ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి.ఏమిటి ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకత?భారతీయ ఈ-పాస్‌పోర్ట్ కవర్లో యాంటెనా, చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్‌ను అనుసంధానం చేస్తారు. పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ చిప్ ద్వారా మెరుగైన భద్రత, వేగవంతమైన వెరిఫికేషన్ లభిస్తుంది. ఈ-పాస్‌పోర్ట్‌ను దాని ముందు కవర్ కింద ముద్రించిన ప్రత్యేకమైన బంగారు రంగు చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. చిప్ లోని సున్నితమైన డేటా దుర్వినియోగం కాకుండా పబ్లిక్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ఎన్క్రిప్షన్ వ్యవస్థ రక్షిస్తుంది.తప్పనిసరా?ప్రస్తుతం ఉన్న పాస్ పోర్టులను ఈ-పాస్‌పార్ట్‌లుగా మార్చుకోవడం తప్పనిసరి కాదు. అవి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులకు మారడం స్వచ్ఛందం. అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సాంకేతిక ఆధారిత, భద్రత-కేంద్రీకృతంగా మారుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తోంది.ఈ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు ఇలా..నాగ్‌పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులు ఇప్పుడు ఆన్లైన్లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని నిర్దిష్ట పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలులేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల నుండి వీటిని తీసుకోవచ్చు.🔸 దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా ఆన్లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.🔸 ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావాలి.🔸 "అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్/ రీ-ఇష్యూ పాస్‌పోర్ట్" ఆప్షన్ ఎంచుకోండి.🔸 మీరు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటే "ఫ్రెష్" ఎంచుకోండి. ఇప్పటికే ఉన్నవారు "రీఇష్యూ" ఎంచుకోండి.🔸అపాయింట్ మెంట్ తీసుకుని ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.🔸 అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీ దరఖాస్తు రసీదును ప్రింట్ లేదా సేవ్ చేయవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ధృవీకరణను సమర్పించవచ్చు.🔸 నిర్ణీత తేదీలో, మీరు ఎంచుకున్న పాస్‌పార్ట్ కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లండి.
టీపీసీసీకి జంబో కార్యవర్గం!
మిగులు టీచర్ల దిగులు
చెరుకు పంటకూ బోనస్!
నేటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
తెలుగు అమ్మాయిల్లా..
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
పోలాండ్ ఈవెంట్‌కు నీరజ్
గడుల ఆట... కొత్త బాట!
ఎవరి కోసం ఈ ఒప్పందం?
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
కర్నూలులో కాలుష్య కాసారం
విజయ్‌కు 105 సీట్లు?
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
టీపీసీసీకి జంబో కార్యవర్గం!
మిగులు టీచర్ల దిగులు
చెరుకు పంటకూ బోనస్!
నేటి నుంచి సరస్వతీ నది పుష్కరాలు
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
తెలుగు అమ్మాయిల్లా..
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
పోలాండ్ ఈవెంట్‌కు నీరజ్
గడుల ఆట... కొత్త బాట!
ఎవరి కోసం ఈ ఒప్పందం?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
కర్నూలులో కాలుష్య కాసారం
విజయ్‌కు 105 సీట్లు?
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
పసిడికి అమ్మకాల సెగ
సినిమా

వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు: వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యానిమల్ మూవీ దర్శకుడిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారని.. రణ్‌బీర్ కపూర్‌ను విమర్శించే ధైర్యం బాలీవుడ్లో ఏ డైరెక్టర్‌కు లేదని అన్నారు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..'యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే రణ్‌బీర్ కపూర్‌ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతను చాలా పవర్ఫుల్. అందుకే అతన్ని విమర్శించడానికి ఎవరూ లేరు. వారికి అంత ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడమనండి.బాలీవుడ్లో చాలా మంది దర్శకులు హీరోల గురించి కేవలం వారి వెనుక మాత్రమే మాట్లాడుతారు. వారికి బహిరంగంగా ఏదైనా చెప్పే ధైర్యం కూడా వారు చేయరు. కాబట్టి వారు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఎంత నీచంగా నటించినా రూ.150 కోట్లు ఇస్తారు. 51 ఏళ్ల నటులు తమంతట తాము నిజమైన స్టార్లు అయితే ఎంత సంపాదించినా తనకు అభ్యంతరం లేదు.నా సమస్య ఏమిటంటే స్టార్డమ్ లేకున్నా స్టార్లలా ప్రవర్తించే వ్యక్తులతోనే. అలా చలామణి అయ్యే వారంటే నాకు నచ్చదు' అని అన్నారు.కాగా.. అంతకుముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్‌పై విమర్శలపై స్పందించారు. అందరు విమర్శకులు తననే టార్గెట్ చేశారని అన్నారు. మరోవైపు రణ్‌బీర్ కపూర్ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఎందుకంటే వారంతా రణ్‌బీర్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైందని సందీప్ వంగా వెల్లడించారు. నేను బాలీవుడ్ కొత్త కావడం నాపై విమర్శలు చేయడం వారికి సులభమని అన్నారు.

అలాంటి దేశాల్లో మన డబ్బులు ఖర్చు చేయకండి: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్‌కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్‌పై ఓ నెటిజన్స్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.Anyone still visiting Turkey ? Please read this Below Thread...Indians Spend Billions of Dollars Every year in Turkey. Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025

బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్‌స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే..మళ్లీ సినిమా చాన్స్‌లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు. ఆ సినిమా ఫస్డ్డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది.

'ప్రేమలు' బ్యూటీ రెమ్యునరేషన్.. రేటు పెంచేసిందా?
హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు. మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. 'ప్రేమలు' బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది.మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు 'ప్రేమలు' మూవీతో హీరోయిన్ గా బ్రేక్ దొరికింది. అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'డ్యూడ్', దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. (ఇదీ చదవండి: మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్) ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత.. ఇప్పుడు 'డ్యూడ్' కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటోందట. దళపతి విజయ్ తో చేస్తున్న జన నాయగణ్ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట.ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం
క్రీడలు

భారత్‌లో ఆసియా కప్ హాకీ: పాక్‌కు ఎంట్రీ కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది. భారత్‌లో జరిగే టోర్నీ కోసం పాక్‌ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్‌కోట్‌లో భారత ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్‌కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు. అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి.

ఆరేళ్ల తర్వాత విండీస్‌తో టీ20, వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన ఐర్లాండ్
ఐర్లాండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆరేళ్ల తర్వాత తొలిసారి వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్దమైంది. వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు విండీస్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది.ఈ క్రమంలో విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ బుధవారం ప్రకటించింది. రెండు ఫార్మాట్లలోనూ ఐర్లాండ్ జట్టు కెప్టెన్‌గా పాల్ స్టిర్లింగ్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ జట్లలో ఎక్కువగా యువ ఆటగాళ్లకు ఐరీష్ సెలక్టర్లు చోటు కల్పించారు.టాప్-ఆర్డర్ బ్యాటర్ కేడ్ కార్మైకేల్, పేసర్ టామ్ మేయెస్లు తొలిసారి ఐర్లాండ్ వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ లియామ్ మెక్‌కార్తీని టీ20 జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లతో పాటు హ్యారీ టెక్టర్, జోష్ లిటిల్, జార్జ్ డాక్రెల్, కర్టిస్ కాంఫర్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. మే 21న డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో విండీస్ జట్టు ఐర్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది.విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఐరీష్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, కేడ్ కార్మైకేల్, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, టామ్ మేయెస్, ఆండ్రూ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, లియామ్ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్విండీస్తో టీ20 సిరీస్‌కు ఐరీష్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, లియామ్ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్‌గా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది . ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది."1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్‌లోని పేరా 31 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకును ప్రధానం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని" రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా నీరజ్ ముందుగా 2016 నయీబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైన్యంలో చేరాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్-2021లో గోల్డ్ మెడల్ సాధించడంతో సుబేదార్‌గా పదోన్నతి పొందాడు. కాగా నీరజ్ చోప్రా..ఇండియన్ అథ్లెటిక్స్ హిస్టరీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే గోల్డెన్ బాయ్‌కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కాగా దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రత్యేక హోదా భారత సైన్యం సత్కరిస్తోంది. ఈ గౌరవ హోదా పొందిన ఆరో క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. నీరజ్ కంటే ముందు ప్రముఖ షూటర్లు అభినవ్ బింద్రా, విజయ్ కుమార్.. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఈ అరుదైన గౌరవాన్ని పొందారు.

కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు.. ఇంగ్లండ్‌కు పంపండి: కుంబ్లే
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ తర్వాత వారం రోజులకే విరాట్ కోహ్లి కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్‌కు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది. అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.కాగా కరుణ్ నాయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
బిజినెస్

ఈసారి 7,000 మంది బలి?
అగ్రగామి సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సీఎన్‌బీసీ తెలిపింది. ఇప్పటికే 2023 నుంచి కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు పేర్కొంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆవిష్కరణలపై సంస్థ గణనీయంగా పెట్టుబడులు పెంచుతోంది. ఈమేరకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించే విస్తృత వ్యూహంలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఇటీవల రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని గతంలో తెలిపింది.ఇదీ చదవండి: వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీపీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు గతంలో తెలిపారు.

వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీ
భారత ఎయిర్ కండిషనర్(ఏసీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సంవత్సరానికి 1.4 కోట్ల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, ప్రజల డిస్పోజబుల్ ఆదాయాలు(ఖర్చులన్నీ పోను మిగులు ఆదాయాలు) అధికమవ్వడం ఏసీల కొనుగోళ్లకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు వీటిని లగ్జరీ వస్తువుగా కాకుండా, అవసరంగా భావిస్తున్నారని చెబుతున్నారు. ఏసీల కొనుగోళ్లలో పెరుగుదల కంపెనీలకు శుభపరిణామమే అయినా ఇతర అంశాలకు సంబంధించి తీవ్ర సవాళ్లను ఎత్తి చూపుతుంది.పెరుగుతున్న డిమాండ్దేశంలో ఎక్కువ మంది ప్రజలు నగరాలకు తరలివెళ్తున్నారు. వారి ఆదాయాలు మెరుగుపడటంతో ఏసీ కొనుగోళ్లకు మెగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఏసీలు కలిగి ఉన్నవారు కొత్త టెక్నాలజీ వర్షన్ మోడళ్లకు అప్డేట్ అవుతున్నారు. దాంతో వీటి డిమాండ్ పెరుగుతోంది. ఏసీని కొంత మంది మధ్య తరగతి ప్రజలు స్టేటస్ సింబల్‌గా కూడా చూస్తున్నారు. ఇటీవల వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రికార్టు స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. వీటి వల్ల ఏసీ లగ్జరీ నుంచి అవసరంగా మారుతోంది.ఫైనాన్సింగ్ కంపెనీలు సైతం ఏసీ కొనుగోళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో సులువైన నెలవారీ వాయిదా పద్ధతులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇది కూడా ఏసీల అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతుంది. 2050 నాటికి రెసిడెన్షియల్ ఏసీల వినియోగం ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు అధికమవుతుందని, దీనివల్ల విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాళ్లు..దేశంలో అధికశాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ తయారీ స్థానంలో పునరుత్పాదక ఇంధన తయారీని అభివృద్ధి చేస్తున్నా ఇంకా ఆమేరకు ప్రయత్నాలు కొంతమేరకే ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకైతే వేసవి కాలంలో ఎక్కువగా వాడే ఏసీలకు అవసరమయ్యే అధిక విద్యుత్‌ను బొగ్గు మండించడం ద్వారానే తయారు చేస్తున్నారు. ఇది భారత విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఏసీల్లో నుంచి వెలువడే గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది.ఇదీ చదవండి: చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!పరిష్కారాలు..పునరుత్పాదక ఇంధన తయారీని పెంచాలి. సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. తక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యూపీ) రిఫ్రిజిరెంట్లతో కూడిన హై స్టార్ రేటెడ్ ఏసీలను వాడాలి. ఏసీల్లో ఇన్నోవేటింగ్ కూలింగ్ టెక్నాలజీస్‌ను ఉపయోగించాలి. ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచడానికి అర్బన్ ప్లానింగ్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి ఏసీపై ఆధారపడటాన్ని పరిమితం చేయాల్సి ఉంది.

చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్ డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. అందులో భాగంగా స్లిమ్‌గా ఉండే ఫోన్ల తయారీపై సంస్థలు ఫోకస్ పెట్టాయి. వినియోగదారుల చేతిలో ఇట్టే నప్పేలా వాటిని తయారు చేస్తున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని స్లిమ్ డిజైన్ ఫోన్ల వివరాలు కింద తెలుసుకుందాం.శామ్సంగ్ గెలాక్సీ ఎస్25మందం: 6.2 మి.మీస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్50 ఎంపీ కెమెరా4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.65,399ఒప్పో రెనో13మందం: 6.5 మి.మీడైమెన్సిటీ 8350 ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా5600 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.35,999వివో వీ50 మందం: 6.7 మి.మీస్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ డ్యుయల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.34,999ఇదీ చదవండి: ఆర్బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్?ఐకూ నియో 10ఆర్మందం: 6.8 మి.మీస్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ కెమెరా6400 ఎంఏహెచ్ బ్యాటరీధర: సుమారు రూ.26,999మోటరోలా ఎడ్జ్ 60 ప్రోమందం: 6.9 మి.మీడైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.29,999

ఆర్బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించిన తరువాత భారత బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు లిక్విడిటీ గణనీయంగా పెరుగుతుందని కొన్ని సంస్థల నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ లిక్విడిటీ రూ .6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఆర్బీఐ ప్రభుత్వానికిచ్చే డివిడెండ్లు రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.2.75 లక్షల కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇది కేంద్ర ఆర్థిక వనరులను గణనీయంగా పెంచుతుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.అధిక రాబడినిచ్చే అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ మారక నిల్వలపై రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. రూపాయి అస్థిరతను నిర్వహించడానికి డాలర్లను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలతో ఆర్బీఐ ఆదాయం సమకూర్చుకుంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బాండ్ మార్కెట్ ద్వారా ఆర్బీఐ రూ.1.95 లక్షల కోట్లు రాబడిని అందుకున్నట్లు అంచనా. ఆర్బీఐ క్రియాశీల డాలర్ అమ్మకాలు కూడా ఈ ఆదాయానికి తోడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి స్థూల డాలర్ అమ్మకాలు 371.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2024 సెప్టెంబర్‌లో విదేశీ మారక నిల్వలు 704 బిలియన్ డాలర్లకు చేరాయి. తర్వాత కాలంలో ఆర్బీఐ 125 బిలియన్ డాలర్లకుపైగా విక్రయించినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..మే చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ మరింత మెరుగుపడి రూ.5.5-6 లక్షల కోట్లకు చేరుకుంటుందని బార్క్లేస్ అంచనా వేసింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్-పూచీకత్తు అవసరం లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అదనపు లిక్విడిటీని సమకూర్చకోవడానికి ఆర్బీఐ ప్రవేశపెట్టే సాధనం) రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి దగ్గరగా వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్ (డబ్ల్యూఏసీఆర్) తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులు ఆర్బీఐ రాబోయే ద్రవ్య విధాన వైఖరిని ప్రభావితం చేయనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, జూన్‌లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఫ్యామిలీ

Indo-Pak war సగం పర్యటనలు రద్దు, భారీ నష్టం
వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా పొగ మంచు అందాలు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకున్న నగర పర్యాటకులు అంతర్మథనంలో పడ్డారు. పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించింది. తరువాత పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఉత్తర భారత దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలా ఉంటుందో అనే ఆందోళన నగరవాసుల్లో కనిపిస్తోంది. దీంతో చాలా మంది తమ పర్యటనలను రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు పర్యటనలను రద్దు చేసుకోడానికే మొగ్గుచూపుతున్నారని ట్రావెల్ ఏజన్సీలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు మాత్రం వేరే ప్రాంతాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడం, పలువురు సెలబ్రిటీలు సైతం ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో పర్యటించడంతో పరిస్థితులు సద్దుమణిగాయనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వెళ్లి రావడానికి మరికొందరు మొగ్గుచూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఉత్తర భారతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్న యాత్రికులకు ఉగ్రదాడి అనంతరం పర్యటనలను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోడానికి మొగ్గుచూపుతున్నారు. మా సంస్థలోనే వెయ్యికి పైగా బుకింగ్స్ ఉండేవి. విమానాల రద్దుతో పర్యాటకులు తమ టూర్ ప్లాన్‌ను మార్చుకున్నారు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత 25 ఏళ్లుగా వేలాది మంది పర్యాటకులను పంపిస్తున్నా ఎన్నడూ ఈ స్థాయి ఒడిదుడుకులు చూడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరభారత దేశం అంటే యాత్రికులు అంత సుముఖంగా లేరు. రెండు రోజుల క్రితం ప్రధాని ప్రజలకు భరోసా కలి్పంచడంతో పరిస్థితులు కొద్దివరకూ మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. పూర్వ వైభవం రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నాం. – ఆర్వి రమణ, ఆర్వీ ట్రావెల్స్ ఛైర్మన్, హైదరాబాద్కుటుంబంతో కలసి నాలుగు రోజుల టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. మొన్నటి వరకూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దేశ సైనికుల పోరాటం ఫలించింది. తాజాగా పర్యటనకు కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తోంది. ట్రావెల్ ప్రతినిధులతోనూ సంప్రదించాం. సానుకూలంగానే స్పందించారు. వెళ్లవచ్చని భావిస్తున్నాం. – ప్రసాద్, ఉద్యోగి, హైదరాబాద్ శ్రీనగర్, కశ్మీర్ యాత్రకు ప్లాన్ చేసుకున్నాం. ఉగ్రదాడి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మా పర్యటన ప్లాన్ రద్దు చేసుకున్నాం. ప్రస్తుతం శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. నెలాఖరులోగా వెళ్లి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. భూతల స్వర్గమైన కశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరగడం బాధాకరం. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. – సుమిత్ర దేవి, హైదరాబాద్ ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?విమానం రద్దయ్యింది..భాగ్యనగరం నుంచి ఈ వేసవిలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కశ్మీర్, రాజస్థాన్, చార్ధామ్, రిషీకేశ్, జమ్మూ, శ్రీనగర్, సిమ్లా, డల్ హౌసీ, కాట్రా వైష్ణోదేవి ఆలయం, శ్రీనగర్, గుల్మార్గ్, లేహ్, ముస్సోరీ తదితర ప్రాంతాలకు సుమారు పదివేల మందికిపైగా ముందస్తు బుకింగ్ చేసుకున్నట్లు పర్యాటక ఏజన్సీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సుమారు 50 శాతం మంది తమ టూర్ ప్లాన్స్ రద్దుచేసుకుందామనే ఆలోచనకు వచ్చారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన నెలకొనడంతో ఎక్కువ మంది తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. మరో వైపు రైలు, విమాన సర్వీసులు రద్దు చేయడం, రవాణా సదుపాయాలు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా అనేక మంది తమ గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో పర్యాటకులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత వరకూ శాంతించడంతో తిరిగి ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. చదవండి: అలా రిటైర్మెంట్ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్!

టీబీ రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్లు..
ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టీబీ) రోగులకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, టీబీ రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించనుంది ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతి పోషకాహార కిట్‌లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె , వేరుశనగల, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమం, 2025 నాటికి టీబీని నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ కార్యక్రమమైన ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగం. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద నిక్షయ్ మిత్రగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నమోదయ్యింది. ఈ ప్రాజెక్ట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ మద్దతుతో నిర్వహించబడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి భారత్‌లోనే ఉండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి బాధితులలో దాదాపు 27% ఇక్కడే వున్నారు. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం.. 2022లో భారతదేశంలో 2.82 మిలియన్ల కొత్త టిబి కేసులు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 3 లక్షలకు పైగా మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించాయని అంచనా.చివరగా ప్రారంభోత్సవ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగింది, దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ జితేష్ వి పాటిల్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి హాజరయ్యారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ.. "మంచి ఆరోగ్యమనేది కేవలం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, సంపన్నమైన , ఉత్పాదక సమాజానికి పునాది అని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా టీబీ రోగులకు అవసరమైన పోష్టికాహార మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. ఈ వ్యాధి బారి నుంచి కోలుకునే ప్రయాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు తోడ్పడటం తోపాటు 2025 నాటికి భారతదేశంలో టీబీని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో మా వంతు పాత్ర పోషిస్తుండటం గర్వకారణంగా వుంది" అని అన్నారు.(చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!)

Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్ గ్రీన్ ట్యాబ్ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్ కేన్స్ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదుఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.హైలైట్ ఏంటంటేఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్ నెక్ పీస్ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది.

ఈ సమ్మర్లో సరదా సరదాగా ఈ పనులు నేర్చుకోండి..!
పిల్లలూ... పనులు పలు రకములు. వాటిలో నీళ్లతో చేసే పనులు వేరు. కారు కడగడం.. మొక్కలకు నీళ్లు పోయడం.. మాప్ పెట్టడం... చేస్తే సరదాగా ఉంటుంది. అవి రావు అనడానికి లేదు. నేర్చుకోవాలంతే. పెద్దయ్యాక ఉపయోగపడతాయి. ఈ సమ్మర్లో నీళ్ల పనులు నేర్చుకోండి. అందరూ మెచ్చుకుంటారు.బకెట్... మగ్... అండ్ వాటర్. ఛలో.... నాన్న కారు కడుగుదాం ఫస్ట్. కింద పార్కింగ్‌లో ఉంటుంది. బకెట్లో వాటర్ తీసుకొచ్చి, క్లాత్ ముంచి, కారును తుడుస్తూ ఉంటే దానిమీద దుమ్ముపోయి తళతళ మెరుస్తుంది. ఫోమ్, షాంపూ... ఇవన్నీ నాన్న అప్లై చేస్తే వాటర్ పైప్ తీసుకొని ఫోర్స్‌గా వాష్ చేయడం... జల్లు మన మీద పడుతుంటే పకపకా నవ్వడం... సమ్మర్లో ఏం చేశావ్ అని టీచర్ అడిగితే కార్ వాష్ చేశానని చెప్తే ‘వెరీగుడ్’ అంటారు తెలుసా?మీ బట్టలు ఉతికారా?మీకు మీ బట్టలు ఉతుక్కోవడం వచ్చా? బట్టలు ఉతుక్కోవడం రాకపోతే లైఫ్‌లో ఇబ్బంది పడతారు. మీకు 12 ఏళ్లు దాటాయంటే మీ బట్టలు మీరు ఉతుక్కునే వయసు వచ్చినట్టే. అమ్మను అడిగితే వాషింగ్ మెషీన్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తుంది. దాని సహాయంతో వాష్ చేసి, బట్టలు పిండి, ఆరవేయాలి. బట్టలు ఉతకడం ఎంత ముఖ్యమో ఆరవేయడం అంతే ముఖ్యం. గాలికి ఎగిరిపోకుండా, తీగ మీద నుంచి కింద పడిపోకుండా ఆరవేయాలి. వాటికి క్లిప్పులు పెట్టడం రావాలి. ఆరాక తీసుకొచ్చి మడత పెట్టి కప్‌బోర్డ్‌లో పెట్టుకోవాలి. బట్టలు ఉతికి, ఆరేసి, మడిచి పెట్టుకోవడం వస్తే మీరు సెల్ఫ్ డిపెండెంట్ అయినట్టే. చదువుకోవడానికి హాస్టల్లో ఉండాల్సి వచ్చినా ఇబ్బంది పడరు. కాబట్టి బట్టలు వుతకడం ఈ సమ్మర్లో నేర్చుకోండి.ఇల్లు తుడిచారా?ఇంటి ఫ్లోర్‌ను మాప్ పెట్టడం నేర్చుకుంటే మీ అంత గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ ఉండరు. బకెట్లో నీళ్లు తెచ్చి, మాప్ స్టిక్ దానిలో ముంచి, నీళ్లు పిండి, నేల మీద రుద్దుతూ మాప్ చేయాలి. అమ్మ, పని మనిషి అలా మాప్ చేయడం మీరు చాలాసార్లు చూశారు. ఈ సమ్మర్లో అది మీ వంతు. ఇంకా ముఖ్యమైన విషయం వాష్‌రూమ్‌లను కడగడం. ఇంట్లో వాష్‌రూమ్‌ను అందరూ వాడతారు. కాని వాటిని కడిగేది మాత్రం అమ్మే. ఈసారి మీరు నాన్నతో కలిసి వాష్‌రూమ్‌లను బాగా కడగండి. క్లీన్‌గా ఉన్న వాష్‌రూమ్‌లను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సమ్మర్లో వారం వారం వాష్‌రూమ్‌ను కడిగి అమ్మచేత శభాష్ అనిపించుకోండి.అంట్లు కడగడంఅబ్బ... ఈ పని ఎవరికీ నచ్చదు. నచ్చదని భోజనం చేయడం మానేస్తామా? భోజనం చేస్తే భోజనం కోసం వంట వండితే అంట్లు పడతాయి. భోజనానికి ఎంత వాల్యూ ఇస్తామో అంట్లకు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. అంట్లు కడగడం అబ్బాయిల పని కాదని కొందరు అంటారు. ఏం కాదు. అందరూ చేయాలి. డిష్ వాషర్‌తో అంట్లు తోమి ట్యాప్ కింద పెట్టి అవి క్లీన్ అవుతుంటే చూడటం బాగుంటుంది. అంట్లు కడగడంలో సాయం చేస్తే అమ్మకు చాలా సాయం చేసినట్టే.చెట్లకు నీళ్లు పోయడంఇది కూడా సరదా పని. ఈ సమ్మర్లో రోజూ మొక్కలకు నీళ్లు పోయడం మీ డ్యూటీగా చేసుకోండి. పైప్‌తో పోస్తారో బకెట్‌తో పోస్తారో మీ ఇష్టం. అలాగే తడిబట్టతో కప్‌బోర్డులన్నీ తుడిస్తే చాలా బాగుంటుంది. మురికి మంచిది కాదు. మురికి వదల్చని బద్ధకం మంచిది కాదు. నీటిని వాడి బద్ధకాన్ని శుభ్రం చేసుకోండి. పదండి. (చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!)
ఫొటోలు


Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు


Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు


గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)


హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)


సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం.. బడిబాట పట్టిన విద్యార్థులు (ఫొటోలు)


అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


దారి వెంట నీరాజనం..‘జై జగన్’ అంటూ నినాదాలు (ఫొటోలు)


#MissWorld2025: బ్యూటీ విత్ ఫన్..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)


చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)


చార్మినార్ దగ్గర మిస్ వరల్డ్ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు: జిన్‌పింగ్
అమెరికా - చైనా ప్రతీకార సుంకాల విషయంలో ఒక డీల్ కుదుర్చుకున్న తరువాత.. బీజింగ్‌లో బ్రెజిల్, కొలంబియా, చిలీ అధ్యక్షులతో సహా లాటిన్ అమెరికా, కరేబియన్ అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు 'జిన్‌పింగ్' మాట్లాడారు. బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని, ఒంటరిని చేస్తాయని అన్నారు.ప్రతీకార సుంకాలు లేదా వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఒక దేశం ఇంకో దేశానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్అమెరికా దిగుమతులపైన చైనా రెండు దేశాలు ఇప్పటికి విధించిన సుంకాలలో 115 శాతం తగ్గించుకున్నాయి. అంటే చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.

ఎయిర్ ఫోర్స్ వన్... ఫ్రీ!.. అమెరికా అధ్యక్షుడికి ఖతార్ గిఫ్ట్?
జనానికి ‘ఫ్రీ’ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినైల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ‘ఉచితం’ దేశాధ్యక్షులకూ బహు ప్రీతి. ఈ ఉచితం... ‘ఉచితమా’? సముచితమా? కాదా? అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఉచిత’ ఎయిర్ ఫోర్స్ వన్. ఖతారోడు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట్ట. అది సూపర్ లగ్జరీ ‘బోయింగ్ 747-8’ విమానం. ‘ప్యాలెస్ ఇన్ ద స్కై’ అంటున్నారు. ‘ఆకాశంలో ఎగిరే హర్మ్యం’గా అభివర్ణిస్తున్నారు. ప్రైవేటు బెడ్రూం సూట్, బోర్డు రూమ్స్, పాలరాయితో అలంకరించిన స్నానాలగదులు, గ్రాండ్ స్టెయిర్‌కేస్ వంటి ఫీచర్స్ అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తిపడుతోందా?అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కేవలం ‘విమానాల సేకరణ’ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవడం అనైతికం, చట్ట విరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్టుగా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే... తన పదవీకాలం ముగిశాక భవిష్యత్తులో ‘ప్రెసిడెంట్ లైబ్రరీ’కి ఆ విమానాన్ని దానంగా ఇస్తామని అంటున్నారు ట్రంప్.అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తవగానే అది ప్రెసిడెంట్ లైబ్రరీకి వెళ్లిపోతుందని ఆయన వివరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విషయానికొస్తే.. అవి రెండు విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతపరంగా అవి మేలైనవి. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవడం, గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత, డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చడం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారుచేసింది.బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పుచేర్పులు చేస్తూ అదనపు సొబగులు అద్దుతోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయడం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ‘747 విమానాల మేకప్ తతంగం’ ఇంకొన్నాళ్లు పట్టేట్టుంది. ట్రంప్ ప్రస్తుత రెండో టర్మ్ ముగిసేలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేట్టు లేవు. దీంతో దేశాధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఖతార్ గడ్డపై అమెరికాకు అతి పెద్ద సైనిక స్థావరం ఉంది.ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయల్దేరారు. మే 13-16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల్లో పర్యటిస్తారు. కొసమెరుపు- ‘కాంగ్రెస్ (చట్టసభలు) అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు/ప్రయోజనాలు పొందరాదు’ అని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మరి ‘ఖతార్ గిఫ్ట్’ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో! అధ్యక్షుడైనా చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపడం వెనుక ఖతార్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో!::జమ్ముల శ్రీకాంత్(Source: Huffpost, American Broadcasting Company news)

బుర్కినా ఫాసోలో మారణహోమం..100 మందికి పైగా మృతి
ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. బుర్కినా ఫాసో సహెల్ ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్‌గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులుజేఎన్ఐఎమ్ ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు. ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్‌పోర్టును ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు. ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారుల్ని నిర్బందించారు. అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో బీభత్సం సృష్టించారని చెప్పారు. Presidente de Burkina Faso, Ibrahim Traoré, gran líder de África que lucha contra el colonialismo de Francia, Alemania, Israel y EEUU. pic.twitter.com/s2uFuVA7pP— El Fantasma (@AlTopeyPunto198) May 13, 2025అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా సహెల్ బుర్కినా ఫాసో దేశంలో సైనిక పాలన కొనసాగుతుంది. ఆఫ్రికాలోని 11 దేశాల భూ భాగాల్లో సహెల్ ప్రాంతం ఒకటి. ఆ 11 దేశాల్లో 2.3 కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫాసో ఒకటి. అయితే ఆఫ్రికా దేశాల్లో సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపు సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టును కోల్పోయింది. అనునిత్యం బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించేందుకు ఆల్‌ఖైదాలాంటి ఉగ్ర సంస్థలు మారణహోమం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ హింస వల్లే 2022లో రెండు సార్లు భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్కూల్‌పై మయన్మార్ సైన్యం దాడి.. 20 మంది విద్యార్థులు మృతి
బ్యాంకాక్: మయన్మార్ సైన్యం సోమవారం ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులకు సమీపంలోని సగయింగ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డెపాయిన్ పట్టణ సమీపంలోని గ్రామంపై జరిగిన ఈ దాడిలో 50 మంది విద్యార్థులు గాయపడినట్లు ప్రైవేట్ మీడియా సంస్థలు తెలిపాయి.ప్రజాస్వామ్య అనుకూల వాదులు ఈ స్కూలును నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ప్రభుత్వ మీడియా ఈ దారుణంపై స్పందించలేదు. 2021లో అంగ్‌సాన్ సుకీ సారథ్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సాయుధ గ్రూపులకు వ్యతిరేకంగా సైనిక జుంటా భారీ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 6,600 మంది పౌరులు చనిపోయినట్లు అంచనా.
జాతీయం

మోదీ ఇంటిపై పాక్ దాడి చేయాలి.. నవాజ్ అరెస్ట్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ వీడియోలో మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో గురించి తెలిసి పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

పాకిస్తాన్‌కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 5.43 బిలియన్ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది.

పంజాబ్‌లో విషాదం
చండీగఢ్/అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 21 మంది అమాయకులు బలయ్యారు. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో 10 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సోమవారం రాత్రి ఐదు గ్రామాల నుంచి పోలీసులకు సమాచారం అందింది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం సరఫరాకు కారకులైన పది మందిని అరెస్ట్‌చేశారు. మద్యం ప్రధాన సరఫరాదారు ప్రభ్‌జీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రభ్‌జీత్ సింగ్ కీలక సరఫరాదారు సాహబ్‌సింగ్ పేరును వెల్లడించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎక్సయిజ్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద వేర్వేరు పోలీస్స్టేషన్లలో రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.నకిలీ మద్యం ఏరులై పారుతున్నా నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వం వెంటనే మజీఠా డెప్యూటీ ఎస్పీ అమోలక్ సింగ్, మజీఠా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవతార్ సింగ్‌ను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి మాన్ సింగ్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబంలోని చిన్నారులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మాన్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు.

ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నా..
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయనకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన సెర్మోనియల్ బెంచ్‌లో జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రసంగించారు. నూతన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఆయన చక్కగా పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచారని కొనియాడారు. జస్టిస్ గవాయ్ నాయకత్వాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నానని, రాజ్యాంగ విలువల పట్ల ఆయన అంకితభావం తిరుగులేనిదని వెల్లడించారు. తాము దాదాపు ఒకేసారి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందామని, కొలీజియంలో కలిసి పనిచేశామని చెప్పారు. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ అద్భుతమైన సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఖన్నాతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను జస్టిస్ బి.ఆర్.గవాయ్ కొనియాడారు. ఇది వీడ్కోలు కాదని, ఒక మార్పు మాత్రమేనని చెప్పారు. జస్టిస్ ఖన్నా వృత్తి జీవితం ఈరోజుతో ఆగిపోవడం లేదని, మరొకదానికి ఇది ఆరంభమని వివరించారు. జస్టిస్ ఖన్నా ఆలోచల్లో స్పష్టత, నైతికత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆయన ఇచి్చన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉన్నాయని చెప్పారు. జస్టిస్ ఖన్నాతో ఇన్నాళ్లూ కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జస్టిస్ ఖన్నా తమకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ... జస్టిస్ ఖన్నా న్యాయస్థానాల విలువ, గౌరవం ఎన్నోరెట్లు పెంచారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం జస్టిస్ ఖన్నా సేవలను గుర్తుచేసుకున్నారు. కపిల్ సిబల్ మాట్లాడుతూ... ఈ వారం దేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పదవీ విరమణ చేశారని చెప్పారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్ ప్రసంగించారు. రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఖన్నా న్యాయం పట్ల తిరుగులేని అంకితభావం కనబర్చారని చెప్పారు.
ఎన్ఆర్ఐ

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్‌లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు)

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం
క్రైమ్

భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా..!
బెళుగుప్ప(అనంతపురం): లగ్జరీ జీవితం ఆమె కల. పెళ్లి పేరిట ఆ కల నెరవేర్చాలనుకుంది. ఇందుకు దివ్యాంగుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంది. అనుకున్న విధంగా నగదు, నగలు, కారు సమకూర్చుకున్న తర్వాత.. భర్తతో గొడవ పెట్టుకుని ఉడాయించింది. అవసరాలన్నీ తీర్చి బికారిగా మారిపోయిన భర్త.. తన భార్య మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్ప మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం ఫయాజ్ దివ్యాంగుడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షబానా నచ్చింది. అటువైపు నుంచి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో అనంతపురంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనంతపురంలోనే ఓ ఇంటిని తీసుకుని కాపురం పెట్టారు. నమ్మించి.. వంచించి.. భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా అయిపోయాడు. ఆమె సంతోషం కోసం ఏది అడిగినా కాదనలేకపోయేవాడు. అలా తన మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో షబానా తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. మొదట తన అక్క జరీనా కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భర్త ఫయాజ్ పేరిట రూ.30 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. ఆయన వేతనం నుంచి 2024 ఫిబ్రవరి నుంచి రూ.60 వేల చొప్పున ఈఎంఐ కట్ అవుతూ వస్తోంది. ఆ తర్వాత అనంతపురంలోని సొంతింటిని కూడా విక్రయించి రూ.40 లక్షలు తీసుకుంది. దీంతో ఏడాదిగా బెళుగుప్పలోని అద్దె ఇంటికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే అనంతపురంలో ఫయాజ్ పేరున ఉన్న ప్లాట్‌ను సైతం విక్రయించి రూ.7 లక్షలు తీసుకుంది. అలాగే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు తులాల బంగారు నగలు కొనుగోలు చేయించింది. రాకపోకలకు అనువుగా ఉండాలని రూ.6 లక్షల విలువైన కారు కొనుగోలు చేయించింది. ఇలా తన అవసరాలు తీర్చుకున్న తరువాత గత నెల 28న బెళుగుప్పలోని నివాసంలో గొడవపడిన షబానా.. ఆ మరుసటి రోజే (29న) తన తల్లిదండ్రులు షమి, అలీ, అక్క జరీనాను పిలిపించి దివ్యాంగుడైన భర్తను ఇంట్లోనే బంధించి.. సామగ్రిని వాహనంలో వేసుకుని కారుతో సహా తెనాలికి వెళ్లిపోయింది. విలాసవంతమైన జీవితానికి అవసరమైన డబ్బు కోసం తనను వాడుకుని వంచనకు గురి చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫయాజ్ బెళుగుప్ప పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ మంగళవారం మీడియాకు తెలిపారు.

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
వినుకొండ : పొట్ట కూటి కోసం వస్తున్న కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డమీద పల్లె, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దారుపల్లి తాండకు చెందిన ఆరుగురు రైతు కూలీలు మంగళవారం బొప్పాయి తోటలో కాయ కోసేందుకు బొలెరో ట్రక్‌లో పల్నాడు జిల్లా ఈపూరు వస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి (45), పగడాల సుబ్బమ్మ (40) దంపతులు, దారుపల్లి తాండకు చెందిన జొన్నగిరి రామాంజి (35), జొన్నగిరి అంకమ్మ (28) దంపతులు మృతి చెందారు. లారీలో ఉన్న కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. పగడాల సుబ్బమ్మ, జొన్నగిరి అంకమ్మలు ఘటనా స్థలంలో మృతి చెందగా, రమణారెడ్డి, రామాంజిలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. వినుకొండ పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్, లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ యాదవ్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేసన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్‌కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్‌లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వీడియోలు


Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా


రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు


Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..


మిస్ వరల్డ్ పోటిలో తళుక్కుమన్న ఎమ్మా కథ ఇదే!


భారత్ కు పాకిస్థాన్ లేఖ


పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత


కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...


Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్


Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు


జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు