Nizamabad
-
అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి
ఆర్మూర్‌టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన పూజ(27)కు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి చెందిన సాయిలుతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు రష్మిత ఉండగా, రెండు నెలల క్రితం కొడుకు పుట్టాడు. భర్త సాయిలు నెల రోజుల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కాగా, మంగళవారం సాయంత్రం ఇంట్లో గొడవ జరగడంతో అత్త నర్సవ్వ, మరిది అశోక్, ఆడపడుచు శైలజ రాత్రి పూజను తీవ్రంగా కొట్టినట్లు కూతురు రష్మిత తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త సాయిలు, అత్త నర్సవ్వ, ఆడపడుచు శైలజ, మరిది అశోక్ వేధింపులకు గురి చేస్తుండేవారని పూజ కుటుంబీకులు ఆరోపించారు. పూజ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వడ్డెర కాలనీకి చేరుకున్నారు. తమ కూతురును అత్తింటి వారే కొట్టి చంపారని, వారిని తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. ఉద్రిక్తతల నడుమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. అత్తింటి వారే కొట్టి చంపేశారని కుటుంబీకుల ఆరోపణ తీవ్ర ఉద్రిక్తత.. భారీ పోలీస్ బందోబస్తు -
తెలుగు భాషకు ప్రాధాన్యమివ్వాలి
తెయూ (డిచ్పల్లి): తెలుగు భాషకు అన్ని స్థాయిల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలని వివిధ కళాశాలల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలుగు శాఖ విభాగాధిపతి సీహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి అధ్యక్షతన తెలుగు అధ్యాపకుల వార్షిక సదస్సును బుధవారం నిర్వహించారు. సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు ద్వితీయ భాషగా తెలుగు, మూడు సంవత్సరాలు, 20 క్రెడిట్స్‌తో ఉంది. కానీ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించి, 12 క్రెడిట్స్‌కు పరిమితం చేయాలని ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఇటీవల జరిపిన ఆనన్‌లైన్ సమావేశంలో నిర్ణయించడాన్ని అధ్యాపకులు ముక్తకంఠంతో ఖండించారు. యూజీసీ నిబంధనలను అనుసరించి భాష, సాహిత్యాలలో పీజీ కోర్సు చేయాలంటే డిగ్రీ స్థాయిలో తప్పనిసరి 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందని గుర్తుచేశారు. డిగ్రీ స్థాయిలో తెలుగు సబ్జెక్టును కోర్ సబ్జెక్టుగా దోస్త్‌లో సోషల్ సైన్సెస్, కామర్స్ కోర్సులలో బకెట్ సిస్టంలో చేర్చాలని, ఆసక్తి ఉన్న విద్యార్థులు తెలుగు చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. తెలుగు భాషను ‘ఉద్యోగం‘ అనే దృష్టి కోణం నుంచి చూడడం ప్రభుత్వాలు మానుకోవాలన్నారు. విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి సాహిత్య బోధన ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఆచార్య కే లావణ్య, ఆచార్య పీ కనకయ్య, వివిధ కళాశాలల తెలుగు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు బంగారు పతకం
నిజామాబాద్ నాగారం: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని టీజీఆర్ఎస్ మైదానంలో ఈనెల 21 వరకు జరిగిన 11వ రాష్ట్ర జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజేతగా నిలిచి బంగారు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జిల్లా జట్టుపై తలపడి 06–01 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ కె శోభన్ బాబు, తెలంగాణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు డి అభిషేక్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు నారాయణ గుప్తా జిల్లా క్రీడాకారులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. విజేతగా నిలిచిన జిల్లా జట్టును జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఉత్తమ పిక్చర్ చందు (బోధన్) ప్రత్యేక బహుమతి అందుకున్నాడు. జట్టుకు కోచ్ మేనేజర్లుగా ఈ నరేశ్, వినయ్, తిరుపతి వ్యవహరించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటెయినర్
● డ్రైవర్ మృతి, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో కంటెయినర్ డ్రైవర్ మృతి చెందగా క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ బైపాస్కు కొద్ది దూరంలో బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన ఓ లోడ్ లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. అదే దారిలో అతివేగంగా వచ్చిన ఓ మహారాష్ట్రకు చెందిన కంటెయినర్.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కంటెయినర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. తీవ్రంగా గాయపడిన కంటెయినర్ డ్రైవర్ సచిన్ జవార్సింగ్(30), క్లీనర్‌ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే డ్రైవర్ సచిన్ జవార్సింగ్ మరణించాడు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే లారీ రోడ్డుపై ఆగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
వేధింపులు భరించలేక కొడుకును హత్య చేశాడు
ఏఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి క్రైం: జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం నిత్యం వేధించడంతోనే సొంత కొడుకును తండ్రి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన వడ్ల నిఖిల్ (24) హత్య కేసులో నిందితుడైన తండ్రి భాస్కర్‌ను రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో కుమార్తెకు పెళ్లి చేశారు. కొడుకు నిఖిల్ జులాయిగా తిరుగుతుండటంతో ఏడాది క్రితం గల్ఫ్‌కు పంపారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వచ్చేశాడు. వచ్చిన నాటి నుంచి గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఏపనీ చేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో పలుసార్లు తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. గత ఆదివారం రాత్రి గొడవ జరిగినప్పుడు భాస్కర్ అక్కడే ఉన్న ఓ కర్రతో నిఖిల్ తలపై కొట్టాడు. బలమైన గాయం కావడంతో వెంటనే కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చారు. నిఖిల్ బతికి ఉంటే తమను ప్రశాంతంగా ఉండనివ్వడని భావించిన తండ్రి భాస్కర్ అతడిని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. సోమవారం వేకువజామున రాడ్డుతో మరోసారి నిఖిల్‌పై దాడి చేశాడు. తీవ్రగాయాలైన నిఖిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగానే చనిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న భాస్కర్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని అభినందించారు. -
అమ్మో.. ముప్కాల్ తహసీల్!
బాల్కొండ : ముప్కాల్ తహసీల్దార్‌గా విధులు ని ర్వర్తించేందుకు అధికారులు జంకుతున్నారు. నూ తన మండలాల ఏర్పాటులో భాగంగా 2018లో ముప్కాల్ మండలం ఏర్పడింది. కాగా, సుమారు ఏడేళ్లలోనే 10 మంది తహసీల్దార్లు వచ్చారు.. బదిలీపై వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం మూడు నెలలుగా తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న గజానన్ బదిలీపై నిర్మల్ వెళ్లారు. దీంతో ప్రస్తుతం ముప్కాల్ తహసీల్దార్ పోస్టు ఖాళీ అయింది. దీర్ఘకాలిక సెలవు..లేదంటే బదిలీ ముప్కాల్ మండల పరిధిలో ఉండేది ఏడు గ్రామా లే అయినా, నిత్యం భూ వివాదాలు, ప్రభుత్వ భూ ముల కబ్జాలపై ఫిర్యాదులు వస్తుంటాయి. రాజకీయ ఒత్తిళ్లు సైతం ఈ మండలంలో ఎక్కువే. దీంతో ఇక్కడ విధులు నిర్వర్తించే తహసీల్దార్లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్తుంటారు. లేదంటే మరో ప్రాంతానికి బదిలీ చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి భూ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏడేళ్లలో 10 మంది తహసీల్దార్ల బదిలీ భూ వివాదాల నేపథ్యంలో హడలెత్తిపోతున్న అధికారులు ఏడాది తిరగక ముందే బదిలీపై వెళ్తున్న వైనం -
పనులు నాణ్యతగా చేయించుకోవాలి
వర్ని: అభివృద్ధి పనులను గ్రామస్తులు దగ్గరుండి నాణ్యతగా చేయించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పనులు జరిగే సమయంలో అందుబాటులో ఉండి నిబంధనల ప్రకారం నాణ్యతగా పనులు చేయించాలని సూచించారు. నాణ్యతకు తిలోదకాలిస్తే కాంట్రాక్టర్‌తోపాటు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సాయిలు, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
‘సాంకేతికతను పరిచయం చేసిన ఘనుడు రాజీవ్ గాంఽఽధీ’
సుభాష్‌నగర్: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా నగరంలోని వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డితోకలిసి ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని, గ్రామీణ విద్యాభివృద్ధిని ప్రోత్సహించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు రాంభూపాల్, కాంగ్రెస్ ఫిషర్మన్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, నరేందర్ గౌడ్, రామకృష్ణ, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం బోధన్: పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డులోని లక్ష్మి అపార్టుమెంట్ నివాసీ ఎన్ రమేశ్(59) బుధవారం మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులు రమేశ్ నేత్రాలు దానం చేయాలని నిర్ణయించుకొని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి రెండు కళ్లను వైద్యులు సేకరించారని లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు పోలవరపు బసవేశ్వర్ రావు తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5.80 లక్షలు రికవరీ ● పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడుకామారెడ్డి క్రైం: ఓ వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేస్తూ పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడి అతని అకౌంట్లో నుంచి రూ.5.80 లక్ష లు సైబర్ నేరగాళ్లు కాజేయగా, వెంటనే స్పందించి డబ్బులు మొత్తం రికవరీ చేశారు కామా రెడ్డి పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన లోకుల రాజేందర్ అనే వ్యక్తికి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. తాము ముంబై పోలీసులమని నమ్మించారు. టెలికాం సర్వీస్ ద్వారా మీ ఆధార్ కార్డుతో మరొకరు డబ్బులు తీసుకున్నారని, మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయభ్రాంతులకు గురిచేశారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తమ అకౌంట్‌కు బదిలీ చేయాలని, లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయపడిన రాజేందర్ తన అకౌంట్లోని రూ.5.80 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అనుమానం వచ్చి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పట్టణ ఎస్హెస్వో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సదరు బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసి, డబ్బులు రికవరీ చేసి బాధితుని అకౌంట్లో జమ చేశారు. దీంతో బాధితుడు రాజేందర్ పట్టణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు. -
రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్ట్‌లో స్నానానికి వెళ్లి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ (28) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. మొదట స్నానం చేయడానికి రాజశేఖర్ గౌడ్ నీటిలో దూకాడు. ప్రాజెక్టు లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేదు. స్నేహితులు, స్థానికుల సహాయంతో రాజశేఖర్ గౌడ్‌ను బయటకు తీసుకురాగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సాటాపూర్‌లో కార్డన్ సెర్చ్ రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామంలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. నాలుగు ఆటోలు, 80 ద్విచక్ర వాహనాలకు ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మోటారు వాహన నిబంధనలు పాటించాలని సూచించారు. లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి 45 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. బైక్‌ల చోరీ ఖలీల్‌వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇంటి ఎదుట పార్క్ చేసిన రెండు బైక్‌లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నగరంలోని షిర్డీ సాయికృపానగర్ కాలనీలో సాదుల్లా శేఖర్ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చే శారు. బోర్గాం సమీపంలోని శ్రామిక్‌నగర్‌లో రాము లు ఇంటి ఎదుట బైక్‌ను పార్కింగ్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కంబోడియాలో దేవునిపల్లి యువకుడి మృతి
కామారెడ్డి అర్బన్: కంబోడియా రాజధాని నాంఫెన్‌లో కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్‌కుమార్ (36) ఈ నెల 14న గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం కంబోడియా వెళ్లిన కిరణ్‌కుమార్ నాంఫెన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం భారతీయ రాయబార కార్యాలయం ద్వారా పోలీసులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించలేదని తెలుస్తుంది. దేవునిపల్లిలోని కిరణ్‌కుమార్ ఇంటికి పోలీసులు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకోకుండా స్టేషన్‌కు వచ్చి కలవాలని ఫోన్ చేయడంతో సరైనపత్రాలు లేక భయపడిన కుటుంబసభ్యులు మధ్యవర్తుల ద్వారా రెండుమూడు రోజులకు కలిశారు. కాగా, తెలిసిన బంధువుల ద్వారా కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కౌన్సిలేట్ అబ్రహంతో మాట్లాడగా ఆయన కిరణ్‌కుమార్ మృతదేహం తరలింపునకు కావాల్సిన పత్రాల ఫార్మేట్ పంపినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు పత్రాలు పంపిన తర్వాత శవం ఇంటికి చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. 14న గుండెపోటుతో మరణం కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం -
విద్యుదాఘాతానికి రైతు బలి
రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలంలోని ఘన్పూర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భుక్య రాజు నాయక్(35) బుధవారం మధ్యాహ్నం పొలంలో విరిగిపోయిన చెట్లను తొలగిస్తుండగా, మంగళవారం కురిసిన వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు నాయక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడికి భార్య వనీత, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కుదరడం లేదని..
కమ్మర్పల్లి: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కమ్మర్పల్లి మండలం ఇనాయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇనాయత్‌నగర్ గ్రామానికి చెందిన జక్కుల రాజ్‌కుమార్(23)కు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉల్లంఘనులకు బాసటగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం ఆడిందే ఆ ట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకే ఫైల్ కు సంబంధించి పలుసార్లు తిరస్కరణలు చేస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత తక్షణమే నిబంధనలు పాటించకున్నప్పటికీ అనుమతులు ఇస్తున్నారు. పైగా దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ప్రత్యేక వ్యవస్థ మాదిరిగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. వందలో పది శాతం లోపు ఫిర్యాదు దారులు మాత్రమే హైకోర్టుకు వెళుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ఉంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇతర ఫిర్యాదులనైతే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ● ఖలీల్వాడిలో సెల్లార్ అనుమతి లేకుండా ఒక భవనం నిర్మాణం చేస్తున్నారు. దీనిపై 2024 డిసెంబర్ 31న మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు దారుడు హైకోర్టుకు వెళ్లాడు. దీంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పనులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోడానికి బదులు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాజేష్ మాత్రం అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న వ్యక్తికి, ఫిర్యాదు దారుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● ఖలీల్‌వాడి ప్రాంతాన్ని బంగారు బాతు మాదిరిగా మున్సిపల్ అధికారులు వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టీపీబీవోలు, టీపీఎస్‌లు, ఏసీపీలను ఆయా ఏరియాల్లో మార్పులు చేసినప్పటికీ టీపీఎస్ రాజేష్‌ను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఖలీల్‌వాడి ప్రాంతంలో రాజేష్ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వరుసగా వస్తున్నాయి. ఈ విషయాలపై కమిషనర్‌ను సంప్రదించగా విచారణ చేస్తామని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలుస్తున్న నగరపాలక సంస్థ అధికారులు హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా నోటీసులతో సరి సెటిల్మెంట్లు చేస్తున్న టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో బేరం కుదిరిన ఫైళ్లకే తక్షణ అనుమతులు ఇస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారు. కొంతమంది ఫిర్యాదు దారులు మాత్రమే హైకోర్టుకు వెళుతున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా అధికారులు షోకాజ్ నోటీసులతో సరిపెడుతున్నారు. నగరంలోని దుబ్బ ఏరియాలో 3191/అ సర్వే నంబర్లో ఒక వ్యక్తికి చెందిన 32 గుంటల భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. ఈ విషయమై బాధితుడు 2025 ఫిబ్రవరి 3న, 2025 మార్చి 25న నగరపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు 2025 ఏప్రిల్ 25 న ఇరుపార్టీలకు డాక్యుమెంట్లు తీసుకురావాలని నోటీసులు ఇచ్చారు. కాగా బాధితుడు హైకోర్టుకు వెళ్లాడు. ఆక్రమణదారుడిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని, బాధితుడికి భూమి అప్పగించాలని కోర్టు మున్సిపల్ అధికారులకు రూలింగ్ ఇచ్చింది. కోర్టు రూలింగ్ మేరకు చర్యలు తీసుకోవడానికి బదులు మున్సిపల్ అధికారులు ఆక్రమణ దారుడికి ఈ నెల 13న షోకాజ్ నోటీసులు మాత్రం ఇచ్చి కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
ప్రజల గుండెల్లో రాజీవ్‌గాంధీ
నిజామాబాద్ సిటీ: దేశ మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో రాజీవ్‌గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి ఎమ్మెల్యేతోపాటు నా యకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అ నంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లకు ఓటుహక్కును కల్పించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా చేశారన్నారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాదక్షుడని కొనియాడారు. జాతీ య విద్యా విధానం అమలు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రపథాన నడిపారన్నారు. 40 ఏళ్లకే ప్రధానమంత్రి పదవిని చేపట్టి యువ ప్రధానిగా చరిత్రలో నిలిచారన్నారు. ఆయన భౌతికంగా లేకపో యినా ఆయన ఆశించిన సమాజం వాస్తవ రూపంలో కనిపిస్తోందన్నారు. రాజీవ్‌గాంధీ ఆలోచనలతో యువత ముందుకు వెళ్లాలన్నారు. వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి రామ్‌భూపాల్, యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గోపి, నాయకులు వేణురాజ్, నరేందర్‌గౌడ్, సేవాదళ్ సంతోష్, కోనేరు సాయికుమార్, బొబ్బిలి రామకృష్ణ, బోర్గాం శ్రీనివాస్, పోల ఉష, పుప్పాల విజయ, సుభాష్ జాదవ్, సలీం, అవిన్, సాయిలు, యెండల కిషన్, నికిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు రాజకీయ అవకాశాలు కల్పించారు ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి -
పాము కాటుకు బాలుడు మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ) : పాము కాటుతో నా లుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో అ శోక్, సూజాత దంపతుల కుమారుడు రిషి కుమార్ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. బాలుడి కాలు నుంచి రక్తం కారుతుండటం గమనించిన తల్లి గాయం అయి ఉంటుందని భావించి పసుపు రాసింది. కొద్దిసేపటి తర్వాత బాబు కళ్లు తేలేయడంతో తల్లి భయానికి గురయ్యింది. అంతలోనే పాము కనబడటంతో పాము కరిచి ఉండవచ్చని బాలుడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా సిబ్బంది నిజా మాబాద్‌కు వెళ్లమన్నారు. అప్పటికే శరీరం అంతా విషం వ్యాపించడంతో బాలు డు మృతి చెందాడు. ముగ్గు రు కుమార్తెల తర్వాత ఎంతో కాలానికి కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీ రయ్యారు. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పాము ఇంట్లోకి వచ్చి ఉంటుందని, అంతలోనే ఘోరం జ రిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గుర్తింపు కార్డులు అందజేయాలి
ఖలీల్‌వాడి: భవన నిర్మాణ కార్మికులకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు అందించాలని ఎకై ్సజ్ కోర్టు జడ్జి హరికుమార్ అన్నారు. జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో బుధవారం న్యాయవిజ్ణాన సదస్సు నిర్వహించగా, జడ్జి హరికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు తప్పనిసరిగా పింఛన్ అందేలా చూడాలన్నారు. అనంతరం లేబర్ ఆఫీసర్ యోహాన్ లేబర్ చట్టాలను వివరించారు. 60 ఏండ్లు నిండిన భవననిర్మాణ కార్మికులకు పింఛన్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో బార్ కార్యదర్శి మాణిక్‌రాజ్, న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి/డిచ్పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూ లనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. ధర్పల్లి, డిచ్పల్లి పోలీస్ స్టేషన్లను సీపీ బు ధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్లు, రికార్డులను పరిశీలించి కంప్యూటర్ సిబ్బంది పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైవ్ ఎస్ అమలు విధానా న్ని పరిశీలించారు. సైబర్‌నేరాలు, ఆన్లైన్ గేమ్‌లపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. సీపీ వెంట సీఐలు భిక్షపతి, మల్లేశ్, ఎస్సైలు రామకృష్ణ , ఎండీ షరీఫ్, సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఏడీఏ సస్పెన్షన్ డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ శాఖ నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత శాఖకు చెందిన ధర్పల్లి ఏవో ప్రవీణ్ గతేడాది గుండెపోటుతో మరణించాడు. ఆయన కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా రూరల్ ఏడీఏ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర శాఖ నుంచి ఇద్దరు అధికారులు జిల్లాకు వచ్చి విచారణ చేసి కమిషనర్‌కు నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ఏడీఏను సస్పెండ్ చేశారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి ● డీపీవో శ్రీనివాస్ ఇందల్వాయి: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఇందల్వా యి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడు తూ సకాలంలో పంచాయతీకి హాజరై పారిశుధ్య పనులను నిత్యం పరిశీలించాలన్నా రు. ప్రతి గ్రామాన్ని గరిష్టంగా నాలుగు జోన్లుగా విభజించి, రోజుకో జోన్ చొప్పున పారిశుధ్య పనులను చూడాలని, స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేయాలన్నారు. సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేయాలని, 15 రోజుల్లో ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని, లేదంటే సహేతుకమైన కారణాలు చెప్పి తిరస్కరించాలని సూచించారు. పౌర సేవల్లో జాప్యం వహించొద్దని అన్నారు. సమావేశంలో ఎంపీడీవో అనంత్‌రావు, ఎంపీవో రాజ్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం పరిశీలన ఇందల్వాయి: ఇందల్వాయి ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని మాతా శిశు సంక్షేమ శాఖ జి ల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సుప్రియ బుధ వారం పరిశీలించారు. అమ్మఒడి సేవలు, అ మలవుతున్న తీరును సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. గర్భిణలందరికీ సకాలంలో వైద్య సేవలు అందేలా సిబ్బంది కృషి చేయా లని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఈవో శంకర్, స్థానిక వైద్యాధికారి క్రిస్టినా, సిబ్బంది ఉన్నారు. -
నగరంలో అధునాతన స్విమ్మింగ్‌పూల్
నిజామాబాద్ నాగారం: నగరంలో అధునాతన హంగులతో ప్రభుత్వ స్విమ్మింగ్‌పూల్ నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మల్టీ పర్పస్ హాల్‌తోపాటు, చేంజింగ్ రూమ్స్, ఓపెన్ జిమ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గంగస్థాన్ ఫేజ్–1 ప్రాంతంలోని సర్వే నంబర్ 106లో ప్రభుత్వ భూమి సుమారు వంద ఎకరాలు ఉండగా, స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఇతర నిర్మాణాల కోసం 7 ఎకరాల 30గుంటల భూమి అవసరం ఉంటుందని అంచనా వేశారు. కబ్జా నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి.. గంగస్థాన్ ఫేజ్–1 ప్రాంతంలో సర్వేనంబర్ 106లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒలింపిక్ అసోసియేషన్ భవనం, స్టేడియం నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డి భూమి పూజ సైతం చేశారు. ఒలింపిక్ భవన నిర్మాణానికి ఽనిధులు కేటాయించడంతో పనులను ప్రారంభించారు. పిల్లర్స్, బేస్మెంట్ వరకు సుమా రు రూ.15లక్షల వరకు ఖర్చు చేశారు. అటు తర్వా త ఒలింపిక్ సంఘంలో విబేధాలు రావడంతోపా టు రాజకీయ మార్పుల నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. మరోవైపు భూమి కబ్జా అవుతుండడంతో ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు అడ్డుకునేందుకు చాలా శ్రమించారు. ప్రత్యేకంగా సర్వే అధికారులతో సర్వే చేయించి హద్దు రాళ్లు పెట్టారు. అయినప్పటికీ కబ్జాదారులు దొంగ పట్టాలు, పేపర్లు సృిష్టించి నానా హంగామా చేశారు. ప్రజా సంఘాలు, ఒలింపిక్ సంఘం, క్రీడాకారులు, అధికార యంత్రాంగం కృషితో భూమి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు గంగస్థాన్‌లోని సర్వే నంబర్ 106లో ప్రభుత్వ స్థలం కేటాయింపు ప్రతిపాదనలు పంపించాం ముందుగా స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని కాపాడేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు చుట్టూ ఫెన్సింగ్ వేశాం. స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, చేంజింగ్ రూమ్స్, తదితర నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. – ముత్తెన్న, జిల్లా యువజన క్రీడల అధికారిసుమారు రూ.10 లక్షలతో ఫెన్సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒలింపిక్ సంఘం, జిల్లా యంత్రాంగం కలిసి బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డికి స్టేడియానికి కేటాయించిన భూమి అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని విన్నవించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మళ్లీ స్టేడియం కేటాయించిన స్థలాన్ని సర్వే చేయించారు. కలెక్టర్ నిధులు ఇవ్వడంతో సుమారు రూ.10లక్షలతో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 7 ఎకరాల 30గుంటల భూమికి రక్షణ కల్పించారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మాక్లూర్: ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఆయన స్వగ్రామం ఆలూర్ మండలం రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఐదేళ్లుగా గంగామోహన్ గొట్టిముక్కల పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన పంచాయతీ కార్యదర్శుల సంఘానికి మండల అధ్యక్షుడు కూడా. గొట్టిముక్కల గ్రామానికి చెందిన ముప్పడి రాజేందర్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ విషయమై పంచాయతీ కార్యదర్శి గంగామోహన్‌ను సంప్రదించగా రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్య రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తానని గంగామోహన్ కరాఖండిగా చెప్పడంతో బాధితుడు రాజేందర్ గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం ముందుగానే గ్రామానికి చేరుకొని బాధితుడికి తగు సూచనలు ఇచ్చి పంపించారు. పకడ్బందీగా వ్యవహరించి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గంగామోహన్‌కు బాధితుడు రాజేందర్ లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంగామోహన్పై గతంలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ వెల్లడించారు. నిందితుడిని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.18 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో సోదాలు -
ఈ వీధి పేరు ‘సిందూర్ స్ట్రీట్’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలోని ఓ వీధికి ‘సిందూర్ స్ట్రీట్’(సిందూర్ వీధి) అని నామకరణం చేశారు. మంగళవారం ఆ వీధికి చెందిన ఇళ్ల యజమానులు సిందూర్ స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ, మన దేశ త్రివిధ దళాలకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఆ వీధి వాసులు తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని నామకరణం చేసి సైనికులకు మద్దతు తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన పోరాట పటిమను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని పేరు పెట్టినట్టు వారు పేర్కొన్నారు. -
బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
ఖలీల్‌వాడి: యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ శ్రీనివాస్‌రావు సూచించారు. నగరంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మంగళవారం గంజాయికి అలవాటు పడిన యువకులతో పాటు వారి తల్లితండ్రులకు టాస్క్‌ఫోర్స్ సీఐ ఆర్ అంజయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్సై గోవింద్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. అందమైన జీవితాన్ని మత్తుకు బానిస కాకుండా చూసుకోవాలని యువకులకు సూచించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేసినా, గంజాయి పెంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. -
ముంబోజీపేటలో ఒకరి అదృశ్యం
లింగంపేట: మండలంలోని ముంబోజీపేట గ్రామానికి చెందిన పస్కూరి కాశీరాం అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై వెంకట్రావు మంగళవారం తెలిపారు. మూడు రోజుల క్రితం భార్య రాణితో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్యఖలీల్వాడి: అనారోగ్యంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వినాయక్‌నగర్‌కు చెందిన దోమల చంద్రకళ(55) ఆరు నెలలుగా అనారోగ్యంతో పాటు మానసికంగా బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ధర్మాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ల్యాప్‌టాప్ అప్పగింతరాజంపేట: పోగొట్టుకున్న ల్యాప్‌టాప్‌ను రికవరి చేసి బాధితుడికి అందించినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన వెంకోళ్ల యాదగిరి 15 రోజుల క్రితం తన ల్యాప్‌టాప్‌ను పోగొట్టుకున్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత వ్యక్తిని విచారించారు. డేటాబేస్ ఆధారంగా ల్యాప్‌టాప్‌ను పట్టుకుని బాధితుడికి అందించినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు చిరంజీవి, చరణ్ ఉన్నారు. పాతకక్షలతో ఒకరిపై దాడిఖలీల్వాడి: పాతకక్షల నేపథ్యంలో ఒకరిపై దాడి జరిగిన ఘటన నగరంలోని మైఫిల్ హోటల్ వద్ద జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్‌కు చెందిన సాయికుమార్, సాయినాథ్‌లకు గతంలో పాత కక్షలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి సాయికుమార్ తన స్నేహితుడైన శివ బర్త్‌డే వేడుకల్లో పాల్గొని మంగళవారం ఉదయం 3 గంటలకు మైఫిల్ హోటల్ వద్దకు వచ్చారు. కాగా అక్కడే ఉన్న సాయినాథ్ వీరిని పలుకరించాడు. సాయికుమార్‌ను పక్కకు రావాలంటు సాయినాథ్ కోరడంతో అతను వెళ్లాడు. తనపై గణేశ్ ఉత్సవాల్లో ఎందుకు పోలీస్ కేసు పెట్టావంటు జేబులో ఉన్న బ్లేడ్‌తో సాయికుమార్ గొంతుపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నందిపేట్‌లో యువకుల ఘర్షణనందిపేట్: మండల కేంద్రంలోని బస్‌డిపో స్థలంలో గుర్తు తెలియని యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కొండూర్ రమేశ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి మద్యం తాగేందుకు స్థానిక బస్ డిపో స్థలానికి వచ్చాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య రమేశ్‌కు గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో రమేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో అచేతన స్థితికి చేరాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకు వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
● ఆనవాళ్లు కోల్పోతున్న వైనం ● శిథిలావస్థకు చేరుతున్న కోట గోడలు ● పట్టించుకోని పురావస్తు శాఖబాల్కొండ: బాల్కొండ ఖిల్లా నిర్లక్ష్యపు నీడలో మగ్గుతోంది. ఖిల్లా ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి దాపురించింది. బాల్కొండలో క్రీ.శ 1059వ సంవత్సరంలోనే మల్లయోధులు అల్లయ్య, కొండలు పాలించిన సమయంలో బాల్కొండ ఖిల్లాను నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. తరువాత బహమనీ సుల్తానుల నుంచి కాకతీయ రాజుల వరకు బాల్కొండ(అల్లకొండ)ను పాలించారు. ఆ సమయంలో బాల్కొండ ఖిల్లాను 40 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఖిల్లా ప్రధాన ద్వారాలు, ఖిల్లాలో ఆలయాలు, కొనేరు, అత్తా కోడళ్ల బావి, సొరంగ మార్గాలున్నాయి. అంతే కాకుండా ఫిరంగులు, మందు పాతరలను భద్రపరిచే ఆనవాళ్లు ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయకపోవడంతో కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఖిల్లాతో పాటు బాల్కండ గ్రామం నాలుగు వైపుల ప్రవేశ ద్వారాలు కూడ ఉన్నాయి. కాని అందులో మూడు ప్రవేశ ద్వారాలు శిథిలాస్థకు చేరడంతో కూల్చివేశారు. ప్రస్తుతం ఆర్మూర్ గైనిలో ఒక ద్వారం ఉంది. సంవత్సారల తరబడి ఖిల్లాను పట్టించుకోక పోవడంతో ఖిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మొద్దు నిద్రలో పురావస్తు శాఖ.. బాల్కొండ ఖిల్లాను పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఖిల్లాను అభివృద్ధి చేయాలని ఖిల్లా పరిరక్షణ సమితి సభ్యులు పలు మార్లు పీఎంవో, సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. కాని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఖిల్లాపై పెరిగిన పిచ్చి మొక్కలను కూడా తొలగించలేని దుస్థితితో శాఖ ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో తొలిగించాలని స్థానిక అధికారులకు కూడా వినతి పత్రం అందించారు. కాని వారు సైతం పట్టించు కోవడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం.. బాల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేస్తే పర్యాటకంగా వెలుగొందే అవకాశం ఉంది. బాల్కొండ ఖిల్లాపై అత్త కోడళ్ల బావి ఉంది. ఆ బావిలో ఓ వైపు ఉప్పు నీరు, మరో వైపు మంచి నీరు ఉంటుంది. ఉప్పు నీరు ఉన్న బావిని అత్త, మంచి నీరు ఉన్న బావిని కోడలు బావిగా పిలుస్తున్నారు. అలానే శివలింగం ఉంది. అల్లయ్య, కొండయ్యల విగ్రహాలు చేతులు, కాళ్లు నరికి వేసినవిగా ఉంటాయి. ఖిల్లాకు పైభాగాన చెరువు, కింది వైపు పచ్చని పొలాలు ఉన్నాయి. పాలకులు స్పందించి వెంటనే అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఖిల్లాను అభివృద్ధి చేయాలి బాల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేయాలి. ఖిల్లా ప్రాంతంలో అనేక ప్రాచీ న కోటలు ఉన్నాయి. వాటన్నింటికి మరమ్మతులు చేపడితే అనేక మంది పర్యాటకులు వస్తారు. ప్రాచీన విషయాలు తెలుస్తాయి. ఖిల్లా వివరాలను భవిష్యత్తు తరాలకు అందించాలి. – రాజేశ్వర్, గ్రామస్తుడుప్రధానికి విన్నవించాం బాల్కొండ ఖిల్లాకు మరమ్మతులు చేపట్టి, అభివృద్ధి చేయాలని పీఎంవో కార్యాలయంలో ప్రధానికి విన్నవించాం. సీఎంవోలో సీఎంకు విన్నవించాం. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఉపాధి కూలీలతో పిచ్చి మొక్కలను కూడా తొలిగించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఖిల్లాను అభివృద్ధి చేయాలి. – నర్సింగ్‌రావు, ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
బాడ్సిలో రేకుల షెడ్డుకు నిప్పు
మోపాల్: మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు నల్ల శశాంక్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రేకుల షెడ్డుకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం శశాంక్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పరికరాల కోసం షెడ్డును నిర్మించుకున్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న గ్రామస్తులు షెడ్డుకు నిప్పంటుకున్న విషయాన్ని శశాంక్‌కు ఫోన్ ద్వారా చెప్పడంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే షెడ్డులో ఉన్న పైపులు, ట్రాక్టర్ టైరు, ఇతరత్ర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అక్కడే ఏర్పాటు చేసిన తన తండ్రి నల్ల చిన్న సాయిరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సీఐ సురేశ్, ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శశాంక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. రూ.20వేల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. గాంధీనగర్‌లో దొంగల బీభత్సంనవీపేట: మండలంలోని గాంధీనగర్‌లో ముసుగులు ధరించిన దొంగల ముఠా సోమవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. గుర్తు తెలియని 8 మంది గ్రామంలోకి చొరబడి అన్ని ఇళ్ల తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. సుదర్శన్‌కు చెందిన కిరాణ దుకాణం షట్టర్‌ను తొలగించి లోపలకు ప్రవేశించారు. చప్పుడు రావడంతో మేల్కొన్న గ్రామస్తుల అలజడికి దొంగలు పారిపోయారు. ఈ దృశ్యాలు గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దొంగలను పట్టుకుంటామని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ శివారులోని పంట పొలాల్లో విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. పట్టణ కేంద్రానికి చెందిన రైతు రాజేశ్ తనకున్న రెండు గేదెలను తీసుకొని శివారు ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లాడు. అక్కడ మేత మేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి పడి రెండు గేదెలపై పడ్డాయి. ఈ ఘటనలో అవి మృతి చెంది. పక్కనే ఉన్న మరో 20 గేదెలు, పశువలకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ ఏడీఈ కృష్ణ చైతన్య, మండల పశువైద్యాధికారి రవికిరణ్, రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. -
హోన్నాజీపేట్‌లో చోరీ
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్‌లో చోరీ జరిగినట్లు ఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొంటకొల్ల గంగారం సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి దాబాపై నిద్రపోయారు. విషయం గమనించిన దుండగులు రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, రూ. మూడు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బంక్‌లో డీజిల్.. మోపాల్: మండలంలోని కాస్బాగ్ తండా శివారులో ఉన్న ఇండియన్ బంక్‌లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 154 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బంక్ వెనక వైపు నుంచి లోపలికి వచ్చి సీసీ కెమెరాలను నిలిపేశారు. ఆ తర్వాత బంక్‌లోని ఆన్లైన్ సిస్టమ్‌ను బ్రేక్ చేశారు. డీజిల్ గన్ను అన్‌లాక్ చేసి రూ.14,951 విలువైన 154 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. ఈవిషయమై ఎస్సై యాదగిరి గౌడ్ వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్స్ డీఐజీ సీ సన్ని సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. కమాండెంట్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఐజీ కి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఇన్స్పెక్షన్ పరే డ్కు కమాండర్‌గా అసిస్టెంట్ కమాండెంట్ కేపీ స త్యనారాయణ వ్యవహరించారు. బెటాలియన్ సి బ్బంది నుంచి డీఐజీ సన్ని గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం దర్బార్ నిర్వహించి అధికారులు, సిబ్బంది సమస్యలను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల ప్రాత కీలకమన్నారు. మంచి ఆహారం, తగినంత వ్యాయామం, యోగా ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తర్వాత బెటాలియన్ ఆవరణలో డీఐజీ మొక్కను నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్‌కుమార్, ఆర్ఐలు కే త్రిముఖ్, ఏ నవనీత్‌కుమార్, బి వసంత్‌రావు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చేతులెత్తేసిన ఐకేపీ
బాల్కొండ: యాసంగి సీజన్ ధాన్యాన్ని సేకరించేందుకు మండలంలోని జలాల్పూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా కాంటా చేయకుండానే కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారు. హమాలీలు లేరంటూ ధాన్యం సేకరించకుండానే చేతులెత్తేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోయారు. జలాల్పూర్ రైతులు సుమారు 760 ఎకరాల్లో వరి సాగు చేశారు. సగం విస్తీర్ణంలో వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సీడ్ వరి సాగు చేయగా ఆ దిగుబడిని వ్యాపారులు తీసుకున్నారు. మిగతా సగం విస్తీర్ణంలో సాగైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు రూ.1900కు క్వింటాల్ చొప్పున విక్రయించారు. ఈ లెక్కన బోనస్ కలుపుకుంటూ రైతులు క్వింటాల్‌కు రూ.900 నష్టపోయారు. ఖరీఫ్ సీజన్లోనైనా పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బస్తా కాంటా చేయలేదు జలాల్పూర్లో కొనుగోలు కేంద్రం ఎత్తివేత ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి నష్టపోయిన రైతులు -
సవాల్‌గా పశు పోషణ
ఇందల్వాయి: జిల్లా వ్యాప్తంగా పశు సంపద వేగంగా క్షీణిస్తోంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉంటూ రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందించే పశు పోషణ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, అర్హులకు అవసరమైన రాయితీలు సకాలంలో అందకపోవడంతో పశు పోషకులు పశువులను అమ్ముకుంటున్నారు. ప్రధాన కారణాలివే..! గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో పాడి పశువులతోపాటు మేకలు, కోళ్లు ఉండేవి. అలాగే ప్రతి తండాలో ఆవుల మందలు ఉండేవి. పశువుల మేయడానికి అనుకూలంగా ఉండే భూములు(కంచెలు) వ్యవసాయ భూములుగా మారిపోవడం, పశువుల పాకలు ఖరీదైన ఇళ్ల స్థలాలుగా మారిపోవడం, రైతులకు, యువతకు పశుపోషణ అనేది భారంగా, చులకనగా మారడం, పశువైద్యానికి, పశు సంవర్ధక శాఖకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వంటి కారణాలతో పాడి పశువులతోపాటు మేకలు, గొర్ల సంఖ్య వేగంగా తగ్గుతోంది. గణాంకాలు ఇలా.. ఐదేళ్లకోసారి పశుగణన చేపడుతున్నారు. 2024కు సంబంధించిన పశుగణన వివరాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే 2019 లెక్కల ప్రకారం ఆవుజాతి పశువులు 1,01,252, గేదెజాతి – 2,06,898, గొర్రెలు – 7,35,549, మేకలు – 1,56,619, పందులు – 1,749 ఉన్నాయి. జిల్లాలో 2024లో చేపట్టిన పశుగణన వివరాలు వెల్లడించడానికి తమకు ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గేదెల్లో 27 శాతం, ఆవుల్లో 27.78 శాతం, గొర్రెలు 17, మేకలు 7.82 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా పశుసంవర్ధక శాఖలో ఖాళీలు సేవలతో పాటు ప్రోత్సాహకాలను మరిచిన ప్రభుత్వం వేగంగా తగ్గుతున్న పశు సంపద పశువులను అమ్ముకుంటున్న పోషకులు రాయితీలు అందించాలి వ్యవసాయానికి అనుబంధంగా రెండు గేదెలను పెంచుతున్నా. పశువుల షెడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంకా మంజూరు కాలేదు. పశు వైద్యశాలలను ఆధునీకరించి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలి. యువ రైతులకు పశు పోషణపై అవగాహన కల్పించి గేదెలు, ఆవులు, మేకల పెంపకంలో రాయితీలు, ప్రోత్సాహకలు అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – పూదరి నవీన్, నల్లవెల్లి అగమ్యగోచరంగా.. పశువైద్య శాఖలో గోపాలమిత్రల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. ఇచ్చే రూ.11 వేలల్లో రూ.4 వేలు వంద పశువులకు గర్భాధారణ చేయించే లక్ష్యానికే కట్టాలి. ప్రతి వారం పదుల సంఖ్యలో పశువులు అమ్మకానికి వెళ్తున్నాయి. – బాలగంగారాం, గోపాలమిత్ర, గన్నారం శిథిలావస్థలో పశు వైద్యశాలలు జిల్లాలోని చాలాచోట్ల పశు వైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన మరమ్మతులు, నిర్వహణ లేక మూలనపడ్డాయి. నూతన భవనాలకు, పాతవాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీలకే పరిమితమయ్యారు. ఇందల్వాయి, సిర్నాపల్లి పశు వైద్యశాలలే ఇందుకు నిదర్శనం. చాలా మండలాల్లో పశువైద్యులుగా ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. గోపాలమిత్రల సేవలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మా ఇష్టం
నిజామాబాద్మా రూల్స్.. బంగారు భవిష్యత్తును.. యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025–8లో uక్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేపట్టాలి బాల్కొండ: భూ భారతిలో రైతులు అందజేసిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విచారణ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలకు సూచించారు. మెండోరా మండలంలోని బుస్సాపూ ర్, దూదిగాం గ్రామాల్లో రెవెన్యూ బృందా లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణను కలెక్టర్ మంగళవారం పర్యవేక్షించారు. మెండోరా మండలం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో భూ భారతి గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారులు లేకుండా విచారణ చేపట్టొద్దని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూ చించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగు తున్న డెస్క్ వర్క్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్, తహసీల్దార్లు శ్రీకాంత్, సంతోష్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మూడు క్లినిక్‌లు సీజ్ నిజామాబాద్‌నాగారం: ఆర్మూర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు ఆర్ఎంపీ క్లినిక్‌లను వైద్యారోగ్య శా ఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్‌లోని భారతి, ప్రియాంక క్లినిక్‌లలో 2014 నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బెంగాల్ నుంచి వచ్చినవారు ఆర్ఎంపీలుగా చలామణి అవుతూ ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారని, అబార్షన్లు సైతం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరో ఆయుర్వేద క్లినిక్‌ను సీజ్‌చేశారు. క్లినిక్‌లలో అనుమతి లేని మందులు, ఇతర పరికరాలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. పూర్తయిన గాలికుంటు టీకాల పంపిణీ డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగిన పశువులకు గాలికుంటు టీకాల పంపిణీ పూర్తయ్యింది. జిల్లాకు 2లక్షల డోసులు తెప్పించగా, ఇప్పటి వరకు 1.82లక్షల పశువులకు (82శాతం) టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రోహిత్ రెడ్డి తెలిపారు. టీకాలు ఇంకా అందుబాటులో ఉన్నాయని తెల్ల, నల్లజాతి పశువులకు ఇంకా ఎవరైనా టీకాలు వేయించని పక్షంలో స్థానిక పశువైద్య అధికారులను సంప్రదించి వేయించాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చట్టాలు, నిబంధనలు బేఖా తరు చేస్తూ మా రూల్స్.. మా ఇష్టం అన్నట్లుగా ఫైళ్ల కథలు నడిపిస్తున్నారు. ముడుపులు అందనంతవరకు అనుమతు లు ఇవ్వకుండా.. ముడుపులు ముట్టాక వాటికే త క్షణ అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నా యి. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసినప్పటికీ చూసీచూడనట్లు ఉంటున్నారు. ● పూసలగల్లీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి సైతం అన్ని నిబంధనలు అతిక్రమించి భవనం నిర్మించేలా టీపీఎస్ రాజేష్ కథ నడిపిస్తున్నట్లు ప లువురు ఫిర్యాదులు చేశారు. మాస్టర్‌ప్లాన్ మేరకు 60 అడుగుల రోడ్డుకు బదులు 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. నగరపాలక సంస్థకు గిఫ్ట్‌గా ఇచ్చి న 10 అడుగుల స్థలంలోనూ నిర్మాణం చేస్తున్నారు. రోడ్ఎఫెక్టెడ్ ఏరియా వదలకుండానే భవనం కడుతున్నారు. పైగా ఇటీవల దీనికి సంబంధించి రోడ్డుపైనే బోరు వేయడం గమ నార్హం. బోరు విషయమై ఫి ర్యాదు వచ్చినప్పటికీ నగరపాలక అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అదే బోరును వాడుతుండడం విశేషం. ఈ భవనానికి సంబంధించి అనుమతుల కోసం 14.11.2024, 25.11.2024, 30.12.2024, 27.02. 2025న దరఖాస్తులు చేసుకోగా నాలుగుసార్లు తిర స్కరించారు. మళ్లీ మరుసగా ఐదోసారి 19.04. 2025న దరఖాస్తు చేసుకోగా టీపీఎస్ రాజేష్ అనుమతులు ఇవ్వడం గమనార్హం. గతంలో టీపీఎస్ రాజేష్ రెండుసార్లు, టీపీఎస్ అనుపమ ఒకసారి, టీపీఎస్ రాజేంద్రప్రసాద్ ఒకసారి తిరస్కరించారు. మళ్లీ ఐదోసారి టీపీఎస్ రాజేష్ అనుమతులు ఇచ్చే లా కథ నడపడం గమనార్హం. ఈ విషయమై పలువురు నగరపాలక కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. టీపీఎస్ రాజేష్ ఇచ్చిన అనుమతులన్నింటిపై తనిఖీలు చేయాలని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఈ విషయమై పరిశీలించి తగి న చర్యలు తీసుకుంటామని కమిషనర్ దిలీప్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. న్యూస్‌రీల్ ఇదీ నిజామాబాద్ నగరపాలక సంస్థ అధికారుల తీరు రిజెక్ట్ చేస్తారు.. తరువాత అనుమతులిస్తారు మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలకు దన్నుగా నిలుస్తున్న అధికారులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోని ఉన్నతాధికారులు విజయ ఆస్పత్రి విషయమై హైకోర్టుకు అనుమతులు సక్రమంగా లేకుండానే విజయ ఆస్పత్రి భవన నిర్మాణం చేశారు. 2011లోనే అనుమతులు తీసుకున్నారని టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ రాజేశ్ చెప్పడం అవినీతికి నిదర్శనం. నగరపాలక, అగ్నిమాపక అధికారులకు ముడుపులు ముట్టడంతో కళ్లముందే నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలేదు. మరోవైపు వైద్యులు లేకుండానే చికిత్సలు చేస్తున్న విషయమై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా మొక్కుబడిగా రూ.10 వేలు జరిమానా విధించి వదిలేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. – తిరుపతి హనుమాన్లు, ఫిర్యాదుదారు నగరంలోని ఖలీల్వాడిలో గల విజయ ఆస్ప త్రి బహుళ అంతస్తుల భవనానికి సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. కనీసం ఇక్కడ ఫైర్ ఇంజిన్ తిరిగే పరిస్థితి లేదు. పై గా రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేశారు. సెట్‌బ్యాక్ ఊసే లేదు. సెల్లార్ అనుమతులు లేవు. ఇక పార్కింగ్ సైతం లేదు. ఇలాంటి నేపథ్యంలో నగరపాలక అధికారులు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం. టీపీఎస్ రాజేష్ ఆఽ ద్వర్యంలో అన్ని ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యా దు దారుడు హనుమాన్లు పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆస్పత్రిలో ఇటీవల రిసెప్షనిస్టే వైద్యం చేసిన నేపథ్యంలో నవీపేట మండలం నాళేశ్వర్‌కు చెందిన కొందరు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా రూ.10 వేలు జరిమా నా విధించి మమ అనిపించారు. వైద్యులు లేకుండానే చికిత్స చేసిన విషయమై రగడ చోటుచేసుకుంది. కాగా విజయ ఆస్పత్రికి సంబంధించి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సాయిచైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే స్టేషన్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 22 మంది ఏఎస్సైలు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లతోపాటు 2018 నుంచి ఇప్పటి వరకు బదిలీకాని 116 మంది కానిస్టేబుళ్లకు స్థాన చలనం కలిగింది. సీపీగా సాయిచైతన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి. సిబ్బందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం బదిలీ ప్రక్రియను చేపట్టారు. అలాగే విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సిబ్బందిని దూరప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. గతంలో సీపీగా పనిచేసిన నాగరాజు 90 మందికి పైగా కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. 22 మంది ఏఎస్సైలు.. 26 మంది హెడ్ కానిస్టేబుళ్లు 116 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సాయిచైతన్య -
సెల్ఫోన్ల చోరీ.. రెండేళ్ల జైలు
కామారెడ్డి క్రైం : ఓ ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండ్ల రాజు ఇంట్లో 2016 మే 8న వేకువ జమున చోరీ జరిగింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తిని కామారెడ్డి పట్టణానికి చెందిన సద్దుల శంకర్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి సుధాకర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. -
టీకాలకు సర్వం సిద్ధం
నిజామాబాద్‌నాగారం: వ్యాధి నిరోధక టీకాలు తీసుకోని ఐదేళ్ల లోపు పిల్లలు, డ్రాప్ అవుట్ పిల్లలతోపాటు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జిల్లాలో 705 శిబిరాలను ఏర్పాటు చేసి టీకాలు వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గర్భిణులు 409 మంది, పిల్లలు 2569 మందికి టీకాలు వేయనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా 12 టీకాల శిబిరాలను హైరిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ ఆయాలు పిల్లలను, గర్భిణులను టీకాల కేంద్రాలకు తరలిస్తే, ఏఎన్ఎంలు టీకాలు ఇస్తారు. డీఐవో పర్యవేక్షణ చేయాలి జిల్లాలో 225 సబ్‌సెంటర్లు, 27పీహెచ్సీ, 07సీహెచ్‌సీ, 10 యుపీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి(ఆర్మూర్), జిల్లా ఆస్పత్రి(బోధన్), జీజీహెచ్ తదితర ఆస్పత్రులున్నాయి. వీటి పరిధిలో 705టీకాల శిబిరాలు ఏర్పాటు చేశారు. డీఐ(జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి) పర్యవేక్షించనున్నారు. వీరితోపాటు ఆయా డివిజన్ల డిప్యూటీ డీఎంహెచ్వోలు సైతం పరీశీలించనున్నారు. నేటి నుంచి 28వ తేదీ వరకు.. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లలు.. గర్భిణులకు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు ప్రతి ఒక్కరికీ టీకాలు ఇవ్వాల్సిందే జిల్లాలో ఐదేళ్ల వయస్సు వర కు పిల్లలకు నెలవారి, ఆరు నెలల, ఏడాది టీకాలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. డ్రాప్ అవుట్ పిల్లలను ఇప్పటికే గుర్తించాం. జరిగింది. ఈ నెల 21 నుంచి 28వరకు పిల్లలందరికీ కచ్చితంగా టీకాలు వేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. – రాజశ్రీ, డీఎంహెచ్‌వో -
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్ అర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో నిర్వహించిన సోమవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటర్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పరీక్షాకేంద్రంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత తమ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో హాల్ టికెట్లు తీసుకోలేని వారు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావొచ్చని స్పష్టం చేశారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ లేకపోయినా విద్యార్థులను అనుమతించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనకమహాలక్ష్మి, ఖిల్లా బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ఖాళిక్ పరీక్షల నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు. సమావేశంలో 36 పరీక్షాకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు రాయనున్న 18,837 మంది విద్యార్థులు ఈనెల 22 నుంచి ప్రారంభం జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ -
సమస్యల పరిష్కారానికే మీడియేషన్ సెంటర్లు
ఖలీల్‌వాడి/నిజామాబాద్నాగరం: సమస్యల పరిష్కార మార్గమే సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రం ప్రధాన ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భర త లక్ష్మి అన్నారు. నగరంలోని దుబ్బ రోడ్డులో ఉన్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో, మారుతినగర్‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పా టు చేసిన మీడియేషన్ సెంటర్లను న్యాయమూర్తి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కొంత మంది తటస్థ వ్యక్తులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఒక్కో సెంటర్లో ఐదుగురు చొప్పున కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు ఉంటారని తెలిపారు. మీడియేషన్ సెంటర్ల ద్వారా సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి ఉదయ్‌భాస్కర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్‌రెడ్డి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, డీఎల్ఎస్ఎ సూపరిటెండెంట్ శైలజ, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
తీగ లాగితే డొంక కదులుతోంది
నిజామాబాద్‌నాగారం: ‘విధులకు డుమ్మా.. రిజిస్ట ర్లో సంతకాలు’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం వైద్యారోగ్యశాఖలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సీరియస్ కావడంతో జిల్లా వైద్యాధికారులతోపాటు రా ష్ట్ర అడ్మినిస్ట్రేటీవ్ డైరెక్టర్ శశిశ్రీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన సిరికొండ పీహెచ్సీలో విచారణ చేపట్టి నివేదికతో వెళ్లారు. ‘సాక్షి’ కథనం ద్వారా తీగ లాగితే డొంక కదులుతోంది. ఒక్కోక్కటిగా అ క్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మౌనంపై అనుమానాలు పీహెచ్‌సీని తనిఖీ చేసేందుకు నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ రెండు నెలల్లో నాలుగుసార్లు వెళ్లారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ఎవరెవరు లీవ్‌లో ఉన్నారు, హాజరు, గైర్హాజరు, ఈఎల్, సీఎల్ తదితర వాటిని రికార్డుల్లో పరిశీలించి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఓ అధికారి ఆరు నెలలపాటు సిక్ లీవ్‌లో ఉంటే జిల్లా వైద్యాధికారి అనుమతి ఉండాలి, ఒకవేళ అనుమతి ఉన్నా తిరిగి విధుల్లో చేరేందుకు సైతం ఉన్నతాధికారి అనుమతించాల్సి ఉంటుంది. అయితే పలుమార్లు తనిఖీలకు వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌వో అటెండెన్స్ రిజిస్టర్‌ను ఎందుకు పరిశీలించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరికొండ పీహెచ్సీలో అక్రమాలెన్నో.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వైనంఇష్టారాజ్యం సిరికొండ పీహెచ్సీ ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. కొందరు అసలే విధులకు హాజరుకాకపోగా, మరికొంత మంది ఇలా వచ్చి అలా వె ళ్తుండగా, ఇంకొంత మంది రాకున్నా అటెండెన్స్ రిజిస్టర్లో దర్జాగా సంతకాలు చేస్తున్నారు. పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్‌సీ మార్చి, ఏప్రిల్ నెలల్లో సక్రమంగా విధులకు హాజరుకాకున్నా రిజస్టర్‌లో సంతకాలు చేసి జీతం పొందినట్లు తెలిసింది. సెక్షన్లో పైఅధికారికి ప్రతి నెలా సుమారు రూ.20వేల వరకు కమీషన్ ఇవ్వడంతోనే దర్జాగా జీతాలు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సిక్ లీవ్‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆ తరువాత జిల్లా ఉన్నతాధికారికి తెలియకుండానే విధుల్లోకి చేరినట్లు తెలిసింది. -
హెచ్‌యూఐడీ నంబరు అనే మాటే లేదు..
బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో లీగల్ మెట్రాలజీ శాఖ కేవలం ఎలక్ట్రానిక్ కాంటాలు, తూకంల తనిఖీకే పరిమితమవుతోంది. వినియోగదారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యత విషయంలో మోసపోతున్నారు. లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 రూల్ 9 (4) ప్రకారం వ్యాపారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా రసీదులపై రాయాలి. అలాగే రూల్ 9 (5) ప్రకారం బంగారు, వెండి ఆభరణాల నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించే అధికారం లీ గల్ మెట్రాలజీ అధికారులకు ఉంది. అయితే ఉమ్మ డి జిల్లాలో అధికారులు నా ణ్యతా పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో బంగారం విక్రయించే చిన్న, పెద్ద వ్యాపారులెవరూ బిల్లులపై హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబరును వేయకుండానే విక్ర యాలు సాగిస్తుండడం గమనార్హం. -
కనిపించని కచ్చితత్వం
● తూనికలు, కొలతలపై అవగాహన నామమాత్రమే ● ఆ శాఖ మనుగడలో ఉందా? లేదా? అని సందేహాలు ● కనీసం ఉనికి చాటని వైనం ● బంగారం బిల్లులపై కనిపించని హెచ్‌యూఐడీ నంబర్ ● నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం వ్యాపారి నుంచి వస్తువు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుడికి ఆ వస్తువుకు సంబంధించిన కొలతల కచ్చితత్వం, దాని నాణ్యతలో విశ్వసనీయత ఎక్కడా కనిపించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తూనికలు, కొలతల 2011 లీగల్ మెట్రాలజీ నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసలు తూనికలు, కొలతల శాఖ మనుగడలో ఉందా? అనే పరిస్థితి ఉంది. నేడు అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తూనికలు, కొలతల శాఖ విధులకు సంబంధించి ప్రభుత్వాలు అవగాహన కల్పించే విషయంలో ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. వ్యాపారులు యథేచ్ఛగా మోసం చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తూనికలు, కొలతల శాఖ 2011 లీగల్ మెట్రాలజీ రూల్స్ అమలు చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యం నెలకొంది. అసలు ఈ శాఖ పనిచేస్తున్న సంగతే ఎవరికీ తెలియని పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకే లీగల్ మెట్రాలజీ శాఖ గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక ఉమ్మడి జిల్లా లో గ్రామీణ వినియోగదారుల శాతం అత్యధికంగా 67శాతం ఉంది. తూనికలు, కొలతలకే పరిమితం కాదు.. లీగల్ మెట్రాలజీ శాఖ కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లలో తూనికలు కొలతలలకే పరిమితం కాదనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకోవాలి. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు సైతం పెట్రోల్, డీజిల్ విషయంలోనూ క్వాంటిటీపై ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు చూసే థర్మామీటర్, గ్యాస్ మీటర్లు, ఇంటర్నెట్ స్పీడ్ లెక్కించడం, ఆటో మీటర్లు, ట్యాక్సీ మీటర్లు, తూకం రాళ్లు, ఎల క్ట్రానిక్ కాంటాలు, వే బ్రిడ్జీలు, హోటళ్లలో ఇష్టం వచ్చిన ధరలకు నీళ్ల బాటిళ్లు తదితర వాటిని లీగల్ మెట్రాలజీ అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఆ దిశగా అధికారులు పని చేయకపోవడంతో ఎవరూ నిబంధనలు పాటించడంలేదు. ‘లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ 2011‘ మేరకు గ్యాస్ మీటర్లు, ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకొనే పరికరాలు, ఆహార పదార్థాలలో కొవ్వు శాతం తెలుసుకొనే పరికరాలు, శ్వాస వేగం తెలుసుకొనే బ్రీత్ అనలైజర్స్, టాక్సీ మీటర్లు, రైల్వే వే బ్రిడ్జీలు, నీటిలో చల్లదనం, వేడి శాతం తెలుసు కొనే వాటర్ మీటర్లు తదితర కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి గాను లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011లో సవరణలు జరిగాయి. రెడీమిక్స్కూ లీగల్ మెట్రాలజీ నిబంధనలు.. భవన నిర్మాణాలకు సంబంధించి బిల్డర్లు అపార్ట్మెంట్ల నిర్మాణంలో లీగల్ మెట్రాలజీ నిబంధనలు పాటించాల్సి ఉంది. సిమెంట్, ఇసుక, కంకర మిక్స్ విషయంలో పాటించాల్సిన ప్రమాణాల విషయంలో తూనికలు, కొలతల విభాగం అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయాలపై వినియోగదారులకు సైతం ఏమాత్రం అవగాహన లేదు. సినిమా థియేటర్లలో.. నిజామాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో ఇష్టారీతిన ధరలు వసూలు చేస్తున్నారు. తినే పదార్థాల ప్యాక్‌లపై ఇష్టం వచ్చినట్లు ఎమ్మార్పీలు ముద్రించి విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిళ్లు, శీతల పానీయాలు, తినుబండారాల విషయంలో భారీ దోపిడీ సాగుతోంది. బయటితో పోలిస్తే అనేక రెట్ల ధరలు వసూలు చేస్తున్నారు. ఇక తినుబండారాల నాణ్యత మరీ తీసికట్టే. కమిషన్‌ను ఆశ్రయించాలి బంగారం విషయంలో హెచ్‌యూఐడీ నంబర్లు ఇవ్వకపోయినా, నిబంధనలు పాటించకపోయినా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్‌కు ఫి ర్యాదు చేయాలి. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించాలి. అయినప్పటికీ పట్టించుకోకపోతే వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించాలి. పెట్రోల్, డీజిల్ క్వాలి టీ, క్వాంటిటీ విషయంలో తేడాలుంటే పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారులు పట్టించుకోకపోతే వినియోగదారుల కమిషన్‌కు వెళ్లాలి. అందరూ తూనికలు, కొలతలపై అవగాహన కలిగి ఉండాలి. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి -
మనం సైతం దేశం కోసం..
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ర్యాలీ కన్వీనర్ కృపాకర్‌రెడ్డి తదితరులుభారత సైన్యానికి మద్దతుగా ‘మనం సైతం దేశం కోసం’ అంటూ నగరవాసులు సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సాయుధదళాలకు గౌరవ సూచకంగా నిర్వహించిన ర్యాలీకి భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి నినాదాలు మారుమోగాయి. సర్వీస్మెన్లు, సైనికులు ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. – సుభాష్‌నగర్ -
ప్రైవేట్ స్కూళ్ల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్‌అర్బన్: ప్రైవేట్ పాఠశాలల స మస్యలను పరిష్కరించాలని ట్రస్మా నాయకులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి జయసింహగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రైవే ట్ స్కూల్ ఫీ రెగ్యులేటర్ కమిటీ పొందుపర్చిన అంశాల్లో ఇబ్బందులను తొలగించాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు రాస నిత్యానందం, జిల్లా సెక్రెటరీ గోజూరి అరుణ్, రాష్ట్ర అడ్వైజర్ మామి డాల మోహన్, అర్బన్ ప్రెసిడెంట్ ధర్మరాజు, సెక్రెటరీ శ్రీనివాస్, నర్సాగౌడ్, పృథ్వి, మైనారిటీ ప్రెసిడెంట్ ఇక్బాల్ ఖాన్, మహమ్మద్ కైఫ్, ముజాహిద్ రహమాన్, జాకీర్ హుస్సేన్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్‌అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూ ల్ స్కీం కోసం ఆసక్తి ఉన్న ప్రైవేట్ పాఠశాల లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తులను ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు.. నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ విద్యార్థులు ఇంటర్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి నిర్మల ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వ సతి గృహాల్లో చదివి, పదో తరగతిలో 7.0 జీపీఏ, ఆపై జీపీఏ సాధించినవారు అర్హుల ని తెలిపారు. ఈనెల 31వ తేదీలోగా దర ఖాస్తు చేసుకోవాలని, అనంతరం ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. నేడు ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ ఖలీల్‌వాడి: ప్రయాణికుల సమస్యలను తె లుసుకోవడంతోపాటు వారి సలహాలు, సూ చనలను స్వీకరించేందుకు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్ఎం జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కొనసాగుతుందని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. డిగ్రీ పరీక్షల్లో 508 మంది గైర్హాజరుతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం మూడో రోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో 7,680 మంది విద్యార్థులకు 7,172 మంది హాజరు కాగా 508 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 7,112 మంది విద్యార్థులకు 6,670 మంది హాజరు కాగా 442 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 558 మంది విద్యార్థులకు 502 మంది హాజరుకాగా 66 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సేంద్రియ సాగుపై శిక్షణ డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో గ్రా మీణ యువ రైతులకు సేంద్రియ వ్యవసా యంపై నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ భరత్ కు మార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్ 1వరకు శిక్షణ ఇస్తామని.. ఉచి త వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నా రు. పదో తరగతి ఉత్తీర్ణులైన యువ రైతులు ఈ నెల 23వ తేదీలోగా కలెక్టరేట్లోని ఆత్మ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో 15 మందిని ఎంపిక చేసిన శిక్షణ ఇస్తామని, వివరాలకు 94406 87698ను సంప్రదించాలన్నారు. రీజినల్ మేనేజర్ 99592 26011 ఆర్మూర్ డిపో 99592 26019 బోధన్ డిపో 99592 26001 నిజామాబాద్ డిపో1 99592 26016 నిజామాబాద్ డిపో 2 99592 26017 కామారెడ్డి డిపో 99592 26018 బాన్సువాడ డిపో 99592 26020 -
సేంద్రియ ఎరువులను వినియోగించాలి
రెంజల్(బోధన్): నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించాలని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు స్వప్న, రాజ్‌కుమార్ సూచించారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు తక్కువ యూరియా వినియోగించుకొని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలన్నారు. ప్రైవేట్ రకాలకు దీటుగా వానాకాలానికి అనువైన వరి వంగడాలు కూనారం 1638, వరంగల్ సిద్ది, డబ్ల్యూజీఎల్ 1119, ఆర్డీఆర్ 1200, ఆర్డీఆర్ 1162, ఆర్ఎన్ఆర్ 15048 వంటి రకాలు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రావ్, పశువైద్యాధికారి విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట.. పంట దిట్ట
బాల్కొండ: అధికంగా దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతమైన రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని పంటలు తీవ్రమైన పోషకాల లోపాలతోపాటు చీడపీడల ఉధృతికి గురవుతాయి. వీటన్నింటికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకమే విరుగుడని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తోంది. పచ్చిరొట్ట సాగు, వాటి ఉపయోగాలపై బాల్కొండ వ్యవసాయ అధికారి బద్దం లావణ్య వివరించారు. జనుము జనుము ఎకరానికి 10– 15 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. జనుమును పూత దశలో దుక్కిలో కలియదున్నాలి. ఒక టన్ను జనుము పచ్చిరొట్టలో 4 కిలోల నత్రజని ఉంటుంది. వరి పొలాలకు, ముంపు నేలలకు ఉపయోగపడుతుంది. జీలుగ జీలుగ ఎకరానికి 8–10 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. విత్తిన 70–80 రోజుల వ్యవధిలో కలియదున్నాలి. ఒక టన్ను జీలుగ పచ్చిరొట్టలో 5 కిలోల నత్రజని ఉంటుంది. చౌడు నేలలకు ఉపయోగపడుతుంది. పిల్లిపెసర పిల్లి పెసర ఎకరానికి 4–5 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. పూతదశలో కలియదున్నాలి. అన్ని నేలలకు ఉపయోగపడుతుంది. పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉలవ ఉలవ పచ్చిరొట్ట ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి వస్తుంది. పూతదశలో కలియదున్నాలి. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అన్ని నేలకు శ్రేయస్కరం. అలసంద అలసంద పచ్చిరొట్ట ఎకరానికి 4–6 టన్నుల దిగుబడి వస్తుంది. పూతదశలో కలియదున్నాలి. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తేలిక నేలల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో 3.5 కిలోల నత్రజని ఉంటుంది. ఉపయోగాలు ఇవే..పచ్చిరొట్టల్లో సేంద్రియ పదార్థముంటుంది. సూక్ష్మజీవులు విస్తరంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమిని గుల్ల బరిచి నీటి నిలువ, ఇసుక బాగుపడి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. ఈ జాతి పైర్ల వేర్లు భూలోపలికి వెళ్లి గట్టి పొరలను చీల్చుతాయి. పచ్చిరొట్ట పైర్ల సాగుతో సూక్ష్మపోషక పదార్థాల లోపాలు రాకుండా ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి.విత్తేకాలంఖరీఫ్ పంటలకు ముందు మే, జూన్‌లో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నేలను దున్ని ఎకరానికి 12–15 కిలోల విత్తనం చల్లాలి. జనుము ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. దీర్ఘకాలిక పంటలు అయిన పండ్ల తోటల మధ్య పచ్చిరొట్టలు వేసి పెరిగిన తర్వాత దుక్కిలో దున్నవచ్చు. భూసారం పెరుగుదలకు దోహదం రాయితీపై అందజేస్తున్న సర్కారు -
నేటి నుంచి రెండో విడత టీచర్లకు శిక్షణ
మోపాల్: నగర శివారులోని బోర్గాం(పీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని డీఈవో అశోక్ తెలిపారు. సోమవారం రెండో విడత టీచర్ల శిక్షణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని బోర్గాం(పీ) జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెండో విడత టీచర్ల సమావేశం ఐదురోజులపాటు కొనసాగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు సెంటర్ ఇన్చార్జీలు చేసుకోవాలని సూచించారు. రీసోర్స్ పర్సన్లు సెషన్ వారీగా అంశాలపై తగిన టీఎల్ఎం తయారు చేసుకొని ప్రిపేర్కావాలన్నారు. డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రైనింగ్‌కు ముందు, కొనసాగే సమయం, ట్రైనింగ్ తర్వాత విషయాలను వివరించారు. ఆర్పీలు శిక్షణను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్, ఏఎంవో, సెంటర్ ఇన్చార్జీలు, డీఆర్పీలు పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల రాకేశ్(20) అనే డిగ్రీ విద్యార్థి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల పోచవ్వ, గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రాకేశ్ ఎల్లారెడ్డి పట్టణంలో రౖపైవెట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఉపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. తమ్ముడు మధుతో కలిసి చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్న రాకేశ్ ఫోన్లో ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ గేమ్ ఆడటం ద్వారా రూ. 80 వేలు పొగొట్టుకున్నాడు. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించాడు. అంతే కాకుండా రాకేశ్ తరచూ ఫోన్ మాట్లాడుతున్నాడని తండ్రి మరోమారు మందలించడంతో తీవ్ర మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పీవోకే సాధించుకోవడమే లక్ష్యం
సుభాష్‌నగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను సాధించుకోవడమే ఏకై క లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికుల ఘన విజయం, త్రివిధ దళాల ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సా యంత్రం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సిందూరు ద్వారా భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇందూరులోనూ దేశద్రోహులు ఉన్నా రని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని ప్రధాని మోదీ చెప్పినా కొందరు దాక్కున్నారని తెలిపారు. భారతీయులందరం భారత సైన్యం వెంట ఉన్నామనడానికి ఈ ర్యాలీ నిదర్శనమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ప్రధాని మోదీతోనే దేశం సురక్షితంగా ఉంటుందని, ఆయనే దేశానికి రక్షకు డని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. మనమంతా ఒక్కటేనని, ఇలాంటి విపత్కర సమయంలో ఏకతాటిపై నిలబడాలని, ఐక్యత చాటేలా ఇందూరులో తిరంగా ర్యాలీ విజయవంతంగా కొనసాగిందని సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ప్రముఖులు డాక్టర్ వెంకటరమణ, పంచరెడ్డి ఎర్రన్న, రామర్తి గంగాధర్, రవిరాజ్, కొండా దశరథం, పవన్ ఖేడియా, సుబ్బారావు, కమల్ కిశోర్ ఇనాని, బీజేపీ నాయకులు న్యాలం రాజు, స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి నెహ్రూపార్క్ వద్ద ర్యాలీని పర్యవేక్షించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరులో భారీ తిరంగా ర్యాలీ -
ప్రజావాణికి 104 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలి.. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో కబ్జాకు గురవుతున్న ఇరిగేషన్ స్థలాన్ని కాపాడాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్గుల్ సురేశ్ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విలువైన నిజాంసాగర్ కాలువ స్థలాన్ని కొందరు తప్పుడు సర్వే నంబర్లతో కబ్జా చేశారని పేర్కొన్నారు. స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇతరులకు విక్రయిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
మనస్పర్ధలతో భార్యను కడతేర్చిన భర్త
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే అంజలిని భర్త గంగారెడ్డి అడ్డు తొలగించుకున్నట్లు సమాచారం. దుబాయిలో ఉంటున్న గంగారెడ్డి.. ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని భార్యకు తెలవడంతోనే గొడవలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లగా, కోర్టులో కేసు నడుస్తుండగానే అంజలిని గంగారెడ్డి హతమార్చాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.ఆర్మూర్‌టౌన్: కట్టుకున్న భార్యను కన్నపిల్లల ఎదుటే గొంతుకోసి హతమార్చిన ఘటన ఆర్మూర్ పట్టణంలో సోమవారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అలియాస్ గంగారెడ్డికి జగిత్యాల జిల్లా మొగిల్పేట్ గ్రామానికి చెందిన అంజలి(35)తో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గంగారెడ్డి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్తూ వస్తుండేవాడు. గంగారెడ్డి–అంజలి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం బోధన్ కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు నడుస్తోంది. గొడవల కారణంగా అంజలి తన ఇద్దరి కూతుళ్లతో కలిసి 20 రోజుల క్రితం ఆర్మూర్ పట్టణంలో నివాసముంటుంది. కేసు నిమిత్తం అంజలి కూతుళ్లతో కలిసి సోమవారం బోధన్ కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటోంది. భర్త గంగారెడ్డి ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న పిల్లలను తోసేసి అంజలి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. పిల్లల అరుపులు విన్న ఇంటి యజమాని విషయం తెలుసుకునేందుకు రాగా అతనిని సైతం తోసేసాడు. దీంతో గంగారెడ్డి బయటికి వెళ్లకుండా యజమాని ఇంటి గేటు మూసేసి గడియపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజలి అప్పటికే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య, ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. పిల్లల ఎదుటే దారుణం -
ధర్మమార్గంలో నడవాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రజలంతా ధర్మమార్గంలో నడవాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధానంగా యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. సోమవారం డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తనది నిర్మల్ జిల్లా అయినప్పటికీ డొంకేశ్వర్ మండల చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నారని, నికాల్‌పూర్‌లో కూడా ఉన్నట్లు తెలిపారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కమిటీ, వీడీసీ సభ్యులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. చివరి రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, అభిషేకం, కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి, రావుల సుభాష్, భీమ్‌నాయక్, సుమన్ పాల్గొన్నారు. -
కోర్టులో ఉద్యోగం పేరిట నకిలీ అపాయింట్మెంట్
ఖలీల్‌వాడి: కోర్టులో ఉద్యోగం కల్పిస్తామని మాయమాటలు చెప్పి రూ. 9 లక్షలు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తిపై నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామ పరిధిలోని లింగి తండాకు చెందిన తేజావత్ పీరు సోమవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సిరికొండ మండలంలోని చీమన్‌పల్లి గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ ఓ శుభకార్యంలో కలిసి పోస్టాఫీసు, కోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికినట్లు చెప్పారు. దీంతో పీరు తమ తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.4 లక్షలు డబ్బులు తీసుకొని పోస్టాఫీసులో ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో కొన్ని రోజుల తర్వాత నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసి మోహన్‌ను నిలదీయగా ఎవరికీ చెప్పొద్దని, కోర్టులో మార్చి నెలలో ఉద్యోగం ఇప్పిస్తానని మిగితా డబ్బులు చెల్లించాలని చెప్పడంతో అప్పు చేసి మరో రూ. 5 లక్షల వరకు చెల్లించినట్లు పేర్కొంది. మాలవత్ మోహన్‌తోపాటు అతని భార్య లావణ్య, కుతూరు శ్రావణి, కుమారుడు శ్రావణ్‌తోపాటు మాలవత్ రాజుకు విడతల వారీగా రూ.9 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. కోర్టు ఉద్యోగం వచ్చిందని మాలవత్ రాజు జిల్లా కోర్టులోని రెండో ఫ్లోర్‌లోకి వెళ్లి అక్కడ నిలుచోబెట్టి ఒక రిజిస్ట్రార్ తీసుకువచ్చి సంతకం చేయించుకున్నట్లు చెప్పింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనడంతో అనుమానం వచ్చి అపాయిమెంట్ ఆర్డర్ చూపించడంతో నకిలీదిగా తేలిందన్నారు. ఇదే విషయాన్ని మోహన్‌ను అడిగితే దుర్భషలాడుతున్నట్లు చెప్పారు. నకిలీ అపాయిమెంట్ ఇచ్చిన మోహన్‌తోపాటు వారి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకువాలని సీపీని కోరినట్లు బాధితురాలు తెలిపారు. సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్: మండలంలోని మంచిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008–09 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు.. ఆత్మీయంగా పలకరించుకొని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. ముగిసిన వాలీబాల్ శిక్షణ శిబిరంపెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ డీటీవో ఉమా మహేశ్వర్ రావు, ఆదిలాబాద్ రోడ్డు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడాకారుల అవసరాల కోసం రూ.20 వేల నగదును అందజేశారు. విద్యార్థులకు శిక్షణనిస్తున్న పీఈటీ మధును అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ ఎంవీఐలు వివేకానంద రెడ్డి, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
భావ్‌సర్‌లు
ఇందూర్లో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించాలని భారత ప్రజలు ముఖ్యంగా భావ్సర్(రంగరి) క్షత్రియులు బలంగా కోరుకుంటున్నారు. బలూచ్ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలుగుతుందని ఆశించడమే అందుకు ప్రధాన కారణం. విభజన సమయంలో బలూచ్ ప్రాంతాన్ని వీడి వచ్చిన భావ్సర్ క్షత్రియ సమాజ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇందూరులో వేయి కుటుంబాలకు పైగా ఉండగా, వారుతమ ఆరాధ్య దైవం హింగులా మాత ఆలయాన్ని నిర్మించి ప్రత్యేకంగా కొలుస్తున్నారు. ఇందూరులోని ఆలయంలో హింగులాంబిక అమ్మవారు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కన్నా ఎక్కువగా ఆ దేశానికి నైరుతిభాగంలో ఉన్న బలూచిస్తాన్ అంశంపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు బలూచిస్తాన్ తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, భారతదేశంలోని ప్రతిఒక్కరూ ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిన భావ్సర్ క్షత్రియ సమాజ్ వారు మాత్రం మరింత ఆసక్తిగా, బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించా లని బలంగా కోరుకుంటున్నారు. తమ మూల స్థానమైన బలూచ్‌లో కొలువై ఉన్న హింగులా మా తను మొక్కుకుంటున్నారు. అఖండ భారత్‌లో భాగమైన బలూచ్ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలగాలని కోరుకుంటున్నారు. అమ్మవారి 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగులాదేవి ప్రధాన ఆలయం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌లోని హింగోల్ నేషనల్ పార్క్‌లో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుల పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగుళా మాత అసలు పేరు కోట రి. హింగుల పర్వతంపై ఉండడంతో హింగుళాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వతంపై గుహలో హింగులామాత నిత్యం జ్వలి స్తూ దర్శనమిస్తోంది. ప్రకృతి నిర్మిత గుహ ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగులాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన శక్తిస్వరూపిణి ఆలయాన్ని ఇందూరు నగరంలో భావ్సర్ క్షత్రియ సమాజ్ (రంగరి) (వస్త్రాలకు రంగులు వేసే) ఆధ్వర్యంలో 1982లో నిర్మించారు. ఇందూరులోని హింగులా మాత ఆలయంలో ప్రతిరోజూ అభిషేకం, ప్రతి మంగళవారం భజనలు, ప్రతి పౌర్ణమికి యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం నిర్వహిస్తున్నారు. దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇందూరులో ఊరపండుగ అయ్యాక వారం రోజుల తరువాత పసుపు, కుంకుమ, కాగడాలతో పాటలు పాడుతూ గోందాల్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గుండెల్లోనే హింగులామాత హింగులా మాత శక్తిపీఠం భౌతికంగా భారతదేశానికి బయట ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక శ్రద్ధా చింతనల దృష్ట్యా అమ్మవారు అందరి గుండెల్లో కొలువై ఉన్నారు. ఇది హిందూ ధర్మంలోని శక్తితత్వానికి, భక్తి బలానికి నిలువుటద్దం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవిస్తే భారతీయులందరూ హింగుళా మాత శక్తిపీఠాన్ని ఎప్పుడంటే అప్పుడు దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇది భారతీయులందరికీ మరింత హర్షదాయకం. – భోక్రే నారాయణ, భావ్సర్ క్షత్రియ సమాజ్ సభ్యుడుఆలయంలోని ధ్వజస్తంభం ఇందూరు హింగుళా మాత నగరంలో హింగులామాతకు ఆలయం భావ్సర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో 1982లో నిర్మాణం దేశ విభజన సమయంలో ఇక్కడికి రాక ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో హింగులా శక్తిపీఠంపై ఆసక్తి బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని బలంగా కోరుకుంటున్న ప్రజలుశిరోపీఠంగా ప్రసిద్ధి హింగులా మాత కొలువై ఉన్న ప్రాంతం అఖండ శక్తి తరంగాలతో నిండినట్లుగా భావిస్తారు. హింగుళ ప్రాంతంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శిరస్సు పడడంతో ఇది శిరోపీఠంగా ప్రసిద్ధి చెందింది. హింగుల పర్వతంలోని గుహ ఆలయంలో ప్రతిష్టిత విగ్రహం లేదు. అక్కడ ఉన్న శిల అమ్మవారి శక్తి స్వరూపంగా భావించబడుతోంది. భక్తులు ఆ శిలపై చందనం, కుంకుమతో పూజలు చేస్తున్నారు. అలాగే ముస్లింలు, జిక్రీ మతస్తులు పూజలు చేస్తున్నారు. వారు హింగులా (హింగ్లాజ్) మాతను ‘నానీ మాంఘే’ అని గౌరవంగా పిలుచుకుంటారు. – మైస్కర్ విజయలత చంద్రకాంత్ బరిడే, భావ్సర్ క్షత్రియ సమాజ్ అధ్యక్షురాలు, ఇందూరుదేశవిభజన సమయంలో ఇక్కడికి.. దేశవిభజన సమయంలో రంగరి (భావ్సర్ క్షత్రియ సమాజ్) కులస్తులు బలూచిస్తాన్ ప్రాంతం నుంచి రాజస్తాన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఈ సమాజ్ కు చెందిన వేయికి పైగా కుటుంబాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరగా హింగులాదేవి కాపాడి వస్త్రాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్ పెద్దలు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
నిజామాబాద్‌అర్బన్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షాసమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని, ప్రధాన సమస్యలు ఏమిటని అధికారులను మహేశ్‌కుమార్‌గౌడ్ అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర వివరాలు తెలుసుకున్నారు. పారాబాయిల్డ్ రైస్ శాతాన్ని పెంచే విధంగా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు 8.01లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ● రూ.1,604 కోట్లు రైతుల ఖాతాల్లో జమ సుభాష్‌నగర్: జిల్లాలో యాసంగి సీజన్లో 601 కొను గోలు కేంద్రాల ద్వా రా 93,974 మంది రైతుల నుంచి 8.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్వో) అరవింద్‌రెడ్డి శనివారం తెలిపారు. 7.15లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకా లు కాగా, 85,739 మెట్రిక్ టన్నులు దొడ్డురకాలను సేకరించామని వివరించారు. రూ.1867.64 కోట్ల విలువైన ధాన్యాన్ని కేంద్రాల ద్వారా సేకరించామని, 86,339 మంది రైతుల ఖాతాల్లో రూ.1604 కోట్లు జమ చేశామన్నారు. చివరి గింజ వరకూ ధాన్యం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో కొనుగోళ్లు చేపడుతున్నామని తెలి పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులు త్వరలోనే జమవుతాయని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. గుండెపోటుతో 16ఏళ్ల బాలుడు మృతి డొంకేశ్వర్(ఆర్మూర్): గుండెపోటుతో పదహారేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల శివ ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి గ్రేడ్–ఏ ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి గంగన్న చిన్నతనంలోనే చనిపోగా తల్లి సరిత కూలీ పనులు చేస్తూ కొడుకును పోషిస్తోంది. పేద కుటుంబ కావడంతో బాగా చదివి కుటుంబానికి అండగా ఉండాలని శివ అనుకునేవాడు. గ్రామంలోనే పని చేస్తూ చదువుకునేవాడు. శనివారం ఉదయం తీవ్రమైన దగ్గు కారణంగా శివ గుండెపోటుకు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. దీంతో తల్లి సరిత గుండెలవిసేలా రోదించింది. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, యువకులు విరాళాలు పోగుచేసి బాధిత కుటుంబానికి రూ.లక్ష వరకు అందజేశారు. -
టీఎన్జీవోస్లో కారు రగడ
నన్నే ప్రశ్నిస్తారా? కారు కొనుగోలు విషయమై ఉద్యోగులు ప్రశ్నించడంపై అధ్యక్షుడు పలుమార్లు సమావేశంలో హెచ్చరించినట్లు తెలిసింది. రాష్ట్ర నాయకుల అనుమతి తీసుకొని కారు కొనుగోలు చేశానని, దీనిపై ఉద్యోగులు ప్రశ్నించొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో కార్యవర్గం మొత్తం రాష్ట్ర నాయకులను కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా టీఎన్జీవోస్ నిబంధనల ప్రకారం ఈసీ తీర్మానం లేకుండా అధ్యక్ష, కార్యదర్శులు ఎలాంటి కొనుగోళ్లు, ఖర్చులు చేయొద్దు. కానీ, ప్రస్తుతం టీఎన్జీవోస్లో కొనుగోలు, ఖర్చు చేసిన తర్వాతే సమావేశాల్లో వివరాలు వెల్లడిస్తున్నారు. లిఖిత పూర్వకంగా ఖర్చుల వివరాలు అందించకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. నిజామాబాద్ అర్బన్: టీఎన్జీవోస్లో కారు కొనుగోలు రగడ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లే నివిధంగా జిల్లాలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు సభ్యత్వ రుసుము నిధులతో కారు కొనుగోలు చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సమ స్యలపై పోరాటానికి, కార్యవర్గ బలోపేతానికి ఉపయోగించాల్సిన నిధులతో వాహనం కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈసీ మీటింగ్‌లోనూ కారు కొనుగోలుపై చర్చ కొనసాగింది. సమాచారం లేకుండానే.. జిల్లాలో వివిధ శాఖల నుంచి టీఎన్జీవోస్లో 10,473 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో ఒక్కో ఉ ద్యోగి సభ్యత్వ రుసుము రూపంలో రూ.200 చొ ప్పున డబ్బులు చెల్లిస్తారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ చౌరస్తాలోని సంఘ భవనంలో కొనసాగుతున్న హోటల్, ఇతర దుకాణాల నుంచి నెలకు అద్దె రూ పంలో రూ.4 లక్షల ఆదాయం సమకూరుతోంది. కాగా, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రెండు నెలల క్రి తం టీఎన్జీవోస్ నిధులు రూ. 34 లక్షలతో నూతన కారును కొనుగోలు చేశారు. మొదట రూ.9 లక్షలు చెల్లించి, మిగతా డబ్బులను విడతల వారీగా చెల్లింపులకు నిర్ణయించారు. దీని ప్రకారం నెలకు రూ. 40వేలు టీఎన్జీవోస్ నుంచి చెల్లిస్తున్నారు. కాగా, ఈ విషయమై ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. తీరా కొనుగోలు చేసిన తర్వాత తెలపడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర నాయకుడొకరు అధ్యక్షుడిని ప్ర శ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా టీ ఎన్జీవోస్ సొంత కారు కొనుగోలు చేయకుండా, కేవలం నిజామాబాద్‌లోనే కారు ఎలా కొనుగోలు చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సంఘం నిధులు రూ.34 లక్షలతో కొనుగోలు సభ్యత్వ నిధుల వినియోగంపై ఉద్యోగుల మండిపాటు -
సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ
సుభాష్‌నగర్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భా రత సైనికుల ఘన విజయాన్ని పురస్కరించుకుని ఇందూరులో ఈ నెల 19న నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవీ కృపాకర్‌రెడ్డి అధ్యక్షతన నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పహల్గాం ఘ టనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన హత్యా కాండను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. ఆ ఘటనకు బదులుగా ప్రధాని మోదీ ఆదేశాలతో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందమందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు. ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్–400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమికొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిందని కొనియాడారు. ఈ విజయానికి గుర్తుగా మనమూ.. దేశం కోసం నినాదంతో భారీ తిరంగా ర్యాలీ ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 19న సాయంత్రం 4 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా నుంచి గాంధీచౌక్ వ రకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు ఓం ప్రకాశ్ దైమా, డాక్టర్ వెంకటరమ ణ, యాదగిరి, నరసింహ, గజం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచరెడ్డి ఎర్రన్న పాల్గొన్నారు. రేపు ఇందూరులో చేపట్టే ర్యాలీని ప్రజలు విజయవంతం చేయాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ -
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈవో అశోక్ సూచించారు. నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా జరుగుతున్న మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని, స్పష్టమైన అవగాహనతో విద్యాబోధన చేయాలని సూచించారు. సెంటర్ ఇన్చార్జి శంకర్ మాట్లాడుతూ.. సబ్జెక్టు వారీగా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై అవగాహన ఉండాలని, ఈ శిక్షణ ఔట్ కమ్స్ వివరాలు అందించినట్లు తెలిపారు. అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రిసోర్స్పర్సన్లను డీఈవో సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘మీ సేవా’ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీనారాయణ
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రె సిడెంట్‌గా జిల్లాకు చెందిన కే లక్ష్మీనారాయణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ నాసిర్ అహ్మద్ నియమితులయ్యరు. వీరిని రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల జీవన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్, కోశాధికారి జీ శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రలో మీ సేవా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చింత రాజు, ముజాహిదుద్దీన్ అన్సారీ, గోపాల్, సంతోష్ పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
నిజామాబాద్ అర్బన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్‌ను పురస్కరించుకొని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ బక్రీద్‌ను దృష్టిలో పెట్టుకొని జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోవులతోపాటు ఒంటెలు వధించకుండా నిషేధం అమలులో ఉందని తెలిపారు. దీనిపై ప్రజలకు విస్తతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులను స్లాట ర్ హౌస్‌లలోనే వధించాలని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వధించరాదని సూచించారు. పశువుల అక్ర మ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూర, పొతంగల్, ఖండ్గావ్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతోపాటు, సాటాపూర్, యంచ, ఇందల్వా యి, ఉమ్మెడ, జన్నెపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు ని రంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల వారాంతపు సంతలలో నిబంధనలకు అనుగుణంగా క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ తో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు, ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, పశు సంవర్ధక, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య -
బీఆర్ఎస్లో మూడు ముక్కలాట
నిజామాబాద్ రూరల్: కవిత, కేటీఆర్, హరీశ్‌రావు పోరుతో బీఆర్ఎస్లో మూడు ముక్కలాట నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. వారి పోరుతాళలేక కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోసం ఆరాటపడుతుందని ఎద్దెవా చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ముడు ముక్కలాట పోరు తాళలేక కేసీఆర్ ఫాం హౌస్‌కు పరిమితం అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ కనపడదన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. పాక్‌పై యుద్ధంతో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అన్న విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దిగజారి కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ తరహాలో సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చట్టం తెచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస సీనియర్ నాయకులు మునిపల్లి సాయారెడ్డి, విపుల్‌గౌడ్ తదితరులు పాలొన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతోంది టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ -
గంజాయి తాగిన వ్యక్తి అరెస్టు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గంజాయి తాగిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. మండలకేంద్రంలో శనివారం ప్రొబేషనరీ ఎస్సై శైలేందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా, శ్రీరాంనగర్ తండాకు చెందిన భామన్ బహదూర్ సింగ్ బైక్‌పై వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. అతడు గంజాయి తాగినట్లు గుర్తించి, పట్టుకున్నారు. బైక్‌లో ఉన్న 45 గ్రాముల గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, సౌత్ రూరల్ సీఐ సురేష్‌కుమార్ అభినందించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామ సమీపంలోని గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని పట్టుకుని పో లీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. ఇసుక ట్రాక్టర్ల డైవర్లపై కేసు నమెదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు. నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు ఖలీల్‌వాడి: నగరంలోని బోధన్ రోడ్డులో ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ నడిపిస్తున్న నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి శనివారం తెలిపారు. మేకల రాకేష్ అనే వ్యక్తి విజిలెన్స్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు ఇటీవల ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వాహకుడు ఎలాంటి డాక్టర్ పట్టా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
బోధన్‌టౌన్(బోధన్): రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్పోర్ట్ జిల్లా అఽధికారి ఉమామహేశ్వర్రావ్ అన్నారు. పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో శనివారం ట్రస్మా ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ శాఖలు సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్ డ్రిల్ చేసి చూపించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వివరించారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎంవీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, అగ్నిమాపక శాఖ అధికారి సుభాష్, ఎంఈవో నాగయ్య, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడాలి కిశోర్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరి కొయ్యలను కాల్చొద్దు
రుద్రూర్: వరి కోతల అనంతరం మిగిలిన అవశేషాలను (కొయ్యలను) కాల్చొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల కాలుష్యం పెరగడంతో పాటు విలువైన సూక్ష్మరాశి నశిస్తుందని, కార్బన్ మోనాకై ్సడ్, మీథేన్ వంటి హానికర వాయువులు కొన్ని మిలియన్ టన్నులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుందని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రమ్మ రాథోడ్ అన్నారు. ఈమేరకు రైతులకు ఒక ప్రకటనలో పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు పంట అవశేషాలను కాల్చివేయకుండా సరైన విధానంలో కుళ్ల బెట్టుకోవడం వల్ల పంటకి పోషకాలు అందించడంతోపాటు ప్రకృతిలో విడుదలయ్యే విషవాయువులను తగ్గించవచ్చు. ఇలా ఉపయోగించాలి.. మిషిన్‌తో వరి కోతలు కోయడం వల్ల సుమారుగా ఒకటిన్నర నుంచి రెండు టన్నుల గడ్డి ఎకరానికి పొలంలోనే ఉండిపోతుంది. దాన్ని త్వరగా కుళ్ల పెట్టే విధానాన్ని అవలంభిస్తే అది బాగా కుళ్లుతుంది. కానీ దాన్ని తగలపెట్టేసి తర్వాత దాన్ని దమ్ము చేస్తున్నారు. సుమారుగా ఒక ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు టన్నుల గడ్డిని తగల పెట్టడం వల్ల పంటకి అనేక పోషకాలు అందకుండా పోవటంతో పాటు పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలుగుతుంది. కోతల అనంతరం వరిగడ్డిని పశువుల మేతగా వాడుకోవాలి. లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించాలి. కలియదున్నడంతో లాభాలు.. పొలంలో కొద్దిమేర ఉన్న ఎరువులు (నత్రజని, భాస్వరం , పొటాష్), సూక్ష్మ పోషకాలు భూమిలో కలియ దున్నిన తర్వాత దాదాపు 30 నుంచి 90 రోజుల మధ్య దాంట్లో ఉన్న పోషకాలు అందుతాయి. దీంతో తదుపరి పంటలకు వేయాల్సిన పోషకాలను 25 నుంచి 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఎరువుల మీద సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. పొలంలో తగలపెట్టకుండా మూడు నుంచి ఐదేళ్లు ఏకధాటిగా దమ్ము చేయటం వల్ల సేంద్రియ కార్బన శాతం కూడా గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇలా చేస్తే సాగు ఖర్చు తగ్గడంతో పాటు భూసార పరిరక్షణ జరుగుతుంది. దమ్ము చేసే విధానం.. పొలంలో నీళ్లు పెట్టి దాన్ని కేజ్ వీల్స్ లేదా రోటవేటర్‌తో ఒకసారి దమ్ము చేసిన తర్వాత ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్పేట్తోపాటు 10 నుంచి 15 కిలోల యూరియా కలిపి వేయాలి. మళ్లీ మూడు నాలుగు రోజుల తర్వాత దమ్ము చేసి వారం వ్యవధిలో ఆఖరి దమ్ము చేసినట్లయితే పంటకి మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతాయి. అలాగే గడ్డి వేగంగా కుళ్లిపోతుంది. ఇలా కాకుండా మార్కెట్లో వరిగడ్డి కుళ్లడానికి వివిధ డీకంపోజర్లు అందుబాటులో వచ్చాయి. ఈ డీకంపోజర్ ఉపయోగించడం వల్ల బాగా సులువుగా వరిగడ్డి కుళ్లిపోయి త్వరగా పొలానికి పోషకాలు అందించవచ్చు. డీకంపోజర్ ఉపయోగించే విధానం.. పూసా డీకంపోజర్: ఐదు లీటర్ల నీటిలో 250 గ్రాముల బెల్లాన్ని బాగా మరిగించాలి. ఈ ద్రావణం చల్లార్చిన తర్వాత 50 గ్రాముల శెనగపిండి, రెండు పూస డీకంపోజర్ బిళ్లలు కలిపేసి ఈ ద్రావణాన్ని నాలుగు నుంచి ఐదు రోజులు ని ల్వ ఉంచాలి. దీంతో అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తయారైన 5 లీటర్ల పూసా డీకంపోజర్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలపాలి.ఈ ద్రావణాన్ని పొలంలో సమానంగా పిచికారి చేస్తే గడ్డి బాగా కుళ్లిపోయి అందులో ఉన్న పోషకాలుభూమికి లభ్యమవుతాయి. ఘాజియాబాద్ డీకంపోజర్: 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో రెండు కిలోల పౌడర్ చేసిన బెల్లాన్ని వేసి కర్రతో బాగా కలుపుకోవాలి. అందులో ఒక ప్యాకెట్ ఘాజియాబాద్ డీకంపోజర్ వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో సమానంగా పిచికారి చేస్తే 10 నుంచి 15 రోజుల్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగి గడ్డి బాగా కుళ్ళిపోతుంది. రైతులు పంట అవశేషాలనును కాల్చివేయకుండా సరైన విధానంలో కుళ్ల బెట్టుకోవడం వలన పంటకి పోషకాలు అందించడంతో పాటుగా ప్రకృతిలో విడుదలయ్యే విషవాయువులను తగ్గించవచ్చునని ఆమె వివరించారు. పంటపొలాల్లో నిప్పు పెట్టడంతో దెబ్బతింటున్న భూసారం పంట దిగుబడిపై ప్రభావం పొలాన్ని కలియ దున్నితేనే మేలు రమ్య రాథోడ్, రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త -
అల్ప్రాజోలం పట్టివేత
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో 264 గ్రాముల అల్ప్రాజోలం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ స్వప్న శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బె ల్లాల్ గ్రామంలోని ము స్తాబాద్ వీరగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అల్ప్రాజోలం లభించిందని, వెంటనే వీరగౌడ్ను అదుపులోకి తీసుకొని, సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం బోధన్ ఎకై ్సజ్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావ్ తెలిపారు. ఈ సోదాల్లో సబ్ ఇన్స్పెక్టర్ నరసింహ చారీ, రామ్‌కుమార్, సిబ్బంది రామ్ బచ్చన్, గంగారాం, సాయికుమార్లు ఉన్నారు. ఒకరిపై కేసు నమోదు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే యువకుడిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. సదరు యువకుడు ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు పోరాటం చేద్దాం
నిజామాబాద్‌నాగారం: ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు న్యాయ పోరాటం చేద్దామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలోగల ఓ ఫంక్షన్హాల్లో శనివారం మాలమహానాడు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నయ్య హాజరై మాట్లాడారు. మనమందరం ఐక్యంగా ఉండి కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ రద్దు అయ్యేవరకు న్యాయ పోరాటం చేయాలన్నారు. అందుకు ప్రతి మాల సోదరుడి నైతిక సహాయం అవసరం ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల బోరేగంలో బుద్ధ పూర్ణమి రోజున బుద్ధ భగవాన్ విగ్రహం పెట్టినందుకు దళితులపై అగ్రకులాల వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, ఎల్లయ్య, జిల్లా నూతన అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, టీమ్ కన్వీనర్ అలుక కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థులను గుర్తించి బడుల్లో చేర్పించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చే ర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులార్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అనే అంశంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈసందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరంలో రూ.26 లక్షలు ఎంటైటిల్మెంట్ అందజేశామన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు 21 వైకల్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే అవకాశాలను వారికి చేర్చాల్సిన బాధ్యత స్పెషల్ టీచర్స్‌పై ఉంటుందన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా సాధారణ విద్యార్థులతో సమానంగా వారు విజయాలు సాధిస్తారన్నారు. జిల్లా కో–ఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్‌రావ్, డీఆర్పీలు మురళి, మమత, ప్రకాష్, రాజన్న, శ్రీనివాస్, ఐఈఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
19న సప్లిమెంటరీ పరీక్షలపై సమావేశం
నిజామాబాద్‌అర్బన్: నగరంలో ఖిల్లా జూనియర్ కళాశాలలో ఈనెల 19న ఉదయం 10. 30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరుగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు, సిబ్బంది సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన తెలిపారు. దోస్త్ సహాయ కేంద్రం ఏర్పాటు నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దోస్త్ ద్వార డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. కళాశాలలో 1860 సీట్లు వివిధ కోర్సుల్లో ఉన్నాయన్నారు. నల్లమట్టి రవాణా అడ్డగింత మోపాల్: మండలంలోని మంచిప్ప పెద్ద చెరువు నుంచి తరలిస్తున్న నల్లమట్టి రవాణాను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువులో ఇష్టారీతిన చేపట్టిన తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశముందని వారు ఆరోపించారు. తక్కు వ లోతుతో తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిక లోడ్‌తో మట్టిని తరలించడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని అధికారులకు ఫిర్యాదుచేశారు. నవీపేట మండలంలో సైబర్ మోసం నవీపేట: మండలంలోని పాల్దా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురైనట్లు తెలిసింది. సదరు వ్యక్తికి రెండు రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ ఫోన్ నంబరు వేరే వ్యక్తి ఖాతాకు లింకై ందని, ఇలా జరిగితే జైలు శిక్ష పడుతుందని భయపెట్టించాడు. తమకు డబ్బు పంపితే శిక్ష పడకుండా చూస్తామన్నారు. వెంటనే బాధిత వ్యక్తి ఈనెల 15న కొంత డబ్బును పంపించాడు. మళ్లీ శనివారం ఫోన్ చేసి మరింత డబ్బు పంపాలని బెదిరించడంతో రూ.28వేలు పంపించాడు. ఇలా ఇప్పటి వరకు రూ.లక్షా ఇరవై వేలు ఆన్లైన్లో పంపించాడు. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలుపగా మోసపోయినట్లు తెలుసుకున్నాడు. పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి
మోపాల్: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎంపీడీవో రాములు నాయక్ సూచించారు. మోపాల్ మండలంలోని బాడ్సి, అమ్రాబాద్, కులాస్పూర్, న్యాల్కల్, వడ్డెర కాలనీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా బేస్మెంట్ లెవల్ పనులు పూర్తయిన వెంటనే తొలి విడత బిల్లులు లబ్ధిదారుల ఖా తాల్లో జమ అవుతాయన్నారు. జీపీ కార్యదర్శులు స్వరూప, కృష్ణవేణి, హనుమాన్ రాజ్, మల్లేశ్, నర్సింహులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సిరికొండలో సిరికొండ: మండల కేంద్రంతోపాటు చీమనపల్లి, పందిమడుగు గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. సిరికొండలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేగాం సాయన్న, గ్యామ శోభన్, రమేశ్, దిగంబర్, రాము, చీమన్‌పల్లిలో రాజేందర్ రెడ్డి, జితేందర్ సింగ్ శ్రీనివాస్, నందిలాల్ తదితరులు పాల్గొన్నారు. మునిపల్లిలో.. జక్రాన్‌పల్లి: ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సా యిరెడ్డి పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి, లక్ష్మాపూర్, నల్లగుట్ట తండా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సాయిరెడ్డి పంపిణీ చేశారు. మునిపల్లిలో 30, లక్ష్మాపూర్‌లో ఏడుగురు, నల్లగుట్ట తండాలో ఇద్దరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. మునిపల్లి మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, రొయ్యల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. రాంపూర్‌లో.. డిచ్పల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్ర భుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని డిచ్పల్లి ఎంపీడీవో లింగం నాయక్ అన్నారు. మండలంలోని రాంపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎంపీడీవో ముగ్గు వేసి భూమిపూజ చేశారు. రాంపూర్‌లో వంద మంది ఇళ్లు లేని లబ్ధిదారులను గుర్తించి ప్రతిపాదనలు పంపించగా అందులో 33 మందికి ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పి శ్రీనివాస్, కె గంగాధర్, సీహెచ్ నర్సయ్య, రాంచందర్, దత్తాద్రి, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు. ధర్మారంలో.. నిజామాబాద్‌రూరల్: మండలంలోని ధర్మారం గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు డు కుమార్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి కార్తీక, నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలను తొలగించాలి
నిజామాబాద్ సిటీ: రోడ్డును ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. డివిజన్ 28, 60, 4, 18 డివిజన్లలో పనులను తనిఖీ చేశారు. సర్కిల్–3లో పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త నిల్వ లేకుండా చూడాలని సూచించారు. డి54 కెనాల్లో జరుగుతున్న పూడిక తీత పనులు, మాధవనగర్, కంఠేశ్వర్, లక్ష్మిప్రియనగర్, పాంగ్ర, బోర్గాం, అర్సపల్లి, ఖిల్లా చౌరస్తా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. నగర పరిధిలో వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వకాకుండా మురుగు కాలువలను శుభ్రపరచాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఎంసీ జయకుమార్, సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు మహిపాల్, షాదుల్లా, సునీల్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ పారిశుధ్య పనుల పరిశీలన -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
● సీపీ సాయిచైతన్య ఖలీల్‌వాడి: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని సీపీ సాయిచైతన్య అన్నారు. శుక్రవారం నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించారు. సీసీ కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, సౌత్ సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు వెంకట్ రావు, శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. -
విద్యుత్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి
సుభాష్‌నగర్ : విద్యుత్ పనులు చేసే సమయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ సూచించారు. నగరంలోని వర్నిరోడ్‌లో ఉన్న పవర్‌హౌస్ సమావేశపు హాల్లో ఏఎల్ఎం మహేందర్ అకాల మరణానికి సంతాపం వ్యక్తంచేస్తూ శుక్రవారం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విద్యుత్ పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈలు ఎం శ్రీనివాస్, రమేశ్, వెంకటరమణ, ఏవో శ్రీనివాస్, జేఏసీ నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్, కాశీనాథ్, సురేశ్ కుమార్, శ్రీధర్, రాజేందర్, నగేశ్ కుమార్, చంద్రశేఖర్, చెన్నయ్య, పవర్‌హౌస్ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ -
సబ్సిడీ జీలుగ విత్తనాల పంపిణీ
డిచ్పల్లి: మండలంలోని డిచ్పల్లి, బర్ధిపూర్ సొసైటీల ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సొసైటీల చైర్మన్లు రాంచందర్, రామకృష్ణ మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన తర్వాతే రైతులు జీలుగ విత్తనాలను నాటుకోవాలని సూచించారు. జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్సులతో సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు సతీశ్, అశ్రిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గ్యానాజీ గంగారెడ్డి, దేవకరుణ, నాయకులు పి శ్రీనివాస్, గంగాధర్, నర్సయ్య, న్యాస రాజేశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు. నేడు సిరికొండలో.. సిరికొండ: సిరికొండ తూంపల్లి సొసైటీలో గడ్కోల్ సెల్ పాయింట్లో జీలుగ విత్తనాలను శనివారం పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య శుక్రవారం తెలిపారు. జీలుగ విత్తనాలు కావాల్సిన వారు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నిజామాబాద్ రూరల్: ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారి స్నేహ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ డెంగీ, మలేరియా నివారణ దినోత్సవాలను పురస్కరించుకొని తిర్మన్‌పల్లిలో ఉపాధి హామీ కూలీలకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న నీటి నిల్వలను పారబోసి, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు అఖిల్ అలీ, మధుకర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. -
డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీ
ఇందల్వాయి: జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో వైద్య సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తు కారాం రాథోడ్ మాట్లాడుతూ..ప్రజలు డెంగీ వ్యాధి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్‌ఈవో శంకర్, ఆయుష్ వైద్య అధికారి భువన తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లిలో.. ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ అరుణ లత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది పద్మ, మురళి, సురేశ్, సంతోష్, వాజిద్, నరేందర్, లత, పద్మ, పూజా, మల్లేశ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సంకష్టహర చతుర్థి పూజలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని గణపతి ఆలయాల్లో సంకష్టహర చతుర్థిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సార్వజనిక్ గణేష్ మండలి, మహాగణపతి ఆలయం, గాయత్రినగర్‌లోని సిద్ధివినాయక స్వామి దేవాలయం, బోర్గాం శివారులోని శ్రీలక్ష్మీ గణపతి మహా ఆలయంలో, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న శుభం కరోతి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా పంచామృతాభిషేకం, గరికపూజ, సింధూరం సమర్పణ చేశారు. అలాగే బోర్గాం శివారులో నెలకొన్న లక్ష్మీగణపతి మహా ఆలయంలో మూల విగ్రహానికి నవవిధ వస్తువులతో ప్రత్యేక ఉపనిషత్తులతో అభి షేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అరుణ్ కుమార్ శర్మ, చిలుముల భూషణ్‌చారి, చిటిమెల్ల హరిప్రసాద్ గుప్తా, అర్చకులు సంజయ్‌శర్మ, అమందు శ్రీనివాస్, కొరడి భూపాల్, బుస్సాపూర్ శంకర్, వెంకట్రాములు, మారుతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ వీడి.. ఆటలు ఆడాలి
డిచ్పల్లి: యువత మొబైల్ ఫోన్లకు అలవాటు పడి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారని, ఇకనైనా వాటిని వీటి ఆటలపై దృష్టి సారించాలని డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ సూచించారు. మండలంలోని ఘన్‌పూర్‌లో గత నెల 20న ప్రారంభమైన ఘన్పూర్ ప్రీమియం లీగ్(జీపీఎల్) టీ–20 క్రికెట్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన టోర్నీ విజేత వాసరి సాయినాథ్ జట్టుకు కప్పుతో పాటు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసగా ఉండాలని సూచించారు. ఘన్పూర్ యూత్ సభ్యులు మంచి ఆలోచనతో వేసవి సెలవుల్లో యువత మత్తుకు, మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడకుండా గత 14 ఏళ్లుగా అందరిని ఏకం చేసి టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన ఘన్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వాతిని ఎస్సై ఘనంగా సత్కిరంచారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు కర్ని గంగాధర్, రామకృష్ణ, హరీశ్, నరేశ్, శ్రీకాంత్, గంగామోహన్, పృథ్వీ, రమణ, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండో క్రీడాకారులకు బ్లాక్‌బెల్టుల ప్రదానం
నిజామాబాద్‌నాగారం: తైక్వాండోలో బ్లాక్‌బెల్టులు సాధించిన క్రీడాకారులకు జిల్లా జడ్జి భరతలక్ష్మి చేతుల మీదుగా బాక్లబెల్టులను శుక్రవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జడ్జి క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో ప్రధాన కార్యదర్శి, కోచ్ మనోజ్ కుమార్, గంగాధర్, గోపికష్ణ, రిత్విక, భవ్య శ్రీ, ప్రవస్తిక, తనిష్క్, కోచ్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి మోపాల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని సిర్పూర్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న ప్రదేశానికి వెళ్లి తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, తదితర అంశాలను వివరించారు. అదేవిధంగా ముదక్పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, పుష్ప, ప్రేమ్‌లాల్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ నాయకులు డీఈవో కార్యాలయంలో ఏడీ నాగజ్యోతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రఘురాం, అంజలి, నవీన్ కృష్ణ, రమేశ్, కార్తిక్, రంజిత్ పాల్గొన్నారు. బస్టాండ్‌ను తనిఖీ చేసిన డీఎం సిరికొండ: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను నిజామాబాద్–1 డిపో మేనేజర్ బీఎస్ ఆనంద్ శుక్రవారం తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులకు, విద్యార్థులకు పెన్నులను బహూకరించారు. కంట్రోలర్ లింగం ఉన్నారు. ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణితం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు 4వ రోజు శిక్షణ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు షీ టీమ్ బృందం, హెల్త్ ఎడ్యుకేటర్లు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేటర్ స్వామి సులోచన బాలికల్లో కౌమార దశ మార్పులు, పౌష్టికాహారం, లైంగిక వేధింపులు, జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు రాష్ట్ర రిసోర్స్ పర్సన్ సుభాష్ పలు అంశాలపై వివరించారు. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు సూచించారు. అలాగే ట్రైనింగ్ తరగతులు పరిశీలించారు. కోర్సు సెంటర్ ఇన్చార్జి, పాఠశాల హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాధితుడికి ఎల్వోసీ అందజేత ఇందల్వాయి:మండలంలోని గన్నారం గ్రామా నికి చెందిన మేదరి భూమేశ్వర్ వెన్నుపూస సమస్యతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వారి కుటుంబ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. చికిత్స కోసం డబ్బులు లేనందున వారికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అవసరమయ్యే సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులు ఇప్పించడానికి రూ.4 లక్షల ఎల్వోసీ కాపీని ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. -
సిరికొండ పీహెచ్సీలో విచారణ
నిజామాబాద్ నాగారం/ సిరికొండ: ‘విధులకు డు మ్మా.. రిజిస్టర్లో హాజరు’ అనే శీర్షికన సాక్షిలో గు రువారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగుల అక్రమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్)..విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించింది. దీంతో గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకా రాం రాథోడ్‌తో విచారణ చేయించి, డీహెచ్‌కు నివే దిక అందజేశారు. కాగా, ఆ నివేదికతో సంతృప్తి చెందని డీహెచ్ ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దీంతో వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ శుక్రవారం సిరికొండ పీహెచ్‌సీకి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. పీహెచ్సీలో విధులు నిర్వ హిస్తున్న ఉద్యోగుల స్టేట్మెంట్ తీసుకోవడంతోపాటు పీహెచ్‌సీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. మంచి జీతాలు ఉన్నా పేదలకు మెరుగైన సేవలు అందించకుండా డుమ్మా లు కొడుతూ దొంగతనంగా రిజిస్టర్లో సంతకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పర్యవేక్షణించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని, పీహెచ్సీలో ఇలాంటి ఘటనలు జరగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగి విధులకు రాకున్నా సంతకాలు చేయించి, జీతాలు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలా పీహెచ్సీలో జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను ఆమె డీహెచ్‌కు అందజేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్, ఇతర అధికారులు ఉన్నారు. వివరాలు సేకరించిన వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ -
సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా సాగుతోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమి షనర్ డీఎస్ చౌహాన్‌లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం కలెక్టర్లు, అదనపు కలె క్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా లో ధాన్యం కొనుగోళ్ల స్థితిగతులపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, సుమారు 12 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వెల్ల డించారు. ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని, 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35 వేల నుంచి 40 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. 460 కేంద్రాలలో ధాన్యం సేకర ణ నూరు శాతం పూర్తయ్యిందని, ప్రస్తుతం 260 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నా రు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ రూ. 1,8 39 కోట్లు కాగా, రూ. 1,548 కోట్ల బిల్లు మొత్తాల ను రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని తెలిపారు. రికార్డు స్థాయిలో వరి సాగు : మంత్రి ఉత్తమ్ ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగైందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సన్నరకం వరికి బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటికే 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను సేకరించినట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నందున కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలి యజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. సన్నబియ్యం పంపిణీలో అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలన్నారు. కొత్త రేషన్‌కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ మంజూరు చేయాలన్నారు. బోగస్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగూబాయి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
నిజామాబాద్‌నాగారం: క్రీడారంగంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని, అందుకు రాష్ట్ర ప్రభు త్వం సహకారం అందిస్తుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మె ల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తు న్న తెలంగాణ ఉమెన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా, వైద్యరంగాలతోపాటు క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభు త్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. క్రీడలకు కేరాఫ్‌గా నిజామాబాద్ జిల్లా నిలిచిందని, జిల్లా నుంచి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థా యి క్రీడల్లో రాణించడం శుభ సూచకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుడని, అందుకే తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఇందూరులో రూ. 4 కోట్లతో ఇండోర్ స్టేడియం, మరో రూ. 4 కోట్లతో అవుట్డోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌ను తిలకించారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ కవితారెడ్డి, చైర్మన్ రాజేందర్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఫుట్‌బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో రెండు మైదానాల నిర్మాణ పనులు ప్రారంభిస్తాం ఫుట్‌బాల్ టోర్నీ అభినందనీయం పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ -
జింకలు కుక్కల పాలు
● గోదావరి తీరంలో వేటాడి చంపుతున్న వీధి కుక్కలు ● మిన్నకుండిపోతున్న సంబంధిత అధికారులు ● పూర్తిగా తగ్గిపోయిన జింకల సంఖ్య డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం అక్కడ సంచరించే వన్య ప్రాణుల రక్షణను గాలికొదిలేసింది. స్వేచ్ఛగా విహరించే జింకలు, పక్షుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. వీధి కుక్కలు వేటాడి పీక్కు తింటున్నాయి. కళ్లముందే వాటి ప్రాణాలు పోతుంటే శివారు గ్రామ పంచాయతీలు, సంబంధిత శాఖ ల అధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఎకో టూరిజం ఏర్పాటయ్యే నాటికి జింకలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. వందల నుంచి పదికి.. ఒకప్పుడు వందల్లో కనిపించే జింకలు వీధి కుక్కల కారణంగా ఇప్పుడు పదికి మించి కనిపించడం లేదు. వన్యప్రాణులను చూసేందుకు వెళ్లిన వారికి కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో ఎస్సారెస్పీలో బ్యాక్ వాటర్ తగ్గిపోయి పచ్చిక బయళ్లు ఏర్పడుతాయి. చిన్నయానం, గాదేపల్లి, జీజీ నడ్కుడ, గంగాసముందర్, అన్నారం, సిర్పూర్, నికాల్పూర్ గ్రామాల శివార్లలో కిలోమీటర్ల మేర గడ్డితో పచ్చదనం కనిపిస్తుంది. పచ్చికను మేసేందుకు జింకలు బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వస్తాయి. ఐదారేళ్ల క్రితం ఎటు చూసినా జింకల మందలు కనిపించేవి. కుక్కల బెడద, సందర్శకుల తాకిడి మొదలైనప్పటి నుంచి జింకలకు ప్రాణ భయం మొదలైంది. గ్రామాల్లో ఉండే వీధి కుక్కలు జింకల రుచి మరగడంతో అవి బ్యాక్ వాటర్లోనే తిష్టవేశాయి. జింకల పరుగును అందుకోలేని శునకాలు తెలివిగా నలుదిక్కులా మాటు వేసి వేటాడుతున్నాయి. వాటి చేతికి చిక్కిన జింకలు విలవిల్లాడుతూ ప్రాణాలొదులున్నాయి. వర్షాకాలంలో, వరద నీరు వచ్చిన సమయంలో కూడా జింకలు ఒడ్డుకు, పొలాల్లోకి రావడంతో కుక్కలకు సులభంగా చిక్కుతున్నాయి. శివారు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు గాయపడిన జింకలను ఊరిలోకి తీసుకొచ్చి అటవీ, పశువైద్యాధికారులతో చికిత్సలు చేయిస్తున్నారు. చనిపోయిన వాటికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుక్కలను తరుముతున్నా మళ్లీ వస్తున్నాయని, గ్రామాల్లో దూడలను సైతం దాడి చేసి చంపేస్తున్నాయని స్థానిక ప్రజలు, రైతులు, మత్స్యకారులు వాపోతున్నారు. వాటిని పట్టుకొని ఇక్కడి నుంచి తరలించాలని అధికారులను కోరుతున్నారు. కాగా, బ్యాక్‌వాటర్ ప్రాంతంలో అటవీ శాఖ నుంచి బీట్ ఆఫీసర్ లేక పర్యవేక్షణ కష్టంగా మారింది. బీట్ ఆఫీసర్‌ను నియమిస్తామని ఉన్నతాధికారులు చాలాసార్లు మాట ఇచ్చినప్పటికీ ఎందుకో అది అమలు కావడం లేదు. మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం వీధి కుక్కలు జింకలను వేటాడుతున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామస్తులు, మత్స్యకారులు సాయంతో గాయపడిన జింకలకు చికిత్స అందిస్తున్నాం. కుక్కల సమస్యను పూర్తిగా నివారించడానికి ఉన్నతాధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్తాం. చర్యలు చేపట్టాలని కోరుతాం. – సుధాకర్, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ -
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
నిజామాబాద్అధ్వానంగా ఆటోనగర్నగర శివారులోని ఇండస్ట్రియల్ కారిడార్ ఆటోనగర్‌ను పట్టించుకునే వారు లేక అధ్వానంగా తయారైంది.శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025– IIలో uఅంకాపూర్వాసికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాదేవి యూ త్ అసోసియేషన్ అధ్యక్షుడు కే వినోద్ రెడ్డికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్‌లో చోటు లభించింది. అంకాపూర్ గ్రామంలో గురడి రెడ్డి కాపు సంఘంలో వినోద్ రెడ్డి శుక్రవారం క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ కారు రేసు, బాక్సింగ్, హాకీ క్రీడలకు సంబంధించిన 1,400 ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా కోర్డినేటర్లు బింగి నరేందర్ గౌడ్, అనిల్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. వినోద్ రెడ్డి సేకరించిన ఫొ టోలను రికార్డుగా గుర్తించి బంగారు పతకంతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ కోర్డినేటర్ రాజు, గురడి రెడ్డి కాపు సంఘం అధ్యక్షుడు సల్ల అనంతు, ఉపాధ్యక్షుడు నారాయణ, సాగర్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల కేంద్రం పరిశీలన నిజామాబాద్ అర్బన్ : నగరంలోని పాఠ్య పుస్తకాల కేంద్రాన్ని డీఈవో అశోక్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాకు ఇంకా ఎన్ని పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది అనే విషయాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పాఠ్య పుస్తకాలను వెంటవెంటనే మండల కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సకాలంలోనే పాఠ్య పుస్తకాలను అందిస్తామని పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగానికి అనుమతి తప్పనిసరి ● సీపీ సాయిచైతన్య ఖలీల్‌వాడి: డ్రోన్ల వినియోగానికి తప్పనిసరిగా అనుమతి తీ సుకోవాలని సీపీ సా యిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని సూచించారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయొద్దని, రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రివేళ్లలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలపై పూర్తిగా నిషేధం ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో ఊరేగింపులు, బహిరంగ సభలపై నిషేధం ఉందని, సభలు, సమావేశాలకు పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఈనెల 31 వరకు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు. ప్రజలు గల్ఫ్ ఏజెంట్లను నమ్మవద్దని, వారికి ఇండ్లు, ఆఫీసులకు అద్దెకు ఇస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కల్తీకల్లు కోసం ఉపయోగించే రసాయనాలు, కల్లు తయారీదారులను పట్టుకునే విషయంలో అధికార యంత్రాంగం విచిత్రంగా వ్యవహరిస్తోంది. భారీ స్థాయిలో రసాయనాలను సరఫరా చేస్తున్న వా రిని, తక్కువ ధరకు లభించే డ్రగ్స్ ను కల్లు తయారీకి ఉపయోగించేలా ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలేసి కల్లు సొసైటీ సభ్యులుగా ఉండి చిన్నపాటి డిపోలను నిర్వహిస్తున్న తమపైనే ప్రతాపం చూపిస్తున్నారని గౌడ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు చేస్తూ భారీగా రసాయనాలను రవాణా చేస్తున్న వారిని వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా తమను ఇబ్బందులపాలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేసుల లెక్కల కోసం ఇలా చేయడం సరికాదంటున్నారు. కల్లుపై ప్రయోగాలు కృత్రిమ కల్లును గతంలో క్లోరోహైడ్రేట్ రసాయనంతో తయారు చేసేవారు. ప్రభుత్వం నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కల్లు తయారీకి అల్ప్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఈ రసాయనాలు సాధారణంగానే అత్యంత ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, కిడ్నీ, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఇక మోతాదు పెంచితే తాగినవాళ్లు కుప్పకూలాల్సిందే. కాగా ఈ రసాయనాల కొ నుగోలు ఖర్చును మరింతగా తగ్గించుకొని, అధిక లాభాలను ఆర్జించేందుకు కొందరు బడా ముదుర్లు కల్లుప్రియులపై ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి బడా ముదుర్లను వదలి తమపై అధికార యంత్రాంగం ప్రతాపం చూపడంపై కల్లు సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్లో అల్ప్రాజోలం రసాయనాన్ని సరఫరా చేస్తున్న వారి ని పట్టుకోవడం మాని కేవలం రెండు నుంచి మూ డు కిలోలు తెచ్చుకుంటున్న తమపై కేసులు నమో దు చేసి ఉన్నతాధికారుల వద్ద జిల్లా అధికారులు మెప్పు పొందుతున్నారని సొసైటీల సభ్యులు చెబుతున్నారు. అల్ప్రాజోలం విషయానికొస్తే ఉమ్మడి జిల్లాలో 2023లో 6.4 కిలోలు, 2024లో 9.6 కిలోలు, 2025లో ఇప్పటి వరకు 0.25 కిలోలు మా త్రమే పట్టుకోవడం గమనార్హం. ఇదంతా గమనిస్తే బడా ముదుర్లను మాత్రం వదిలేస్తున్నట్లు అర్థమవుతోందని సొసైటీల సభ్యులు అంటున్నారు. ● ఇప్పటి వరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ● మరో 40 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ● మంత్రుల వీసీలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడిన్యూస్రీల్రసాయనాల బదులు..కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో గతనెల 7వ తేదీన కల్లుడిపోలో కల్లు తాగిన 69 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్ జీజీహెచ్‌లో 72 గంటలపాటు వైద్య చికిత్సలు అందించారు. చికిత్స సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా(మరమనిషి మాదిరిగా), రిజిడ్(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు తదితర లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను వాడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ యాంటీ సైకోటిక్ గ్రూపులోని డ్రగ్స్‌ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ పేషెంట్‌ను కామ్‌డౌన్ చేస్తుంది. అయితే యాంటీ సైకోటిక్ గ్రూపులో క్లోర్ప్రామజిన్ లాంటి మరో ఐదురకాల డ్రగ్స్ ఉంటాయి. ఇలా రసాయనాల బదులు కొత్త రకం డ్రగ్స్‌తో కల్లు ప్రియులపై ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలి అధికారులు తమపై ప్రతాపం చూపుతున్నారని సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కల్లు తయారీలో కల్లు సొసైటీలపైనే అధికారుల ప్రతాపం కొత్త రకం డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న మాఫియాకు మినహాయింపు ‘యాంటీ సైకోటిక్ డ్రగ్స్’ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న ముదుర్లు తక్కువ ఖర్చుతో లభించే రసాయనాల వైపు కొందరి చూపు అధికారుల తీరుపై విమర్శలు -
విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలనే వాడండి
వేల్పూర్: పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేటు సంస్థ విత్తనాలను వాడకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలనే వాడాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్ రెడ్డి రైతులకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, మోతె గ్రామాలలో శుక్రవారం ఆ యన 50 శాతం రాయితీపై రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలను వాడి యూరి యా వాడకాన్ని తగ్గించాలని కోరారు. విత్తనాభివృద్ధి సంస్థ అందించే నాణ్యమైన విత్తనాలు వాడి అధి క దిగుబడి సాధించాలని పేర్కొన్నారు. జిల్లాకు ప దివేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించగా, మండలాలకు ఇప్పటికే 7,500 క్వింటాళ్లు సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వే ల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సా రెడ్డి, పచ్చలనడ్కుడ, మోతె, సొసైటీల చైర్మన్లు లింబారెడ్డి, రాజేశ్వర్, ఏడీఏలు సాయికృష్ణ, విజయలక్ష్మి, ఏవో శృతి, కాంగ్రెస్ నాయకులు భగవాన్‌దాస్, సుదర్శన్, రాజేశ్వర్, ఇంద్రాగౌడ్, నర్సారెడ్డి, గంగారెడ్డి, గుడాల మోహన్, టక్కర్ గంగాధర్, జేమ్స్ గంగారెడ్డి, చరణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి -
సిద్దాపూర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు నాణ్యతాలోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలి సి సమీక్షించారు. వర్ని మండల పరిధిలో రూ.258 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్, జాకో ర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై సమావేశంలో చర్చించారు. రిజర్వాయర్ పనులపై కాంట్రాక్టర్, అధికారులు ప్రతి మంగళవారం సమావేశం ఏర్పా టు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలి పారు. పనుల్లో నాణ్యత పాటించాలని, జాప్యం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, కామారెడ్డి ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
అధ్వానంగా ఆటో నగర్
నిజామాబాద్ సిటీ: నగర శివారులోని ఇండస్ట్రియల్ కారిడార్ ‘ఆటో నగర్’ను పట్టించుకునే వారు కరువయ్యారు. స్థానిక సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆటో నగర్ అధ్వానంగా మారింది. కనీస వసతులు లేక, కంకర రోడ్లు, పారిశుధ్య లోపంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా సమస్యలతో సావాసం.. ఇండస్ట్రియల్ పనుల కోసం ప్రత్యేకంగా 1982లో అప్పటి ప్రభుత్వం నగర శివారులో 26 ఎకరాల స్థలం కేటాయించింది. దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 200 వరకు పలు రకాల ఇండస్ట్రియల్ కార్యాలయాలు, వర్క్‌షాపులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 2వేల మంది ఆధారపడి పనులను చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద కారిడార్‌లో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆటో నగర్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 40 ఏళ్ల క్రితం చేసిన పనులే తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి లేదు. సీసీ డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు మొత్తం రోడ్లమీదనే పారుతోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. పాత రోడ్లు పాడైపోయి కంకర తేలి అధ్వానంగా మారాయి. చెత్త సేకరణ జరగడం లేదు. పాడైపోయిన షెడ్‌కు వచ్చిన కార్లు కూడా రోడ్డుమీదనే పార్కు చేస్తున్నారు. దీంతో రోడ్లు ఇరుకుగా మారిపోయాయి. సమస్యలపై వినతులు.. ఆటోనగర్ ఏరియాలో పారిశుధ్య పనులు చేపట్టాలని దుకాణదారులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చెత్త సేకరణ చేపడతామని తెలిపారు. వర్షపునీరు బయటకు వెళ్లేలా, సీసీ డ్రెయినేజీల నిర్మాణం కోసం అంచనాలు వేయాలని ఇంజినీరింగ్ డీఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ షాదుల్లాను ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆటోనగర్ వెళ్లి దుకాణదారులతో మాట్లాడారు. అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని దుకాణదారులు కోరారు. ఆయన స్పందించి ఎస్టిమేషన్ వేయించాలని అధికారులకు సూచించారు. దీంతో త్వరలో సమస్యలు తీరనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు లేక వాహనదారుల ఇబ్బందులు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం పట్టించుకోని అధికారులుఎస్టిమేషన్ వేయించాం.. ఆటోనగర్ ఇండ్రస్ట్రియల్ ఏరియా మున్సిపల్ పరిధిలోకి రాదు. దానికి స్పెషల్ స్టేటస్ ఉంది. అయినా శానిటేషన్ పనులు చేయిస్తున్నాం. సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం, వర్షపునీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్ల కోసం అధికారులను పంపి ఎస్టిమేషన్స్ వేయించాం. – దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్టు
బోధన్‌రూరల్: సాలూర మండల కేంద్రంలో ప్రత్యేక నిఘాతో దాడి నిర్వహించి అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్‌ను పట్టుకుని రూ.25లక్షల విలువల గల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సాలూరలో అల్ప్రాజోలం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మహారాష్ట్రకు చెందిన అమర్‌సింగ్ దేశ్‌ముఖ్ (ఏ1), బాబురావు కడేరీ (ఏ2), షబ్బీర్ అలీ పాషామీయా చౌదరి (ఏ3), పరమేశ్వర్ బర్ధాడే (ఏ4), నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లెపూల లక్ష్మణ్‌గౌడ్ (ఏ5) గురువారం అర్ధరాత్రి కారులో రూ.25లక్షల విలువల 2.5కిలోల అల్ప్రాజోలంను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, 8ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విశ్వనాథ్ శిపంకర్ (ఏ6) పరారైనట్లు తెలిపారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రూ.25లక్షల విలువగల 2.5 కిలోల సరుకు పట్టివేత వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య -
నవీపేటలో ఆటో చోరీ
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం ఆటో చోరీకి గురైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నవీపేటకు చెందిన మంజుసింగ్ తన ఆటోను సంత సమీపంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చి చూసేసరికి ఆటో లేకపోవడంతో, చోరీకి గురైందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్‌వాడి: నగరంలోని బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతుడు నీలం రంగు ఫుల్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. వయస్సు 55నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. గత 3 రోజుల నుంచి ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైన ఉంటే నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా, ఫోన్ నెంబర్ 8712659840, 8712659719కు సంప్రదించాలని అన్నారు. ఒకరి ఆత్మహత్య నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. దుర్కి గ్రామంలోని మామిడి బాల్‌రాజు(47)కు గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మతి స్థిమితం బాగాలేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందించినా నయంకాలేదు. ఈక్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఇంటి వెనక గల పాకలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతికామారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లాకేంద్రంలోని గుమాస్తా కాలనీకి చెందిన గుమ్మడి రాజేందర్ (69) డెయిరీఫామ్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డెయిరీఫామ్‌లో పనులు చూసుకుని ఇంటికి వచ్చేందుకు కామారెడ్డి–రామారెడ్డి ప్రధాన రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మీపార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
ఎండు గంజాయి పట్టివేత
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఎండు గంజాయిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్, శివాజీ చౌక్ సమీపంలో దాడులు చేసి పురుషోత్తం, ఖురేషి చోటుమియాలను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు నిర్వహించగా ఇద్దరి దగ్గర 200 గ్రాముల చొప్పున ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్, ఎస్సై సింధు, సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్‌కుమార్, నర్సయ్య చారి, సాగర్రావ్, సలీమ్, భూమేశ్వర్, గోపి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆవులను ఎత్తుకెళ్లేందుకు యత్నం ఖలీల్‌వాడి: నగరంలోని ఆకుల పాపయ్య రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దుండగులు ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఓ ఆవుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారులో తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేశారు. వెంటనే దుండగులు ఆవును వదిలి కారులో పరారైనట్లు తెలిపారు. ఆవుల యాజమాని అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేబుల్ వైర్ల చోరీ నిందితుడి పట్టివేత లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లోని బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలిస్తున్న నిందితుడిని స్థానిక రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మండల కేంద్రంలోని మత్తడికిందిపల్లెకు చెందిన ధారావత్ రాములు అనే వ్యక్తి గత కొంతకాలంగా బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బోరు బావి వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తుండగా రైతులు పట్టుకొని మండల కేంద్రానికి తీసుకొచ్చి కేబుల్ మెడలో వేసి ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్సై వెంకట్రావును వివరణ కోరగా ధారావత్ రాములును రైతులు అప్పగించినట్లు తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మేకలపై చిరుత దాడి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాలోత్ సంగ్యా నాయక్ తండాలో ఆరు మేకలపై చిరుత దాడి చేసి హతమార్చినట్లు తండావాసులు శుక్రవారం తెలిపారు. తండాకు చెందిన నేనావత్ శివరాం, నేనావత్ లక్ష్మణ్‌కు చెందిన మేకలు తండా సమీపంలోని గుట్ట ప్రాంతంలో మేతకు వెళ్లాయి. అదే సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన చిరుత ఆరు మేకలపై దాడి చేయగా, మృతిచెందినట్లు బాధితులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి బీట్ అధికారి సాయికిరణ్ చేరుకొని వివరాలు సేకరించారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. వివాహిత అదృశ్యం రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లి పారంకు చెందిన వివాహిత (20) అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 11న ఎవరికి చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లి, ఇప్పటికీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వివాహిత భర్త హైమద్‌ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
ఎల్లారెడ్డి: వివాహేతర సంబంధానికి సహజీవనం చేస్తున్న భాగస్వామి అడ్డు ఉన్నాడని ప్రియుడితో కలిసి మహిళ హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను శుక్రవారం సీఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పౌలవ్వ భర్త కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆమె ఒంటరిగా జీవిస్తుండగా ఎల్లారెడ్డిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (47)తో పరిచయం ఏర్పడింది. దీంతో అహ్మద్ తన భార్య, పిల్లలను వదిలేసి పౌలవ్వతో సహజీవనం చేశాడు. కొద్ది నెలల క్రితం పౌలవ్వకు సాతెల్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలుతో పరిచయం ఏర్పడింది. సాయిలుతో చనువుగా ఉంటున్న పౌలవ్వకు షేక్ అహ్మద్ అడ్డుగా వస్తున్నాడని భావించి అతడి అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో జనవరి 24న అహ్మద్‌ను ప్రియుడు సాయిలుతో కలిసి ఎల్లారెడ్డి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అనంతరం అతిగా మద్యం తాగిన షేక్ అహ్మద్‌ను పౌలవ్వ, ప్రియుడు సాయిలు కలిసి గొంతు నులిమి, మర్మాంగాలపై దాడి చేయడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదిలా ఉండగా అహ్మద్ కనబడటం లేదని అదే నెల 28న పౌలవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా పౌలవ్వ కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న మృతుడి కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై మహేష్, పీసీలు ఇద్రిస్, సిద్దు, అనిల్, హోంగార్డు ప్రసాద్‌లను ఎస్పీ అభినందించారని, వీరికి రివార్డు ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, వెండి కడియం, టీవీఎస్ ఎక్సెల్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ప్రియుడితో కలసి సహజీవన భాగస్వామిని హతమార్చిన మహిళ లింగారెడ్డిపేట వ్యక్తి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ -
సనాతన ధర్మాన్ని పాటించాలి
నందిపేట్(ఆర్మూర్): హిందువులంతా సనాతన ధర్మాన్ని పాటించాలని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి అన్నారు. నందిపేటలోని రామనగర్‌లో నూతనంగా నిర్మించిన రామాలయంలో శుక్రవారం కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో హంపీ పీఠాధిపతి కరకములచే యంత్ర, మూర్తి, శిఖర, ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద పండితులతో ప్రాణ ప్రతిష్ఠ, శాంతి ప్రతిష్ఠ హోమములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాంతి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. హంపీ పీఠాధిపతి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో శ్రేష్టమైనవని, ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
పెన్షనర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తా
నిజామాబాద్‌నాగారం: పెన్షనర్లకు న్యాయపరమైన సమస్యలుంటే పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా న్యాయసేవ సమితి కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌భాస్కర్ తెలిపారు. నగరంలోని న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయనను తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్‌పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై చర్చించారు. పెన్షనర్స్–సీనియర్ సిటిజెన్స్ భవనాన్ని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌గా గుర్తించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు తెలిపారు. కుటుంబ తగాదాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు, వృద్ధులు వారి సమస్యలు, భార్యాభర్తల వివాదాలు, సివిల్ తగాదాలు ఇవన్నీ కూడా ఈ మీడియేషన్ కేంద్రంలో చర్చించి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని, ఇది జిల్లా న్యాయసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, జీవన్ రావు తదితరులు ఉన్నారు. తహసీల్దార్ల బదిలీ నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో పలువురు తహసీల్దార్లను బదిలీ చేయగా, ప్రస్తుతం వారిని సొంత జిల్లాలకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చే తహసీల్దార్లు శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, ముజీబుద్దీన్, ప్రసాద్, వీర్‌సింగ్, ఇతర జిల్లాలకు వెళ్లే వారు మాలతి, మల్లయ్య, హిమబిందు, జానకి, పెద్దరాజు, నాగార్జున, ప్రభాకర్, గజానన్, రహిమోద్దీన్, సునీత, ఆంజనేయులు ఉన్నారు. ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు గానూ 6709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మంది విద్యార్థులకు గానూ 724 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. -
డెంగీ నివారణకు కృషి చేయాలి
నిజామాబాద్‌నాగారం: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే వ్యాధి నియంత్రణ జరుగుతుందని జిల్లా మలేరియా అధికారి, నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ అన్నారు. నగరంలోని సీతారాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.. నీటి నిల్వలను తొలగించాలి.. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుకారం మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం డ్రైడేని విధిగా పాటించాలన్నారు. దోమల నివారణ, కీటక జనిత వ్యాధుల నివారణ కోసం వైద్యశాఖనే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే నివారించవచ్చు అన్నారు. వైద్యసిబ్బంది నవ్య, సహిస్తాహిర్దోష్, సలీం, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, నటరాజ్, రవిచందర్, సుశీల, శ్యామల, మధుసూదన్, స్వామి, శశిరేఖ, సుశీల, కవిత, సంగీత పాల్గొన్నారు. -
కేసులను పెండింగ్ లో పెట్టొద్దు..
● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్లకు వచ్చే కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులోనూ నాణ్యవంతమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. గంజాయి, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలనీ, అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఇంటర్ విద్యాధికారి రవికుమార్‌తో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 27 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా బస్సుల సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారికి సూచించారు. సకాలంలో ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరూ సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామన్నారు. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు, కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తామన్నారు. సమావేశంలో డీఈవో, ట్రాన్స్‌కో, పోస్టల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, అదనపు పోలీసు కమిషనర్ బస్వారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ -
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
నిజామాబాద్ అర్బన్ : శిక్షణా తరగతులను చక్కగా ఆకళింపు చేసుకొని, నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అంశంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. బోధనా సామర్థ్యాలను మెరుగుపర్చే దిశగా ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాలపై స్టేట్ రీసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈవో అశోక్, ఇతర అధికారులున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ఆకస్మిక పరిశీలన -
సీడ్ మక్కవైపే మొగ్గు
బాల్కొండ: పసుపు పంటలో అంతర్పంటగా సాగు చేసే మక్క పంటలో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు. పసుపు పంటలో అంతర్ పంటగా రైతులు మక్క పంటను సాగు చేస్తారు. సీడ్ మక్క పంట ఎక్కువ ఎత్తుగా పెరగదు. అంతే కాకుండ పసుపు పంటకు గాలి, సూర్యరశ్మీ అందడంతో ఎలాంటి అడ్డంకి ఉండదు. దీంతో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు. రైతులు సాగు చేసే సీడ్ పంటనే మళ్లీ తరువాత పంటకు వ్యాపారులు విత్తనాలుగా మార్చి అందిస్తారు. దీంతో రైతులు సీడ్ మక్కల వైపే మొగ్గు చూపుతున్నారు. సీడ్ కంపెనీ వ్యాపారుల ఒప్పందాలు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే సీడ్ వ్యాపారులు పల్లెల్లో రైతులతో మక్క పంట ఒప్పందాలను చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో మక్క పంటకు చెందిన ఓ సీడ్ కంపెనీ వ్యాపారి రైతులతో ఒప్పందం చేసుకున్నాడు. క్వింటాల్‌కు రూ. 2 వేలు చెల్లించుటకు ఒప్పందం కుదిరింది. విత్తనాలను వారే సరఫరా చేసి పంట దిగుబడిని కూడ వారే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ రకం మక్క విత్తనాలను కేవలం పసుపు పంటలో మాత్రమే అంతర్ పంటగా సాగు చేయాలని పేర్కొన్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, రాకపోయినా వ్యాపారి రైతులకు చెల్లించాలి. అదనంగా వస్తే అదనంగా చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. మక్క పంట దిగుబడి వచ్చిన తరువాత మక్క పంట కంకుల బూరు తొలిగించి ఇవ్వాలని అన్నారు. కంపెనీ నిబంధనాల ప్రకారం పంట సాగు చేపట్టాలి. పంట దిగుబడి వ్యాపారికి అందించిన 10 రోజుల తరువాత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈక్రమంలో రైతులు సీడ్ మక్క సాగువైపే ఆసక్తి చూపుతున్నారు. పసుపు పంటలో అంతర్పంటగా సాగుచేస్తున్న రైతులు క్వింటాల్‌కు రూ.2000 చెల్లించేలా రైతులతో వ్యాపారుల ఒప్పందం సీడ్ మక్కలే సాగు చేస్తా.. పసుపు పంటలో సీడ్ మక్కలనే సాగు చేస్తాను. సీడ్ మక్కల కర్ర ఎక్కువగా పెరగదు. దీంతో పసుపు పంటకు ఇబ్బంది ఉండదు. ధర కూడ బాగానే చెల్లిస్తున్నారు. ఎకరానికి రూ. 30 వేల ఆదాయం వస్తుంది. – తలారి గాబ్రియెల్, రైతు -
మారుతున్న కాలంతోపాటు టీచర్లు అప్డేట్ కావాలి
● ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కామారెడ్డి రూరల్: మారుతున్న కాలంతోపాటు ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్‌లో నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు ఏ డిజిటల్ ఉపకరణం కాదని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచాలని, సామాజిక సర్దుబాటులు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాధికారి వై. ఎల్లయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ డా. సుభాష్, డీఆర్పీలు ప్రసూన్, బాలరాజ్, రాజభైరయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నగరంలో సైబర్ మోసం
● లింక్ ఓపెన్ చేసి, రూ.1.48లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి ఖలీల్‌వాడి: నగరంలోని ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.48 లక్షలు కాజేశారు. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపిన వివరాలు ఇలా.. రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల ఫోన్‌పే పని చేయకపోవడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది గూగుల్‌పే లేదా ఫోన్‌పే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈక్రమంలో సదరు వ్యక్తి గూగుల్‌లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. అనంతరం వేరే ఫోన్ నెంబర్ నుంచి సైబర్ మోసగాళ్లు కాల్ చేసి ఓ లింక్ పంపిస్తున్నామని చెప్పి పంపించారు. వెంటనే అతడు లింక్ ఒపెన్ చేయడంతో బాధితుడికి ఉన్న యూనియన్‌బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, పంజాబ్నేషనల్ బ్యాంక్‌ల ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 లక్షలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో మేక మృతి నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మండలంలోని జలాల్పూర్ గ్రామశివారులో గురువారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మేక మృత్యువాత పడింది. మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రా మానికి చెందిన చిన్నన్న అంజయ్య రోజూలాగే గు రువారం తన మేకల మందను తీసుకొని మేతకో సం జలాల్పూర్ శివారుకు వెళ్లాడు. కాగా ఇటీవల కురిసిన గాలివానకు జలాల్పూర్ శివారులో విద్యుత్‌స్తంభం నుంచి విద్యుత్‌వైరు ఊడిపోయి కిందపడింది. కిందపడిన వైరును గమనించక మేకలమంద అటువైపు వెళ్లగా మందలోని ఓ మేక ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది. ప్రమాదంలో మృతిచెందిన మేక విలువ సుమా రు రూ.10వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కాగా విద్యుత్‌వైరు నేలపై పడిన వైపు మనుషులెవరూ వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు, పశువైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగినతీరును తెలుసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సిరికొండ: మండలంలోని కొండాపూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎమ్మారై గంగరాజం గురువారం పట్టుకొని పంచనామా చేసి పోలీసులకు అప్పగించారని ఎస్సై రామ్ తెలిపారు. కొండాపూర్‌కు చెందిన ట్రాక్టర్ యాజమాని మామిడి నర్సయ్య, డ్రైవర్ రామకృష్ణ, మెట్టుమర్రి తండాకు చెందిన మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లా క్రీడాకారులు భేష్..
నిజామాబాద్ జట్టు సభ్యులతో సీపీ సాయిచైతన్య, డాక్టర్ కవితారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, రాజేంద్రప్రసాద్, రత్నాకర్, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులుపోటీలను ప్రారంభిస్తున్న సీపీ సాయిచైతన్య నిజామాబాద్ నాగారం : క్రీడల్లో నిజామాబాద్ జిల్లా ముందువరుసలో ఉందని, చదువుతోపాటు క్రీడలు సైతం ప్రధానమేనని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. గుగులోత్ సౌమ్య ఫుట్‌బాల్ క్రీడలో జాతీయస్థాయికి ఎదగడంతో జిల్లాకు మరింత కీర్తి వచ్చిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌ను గురువారం సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసింగా ఎదగాలంటే ఆటలు చాలా ముఖ్యమన్నారు. శారీరక ధృడత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యమన్న సామెతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఫుట్‌బాల్ క్రీడ సమాజంలో తోటివారితో ఎలా మెలగాలి అనేది నేర్పుతుందన్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని, గెలుపు కంటే పాల్గొనడమే ప్రాధాన్యమన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడంతో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. టోర్నీ నిర్వహించిన డాక్టర్ కవితారెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ కవితారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, రాజేంద్రప్రసాద్, రత్నాకర్, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సౌమ్య జాతీయ జట్టుకు ఆడటం గర్వకారణం పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నీ ప్రారంభం -
నేటితో ముగియనున్న స్మార్ట్‌చెక్–42 సర్వే
ఆర్మూర్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల్లో లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు నడుంబిగించింది. అందులో భాగంగా గత నెల 15 నుంచి చేపట్టిన స్మార్ట్ చెక్–42 సర్వే శరవేగంగా కొనసాగగా, నేటితో ముగియనుంది. ఎన్ఐఈపీ ఐడీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్న్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్) పేరిట స్మార్ట్ చెక్–42 సర్వే ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5సంవత్సరాల లోపు గల చిన్నారుల వరకు ఏమైన లోపాలు ఉన్నాయా? అనే దానిపై మహిళ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు సర్వే నిర్వహించారు. 42 ప్రశ్నలు– 8విభాగాలు.. అంగన్వాడీ సిబ్బంది తమ అంగన్వాడీ పరిధిలోని చిన్నారుల్లో లోపాలను గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్హెచ్టీస్ యాప్‌లో 42 అంశాల కూడిన వాటితో సర్వే చేయిస్తుంది. ప్రతి ఆంగన్వాడీ కేంద్రం పరిధిలో 5 ఏళ్లలోపు పిల్లలందరిని సర్వే చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ చెక్–42 సర్వేలో మొత్తం 42 ప్రశ్నలు ఉండగా, 8 విభాగాలుగా సర్వే ఫార్మట్లను ఏర్పాటు చేశారు. 8 విభాగాలో అందులో కొన్ని ప్రశ్నలు చేర్చారు. పాలు తాగడంలో ఇబ్బందులు ఉన్నాయా?, చిన్నారి పుట్టిన వెంటనే ఏడ్చిందా?. లేదా? ఇలా ఒక్కో విభాగంలో చిన్నారుల వయస్సును బట్టి ఎదురయ్యే లోపాలను గుర్తించే విధంగా ప్రశ్నలను తయారు చేశారు. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిఽధిలో అంగన్వాడీ కేంద్రాల వారీగా అయిదేళ్లలోపు చిన్నారులపై చేపట్టిన సర్వే నేటితో ముగియనుంది. ఉపాధ్యాయినులు తమ ఫోన్ యాప్‌లో ఎస్, నో, ఇతర వివరాలుంటే వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి చిన్నారికి సంబంధించిన సర్వే వివరాలు న్యూట్రీషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ సర్వర్‌లో నిక్షిప్తం అవుతాయి. సర్వే ఫలితాల ఆధారంగా ఏమైనా లోపాలుంటే, అవసరమైన చికిత్స తదితర చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ సర్వే ఏప్రిల్ 15న మొదలై నేటితో ముగియనుంది. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిఽధిలో 13 సెక్టార్లు మొత్తం 326 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5 ఏళ్లలోపు 20977 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటి వరకు స్మార్ట్చెక్లో 20058మంది చిన్నారుల సర్వే పూర్తియింది. పుట్టిన బిడ్డ నుంచి 5ఏళ్ల చిన్నారుల వరకు వివరాలు సేకరిస్తున్న సిబ్బంది గత నెల 15 నుంచి కొనసాగిన సర్వేప్రతి ఇంటిని సర్వే చేశాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి అంగన్వాడీ టీచర్లు వెళ్లి వివరాలను సేకరించారు. ప్రతి ప్రశ్నను అడిగి, వివరాలు తెలుసుకొని న్యూట్రీషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ సర్వర్‌లో నమోదు చేశారు. –భార్గవి, ఐసీడీఎస్ సీడీపీవో, ఆర్మూర్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఆర్మూర్‌టౌన్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సీపీ సాయిచైతన్య సూచించారు. ఆర్మూర్ మండలం చేపూర్‌లోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఆర్మూర్‌లోని జెండాగల్లీకి చెందిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మరణించగా, కారణాలను ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో పరిిస్థితిని పరిశీలించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, సిబ్బంది ఉన్నారు. రైల్వే సిబ్బంది గ్రీవెన్స్‌పై ‘నేస్తం’ ఖలీల్‌వాడి: రైల్వే సిబ్బంది గ్రీవెన్స్‌పై ‘నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్ కట్టా అన్నారు. హైదరాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో గురువారం నిజామాబాద్ రైల్వేస్టేషన్లో మొదటి నేస్తం ఫిర్యాదుల క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేందుకు, రైల్వే ఉద్యోగులు పర్సనల్ బ్రాంచ్ అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి బృందం రైల్వే సిబ్బంది సమస్యలను గ్రీవెన్స్‌లో అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు పరిపాలన పరంగా పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయశాఖలో ఘటనపై విచారణకు ఆదేశం డొంకేశ్వర్(ఆర్మూర్): మరణించిన ఉద్యోగికి సంబంధించిన ఫ్యామిలీ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ వ్యవసాయశాఖ అధికారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా సింగారెడ్డి, శివాజీ పాటిల్‌లను హైదరాబాద్ నుంచి నియమించింది. వీరు శుక్రవారం జిల్లాకు వ చ్చి బాధిత కుటుంబాన్ని, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించనున్నా రు. ఇటు టీజీవో ఆధ్వర్యంలో కలెక్టర్, డీఏవో కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 17వరకు రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా మే నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే సంబంధిత రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు. సెల్‌ఫోన్ అప్పగింత రెంజల్(బోధన్): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన సోహైల్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోగొట్టుకోగా ఆయన ఫిర్యాదు మేరకు ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. గురువారం బాధితునికి ఫోన్ అప్పగించినట్లు చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్ గణేశ్ ఉన్నారు. -
నిండుకుండలా.. రైతులకు అండగా..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫ రా చేసే కాకతీయ కాలువ వేసవిలో సైతం నిండుకుండలా ఉంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువలో నీరు నిలు వ ఉండటంతో ఇరువైపులా ఉన్న రైతుల భూము ల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటున్నాయి. కొందరు రైతులు కాలువలో పంపుసెట్లను బిగించుకొని పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. 50 క్యూసెక్కులకు జీవో కాకతీయ కాలువ నిర్మాణ సమయంలో ఆయా గ్రా మాల రైతులు ఊర చెరువులను కోల్పోయారు. దీంతో నీటిని నిలువ చేసేందుకు అవకాశం లేకపోవ డంతో కాలువలోనే నీటిని నిలువ చేసేలా ప్రత్యేక జీవోను ఆయకట్టు రైతులు సాధించుకున్నారు. 2017లో లీకేజీ నీటి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం నీటి నిలువ కోసం అవకాశం కల్పించింది. జిల్లా స రిహద్దులోని కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామం వద్ద కాకతీయ కాలువ క్రాస్ రెగ్యులేటర్‌ను దించి కాలువలో నీటి నిలువ చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల లేని సమయంలో కాలువలో నీటి నిలువ కోసం ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీటిని నిరంతరం విడుదల చేపట్టాలని ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుంచి కాలువలో నీరు నిలువ ఉంటోంది. కాలువ నుంచి పైప్లైన్లు.. కాకతీయ కాలువ నుంచి కొందరు రైతులు ఏకంగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా పైపులైన్ వేశారు. కాలువలో నీరు నిలువ ఉండటంతో ప్రస్తుతం ముందస్తుగా పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం కాలువలో నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు తీసుకోవడంపై రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.కాలువలో వ్యవసాయ పంపుసెట్లు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ముందస్తు పంటల సాగుకు అనుకూలం ఎల్లప్పుడూ నీరు.. కాకతీయ కాలువలో ఎండకాలంలో సైతం నీరు నిలువ ఉంటుండడంతో పంటల సాగుకు ఇబ్బంది లేదు. కాలువ నీటి ఆధారంగా పంపుసెట్ బిగించి పైపులైన్ వేశాను. ఖరీఫ్ పంటలను ముందుగా సాగు చేసేందుకు రెడీ అవుతున్నా. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఆకుల రాజన్న, రైతు -
విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మన్ మృతి
బోధన్ రూరల్: బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండాలో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అసిస్టెంట్ లైన్‌మన్ మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఎడిపల్లి మండల కేంద్రానికి చెందిన బి మహేందర్(34) బోధన్ సబ్‌స్టేషన్ పరిధిలోని బెల్లాల్ ప్రాంతంలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజీవ్‌నగర్ తండాలో చిన్నపాటి విద్యుత్ మరమ్మతులు ఉండటంతో గురువారం అతడు ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకోకుండా మరమ్మతులు చేపట్టాడు. ఈ క్రమంలో పైనున్న 11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో అతడికి తగలడంతో ట్రాన్స్ఫార్మర్పై పడి, అక్కడి నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బోధన్ ట్రాన్స్‌కో డీఈ ఎండీ ముక్తార్, అధికారులు ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన జైలు సూపరింటెండెంట్
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా దశరథం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జైలర్ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆయన సంగారెడ్డి సబ్ జైలుతోపాటు సిద్దిపేట్ జైలులో పనిచేశారు. బదిలీలో భాగంగా నిజామాబాద్‌లోని సారంగపూర్ జైలుకు వచ్చారు. దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్‌వాడి: నిజామాబాద్, బోధన్‌లోని రెండు బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫారం–1ఏలో దరఖాస్తు పత్రం, మూడు కలర్ ఫొటోలు, రూ.లక్ష డీడీ లేదా చలాన్(తిరిగి ఇవ్వబడదు), ఆధార్‌కార్డు, పాన్‌కార్డులను జిరాక్స్‌లతో జూన్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఒకరు ఎన్నిసార్లయినా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 13న కలెక్టర్ సమక్షంలో బార్లకు లక్కీ డ్రా తీయబడుతుందని తెలిపారు. రసాయనిక ఎరువులు విరివిగా వాడొద్దు మాక్లూర్: పంట పొలాలకు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుకోవాలని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గురువారం మాక్లూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సాయిచరణ్ మాట్లాడుతూ పంట పొలాలను చీడపీడల నుంచి రక్షించుకునేందుకు రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతుండడం శోచనీయమన్నారు. లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే అత్యధిక పురుగులు అందులో చిక్కుకొని మృతి చెందుతాయన్నారు. పుష్కలంగా సాగునీరుందని చెప్పి అస్తమానం పొలాలకు నీరందించడం కూడా సరైన పద్ధతి కాదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం ప్రశాంతి సూచించారు. తప్పనిసరిగా వేసవి దుక్కులు దున్నుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పద్మ, పశువైద్యాధికారి ఉమాసహేర్, విత్తనాధికారి ఏ అశోక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్రావు, మాక్లూర్ విండో చైర్మన్ బూరోల్ల అశోక్, రవి ప్రకాశ్, మహేందర్, అమూల్య, ఉమాదేవి, దివ్య, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి హల్చల్
నిజామాబాద్ రూరల్: అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ, సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా.. మండలంలోని మల్లారం గ్రామనికి చెందిన ఎం. సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉందని, ఇటీవల ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కానీ అధికారులు అనర్హతగా ప్రకటించడంతో గురువారం అతడు మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ఫోన్లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి సెల్‌టవర్ ఎక్కిన సాయిలుకు కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్లో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన సెల్‌టవర్ దిగి ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాయిలు సెల్‌టవర్ దిగడంతో మల్లారం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరసన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీతో దిగివచ్చిన వ్యక్తి -
మీరేం చేస్తున్నారు?
● ‘విధులకు డుమ్మా.. రిజిస్టర్లో హాజరు..’పై మండిపాటు ● జిల్లా వైద్యాధికారులపై డీహెచ్ ఫైర్ ● అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు నిజామాబాద్ నాగారం: ‘విధులకు డుమ్మా.. రిజిస్టర్లో హాజరు..’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు స్పందించారు. జిల్లాలో మెడికల్ ఆఫీసర్ల పనితీరు, కిందిస్థాయి ఉద్యోగులు విధులకు రాకపోయినా హాజరు వేయడంతో జిల్లా అధికారిపై మండిపడ్డారు. పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఎంహెచ్‌వోలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. జిల్లాలోని ఆయా మెడికల్ ఆఫీసర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, సబ్ సెంటర్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటే తప్పిదాలు జరగకుండా ఉండేవని మండిపడ్డారు. సంబంధిత డిప్యూటీ డీఎంహెచ్వోలు పక్కాగా పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. మెడికల్ ఆఫీసర్ల పనితీరు, కిందిస్థాయి సిబ్బంది ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని డీహెచ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీకి డీహెచ్ ఆదేశాలు జారీ చేశారు. -
చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్టు
ఆర్మూర్‌టౌన్: ఆటోలో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన చైన్ స్నాచింగ్ బాధితురాలు బొబ్బిలి లక్ష్మి ఇటీవల ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ మార్గం వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులు కూలీ పనుల పేరుతో నిర్మల్ జిల్లాలోని తిమ్మాపూర్, మంజులపూర్ ప్రాంతాల్లో నివసిస్తూ, మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు చైన్ స్నాచింగ్ చేసినట్లు నిర్ధారించారు. కాగా వారి వద్ద నుంచి 12.2 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో కృషిచేసి పోలీసులకు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పార్టీ ఐక్యత కోసం కలిసి పనిచేయాలి
రాజంపేట : మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండరాదని అందరూ పార్టీ కోసం ఐక్యతతో పని చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట గ్రామంలో నెలకొన్న ఇందిరమ్మ ఇళ్ల గందరగోళ విషయంపై ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు డబ్బులు వసూలు చేసినట్లు నిరూపణ జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రా మంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలి ఉధృతికి నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 20 స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు, రేకులు లేచిపోయాయి. తన మామిడి తోటలో మామిడి కాయలు రాలిపోయి చెట్లు విరిగిపోయాయయని బొల్లం కిష్టయ్య అనే వ్యక్తి తెలిపారు. పొన్నం దేవయ్య నివాస గుడిసె పైకప్పు, బానావత్ రవి ఇంటి పైకప్పు రేకులు, మాలావత్ హరిలాల్ ఇంటి పైకప్పు రేకులు, శ్రీగాధ నారాయణకు చెందిన పిండి గిర్ని పైకప్పు రేకులు, దాసారపు శంకర్ ఇంటి పైకప్పు లేచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. -
ముంపు గ్రామాలు ఉపాధికి దూరం
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ ముంపు గ్రామా లు ఉపాధిహామీ పనులకు దూరమయ్యాయి. డొంకేశ్వర్ మండలంలో కొన్ని గ్రామాలకు చెరువులు లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోతున్నారు. ముంపు నుంచి తేలిన భూముల్లో పను లు చేయడానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాఽధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్నయానం, గంగాసముందర్, జీజీ న డ్కుడ, గాదేపల్లి, అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉపాధిహామీ పనులు లేకపోవడంతో ఉపాధిని కోల్పోతున్నామని ఈ గ్రామాల ప్రజలు, నిరుద్యోగ యువత తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నూత్పల్లి, డొంకేశ్వర్, నికాల్పూర్ గ్రా మాలు కూడా ముంపు గ్రామాలే అయినప్పటికీ ఊ రు శివార్లలో చెరువులు ఉండడంతో అక్కడ ఫిష్ పాండ్లు తవ్వించి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇప్పు డు సమస్య వచ్చిందల్లా చెరువులు లేని ఆరు గ్రామాలకే. ఈ ఏడాది నుంచే అనుమతి నిరాకరణ... చిన్నయానం, గంగాసముందర్, జీజీ నడ్కుడ, గాదేపల్లి, అన్నారం, సిర్పూర్ గ్రామాలకు సంబంధించిన చెరువులు ఎస్సారెస్పీలో ముంపునకు గురవుతాయి. ప్రతీ ఏడాది వేసవిలో ముంపు నుంచి తేలడంతో గత కొన్నేళ్లుగా ఉపాధిహామీ పనులు బ్యాక్ వాటర్లోనే జరిగాయి. ఎస్సారెస్పీ భూముల్లో ఫిష్ పాండ్లు తవ్వడానికి ఇరిగేషన్ అధికారులు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేదు. పనులు చేపట్టేందుకు వీలు లేదని ఈజీఎస్ అధికారులకు తేల్చి చెప్పారు. వేరే పనులు గుర్తించి చేయించడానికి ఈ గ్రామాల్లో అవకాశం లేకుండా పోయింది. అవకాశం ఉన్న చోట కొద్ది మందికి మాత్రమే కెనాల్ పనులు కల్పిస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ ఇరిగేషన్ భూముల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఏపీవో సరిత, ఎంపీడీవో తెలిపారు. అప్పటి వరకు వేరే పనులు గుర్తించి ముంపు గ్రామాల ప్రజలకు పనులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల్లేక పనులు కల్పించని అధికారులు ముంపు భూముల్లో పనులకు అనుమతివ్వని ఇరిగేషన్ శాఖ ఉపాధిని కోల్పోతున్న ఆరు గ్రామాల ప్రజలుఇప్పటికే చాలా కోల్పోయాం ఎస్సారెస్పీకి మా ఊరి భూములిచ్చి చాలా కో ల్పోయాం. సరైన ధర ప్రభుత్వం ఇవ్వలేదు. మా పాత భూముల్లో ఉపాధి పనులు చేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో అర్థం కావడం లేదు. ఉపాధిహామీ పనులు నిలిచిపోవడంతో ఉపాధిని కోల్పోతున్నాం. అన్ని విధాలుగా మాకు నష్టమే జరుగుతోంది. – పెద్దగొండ మోహన్, చిన్నయానం పేదలకు ఉపాధి లేకుండా పోయింది ముంపు భూముల్లో ఉపాధిహామీ పనులు బంద్ కావడంతో పేదలకు ఉపాధి లేకుండా పోయింది. గత ఏడాది వరకు పనులు కల్పించిన అధికారులు ఇక నుంచి లేదంటున్నారు. చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధిహామీ పనులే ఆర్థిక ఆధారంగా ఉండేవి. అధికారులు స్పందించి ఉపాధిహామీ పనులు మళ్లీ ప్రారంభమయ్యేలా చూడాలి. – ఎర్రం సుష్మిత, మాజీ సర్పంచ్, చిన్నయానం -
‘ఐ యామ్ ఏ ఫార్మర్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైతేరాజు అనేది అనాదిగా ఉన్న నానుడి. అయితే రానురాను వ్యవసాయం చేస్తున్న యువకులను పెళ్లిచేసుకునేందుకు మాత్రం అమ్మాయిలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు సైతం యువత ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తాను రైతునని గర్వంగా చాటుకుంటున్నాడు. తన వివాహ పత్రికపై ‘ఐ యామ్ ఏ ఫార్మర్’ అని పేరు పక్కన సగర్వంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా నాగలి పట్టిన రైతు, ఎద్దుల బొమ్మను ఉండేలా పత్రికను ముద్రించుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం గ్రామానికి చెందిన యువ రైతు జ్ఞానేశ్వర్, సౌందర్య వివాహం ఈ నెల 22వ తేదీన గాంధారిలో జరగనుంది. వివాహ పత్రిక చూసినవారు దీనిపై చర్చింకుంటున్నారు. పెళ్లిపత్రికలో సగర్వంగా ముద్రించుకున్న యువరైతు -
ఎన్‌హెచ్ 63పై రైతుల రాస్తారోకో
● వర్షానికి ధాన్యం తడిసిందని ఆవేదన ● గంటపాటు ట్రాఫిక్జామ్ఆర్మూర్టౌన్: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చే స్తూ రైతులు ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డు జాతీయ రహదారి 63పై బుధవారం ధర్నా చేశారు. 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగో లు చేయడం లేదని, తక్షణమే ధాన్యం కాంటా చేసి రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మంగళవారం సాయంత్రం అధికారులను ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించా రు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆర్డీవో, డీఎస్వో శ్రీనివాస్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. త్వరలోనే ధాన్యం కొనుగో లు చేసి, రైస్ మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైతులకు బీఆర్ఎస్ నియెజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ మద్దు తెలిపారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా సుమారు 5కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ప్రభుత్వం గుర్తించిన సన్నాలనే సాగు చేయాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం గుర్తించిన 33 రకా ల సన్నాలను రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అ ధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నో టిఫై చేసిన వరి విత్తనాలను రైతులు వినియోగించా లని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హోసింగ్ ఏఈలు, ఏపీవోలు, సహకార శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ బుధవారం స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన సన్నాలను కాకుండా ఇతర రకాలను కొంత మంది రైతులు సాగు చేస్తుండడంతో ధాన్యం సేకరణ సమయంలో కొను గోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మరో రెండు వారాల్లో ఖరీఫ్ సీజన్ ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నకిలీ, నాణ్యత లోపంతో కూడిన విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కే సులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్‌లో జిల్లా వ్యా ప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వి విధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా, అందులో ఒక్క వరి పంటనే 4.37 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్నరకాలు సాగు చేస్తారని భావిస్తున్నామన్నారు. భూభారతి అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత ఉన్న వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడా లన్నారు. ప్రైవేట్ సర్వేయర్లు ప్రభుత్వం నుంచి లైసెన్సు కోసం సీసీఎల్ఏ కమిషనర్ కార్యాలయాని కి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. రేషన్ (ఆహార భద్రత) కార్డులు, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ మొదటి, రెండో వారంలో చేపట్టే వన మహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీల్లో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని, పంపిణీ చేసే ప్రతి మొక్కనూ నాటి కాపాడుకునేలా చూడాలన్నారు. పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల పెంపకం జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నకిలీ, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కేసులు రైతులకు అవగాహన కల్పించాలి వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
విధులకు డమ్మా..
నిజామాబాద్రోడ్డు ప్రమాదంలో.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన చేపూర్ శివారులోని ఎన్‌హెచ్ 63పై చోటు చేసుకుంది. గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025– 8లో u ఏప్రిల్ నెలలో ఒకేసారి సంతకాలు చేసిన సీహెచ్‌వో నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజులతరబడి విధులకు డుమ్మా కొడుతూ నెలనెలా మెడికల్ ఆఫీసర్లకు కమీషన్లు ఇస్తూ రిజిస్టర్లలో ఒకేసారి సంతకాలు చేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలో మెడికల్ ఆఫీసరే బాస్ కావడంతో కమీషన్లు ఇచ్చే ఉద్యోగులు, సిబ్బంది హవా నడుస్తోంది. ప్రభుత్వం నుంచి ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్న వారు విధులకు న్యాయం చేయడం లేదు. కమీషన్ల ఆశలో మునిగిన మెడికల్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం, పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పీహెచ్‌సీల్లో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. రోగులను పట్టించుకునే వారు కరువు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మాకొడుతుండడంతో దిక్కులేక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు మాట పక్కనపెడితే అసలు విధులకే హాజరుకాని వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులతో మాకేం సంబంధం మండలాల పరిధిలో ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్‌సీలకు మెడికల్ ఆఫీసర్లే బాస్‌లు. ఇంకేముంది ఆపైన ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా వైద్యాధికారులతో మాకేం సంబంధం అన్నట్లు ఉద్యోగులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఒక్కో పీహెచ్సీ పరిధిలో మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌వో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నిషియన్, ఎంఎన్‌వో, డీఈవో, ఫార్మసి, స్టాఫ్ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీ, అటెండర్లు తదితర పోస్టులు ఉన్నాయి. కమీషన్లు ఇచ్చే ఉద్యోగులు ఒకటిరెండు రోజులు కాదు ఏకంగా నెలల తరబడి విధులకు హాజరుకాకున్నా మెడికల్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఫోర్జరీ సంతకాలు చేస్తున్నట్లు తోటి ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. రోగులను పట్టించుకునే వారు కరువు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మాకొడుతుండడంతో దిక్కులేక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు మాట పక్కనపెడితే అసలు విధులకే హాజరుకాని వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. నా దృష్టికి వస్తే కఠిన చర్యలు నేను ప్రతిరోజూ మానిటరింగ్ చేస్తున్నాను. ఉదయం 10గంటలలోపు మెడికల్ ఆఫీసర్లు కిందిస్థాయి ఉద్యోగుల వెళ్లి లైవ్ ఫోటోస్ పెట్టాలని ఆదేశించాను. కోటగిరిలో ఓ ఉద్యోగికి డ్యూటీకి రాకున్నా జీతం వేయడంతో షోకాజ్ నోటీసు సైతం ఇచ్చాను. తనిఖీలకు వెళ్తున్నాను. ఎవరైనా మెడికల్ ఆఫీసర్లు కమీషన్లు తీసుకుని డుమ్మా కొట్టిన ఉద్యోగులకు అటెండెన్స్ వేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రాజశ్రీ, డీఎంహెచ్వోన్యూస్రీల్జిల్లాలో ఆస్పత్రులు సిరికొండ పీహెచ్సీలో విధులు నిర్వర్తించే ఉద్యోగి ఒకరు తన జీతంలో నుంచి ప్రతి నెలా మెడికల్ ఆఫీసర్‌కు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఇస్తూ డ్యూటీకి హాజరుకావడం లేదు. సదరు ఉద్యోగి నెలలో ఒకటి, రెండుసార్లు దర్జాగా పీహెచ్‌సీకి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నాడు. ఇదే పీహెచ్సీలో మరో ఉద్యోగినితోపాటు ఓ అటెండర్ విధులకు హాజరుకాకుండా రిజిస్టర్లో ఒకేసారి సంతకాలు చేస్తున్నా మెడికల్ ఆఫీసర్ పట్టించుకోకపోడానికి కారణం నెలవారి చెల్లింపులే అని స్థానిక సిబ్బంది అంటున్నారు. పీహెచ్సీలలో ఇష్టారాజ్యం జీతంలో నుంచి కమీషన్ ఇస్తూ విధులకు డుమ్మా కొడుతున్న సిబ్బంది దర్జాగా హాజరు వేసుకుంటున్న వైనం పైస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉన్నట్టా? లేనట్టా? రోగుల ఇబ్బందులు దేవుడెరుగు.. -
బిచ్కుంద పీఎస్‌లో ఏసీబీ తనిఖీలు
బిచ్కుంద: ఏసీబీ అధికారులు బుధవారం బిచ్కుంద పొలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఎస్సై మోహన్‌రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై విచారణ చే పట్టారు. సుమారు ఆరు గంటలపాటు స్టేషన్లో సో దాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పొలీసులు వసూ ళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయన్నారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వ చ్చాయన్నారు. దీంతో తాము సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఎస్సై మోహన్‌రెడ్డి పట్టుకున్న పది ఇసుక ట్రాక్టర్లు పొలీస్ స్టేషన్లో ఉన్నాయని, వారిని డబ్బులు అడిగారని, అలాగే గతంలో పలు కేసులలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దాని ఆధారంగా పూర్తి విచారణ చేసి పైఅధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కాగా మంజీర నది పరీవాహక ప్రాంతాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదు చేసినవారెవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఏ శాఖ అధికారులౖపైనెనా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. జరిమానా కట్టినా వదలడం లేదు జరిమానా కట్టినా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదని పలువురు ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో ఇసుక తరలిస్తున్నామని, పట్టుకున్న పది ట్రాక్టర్లను ఎస్సై మోహన్‌రెడ్డి మైన్స్ అధికారులకు అప్పగించారని పేర్కొన్నారు. మైన్స్ అధికారులు విధించిన జరిమానా చెల్లించి నాలుగు రోజులవుతున్నా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదన్నారు. అక్రమ వసూళ్ల విషయంలో ఎస్సైపై విచారణ ఆరు గంటలపాటు కొనసాగిన సోదాలు -
ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు
నిజామాబాద్ రూరల్: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సెస్సీ, ఇంటర్, ఇంజినీరింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2024–2025వ సంవత్సరానికి ఎస్సెస్సీలో 550 ఆపైన మార్కులు, ఇంటర్లో 970 ఆపైన మార్కులు, ఎంసెట్‌లో 1000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా మార్కుల జాబితా, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సెల్ నంబర్, పేరు తదితర వివరాలను గోత్రం నారాయణ 9440090511 నంబర్‌కు పంపాలన్నారు. అవార్డుల ప్రదానోత్సవం వివరాలు తెలియజేస్తామన్నారు.రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికరెంజల్(బోధన్): నేటి నుంచి మూడు రోజుల పాటు జనగామ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీలకు మండలంలోని తాడ్‌బిలోలి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం రేఖ, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగంగౌడ్, పీఈటీ కుమార్ తెలిపారు. తాడ్‌బిలోలి పాఠశాల నుంచి నయనశ్రీ, అక్షయ, శృతి, అమర్, మహే్‌శ ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు. -
గౌతంనగర్‌లో పోలీసుల తనిఖీలు
60 వాహనాల స్వాధీనం ఖలీల్‌వాడి: నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధి గౌతంనగర్‌లో బుధవారం రాత్రి సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి సూచన మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లను తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు, నంబర్లు లేని దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు పోలీసులని, చట్టాన్ని గౌరవించాలన్నారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీవాసుల సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్ రాజ్, రఘుపతి, సురేశ్, మల్లేశ్, భిక్షపతి, శ్రీలత, ఎస్సైలు హరిబాబు, గంగాధర్, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
ఆర్మూర్ టౌన్: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన కొండూరు నాగార్జున్ (21), నరేంద్ర (19) గత ఆదివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురం గ్రామంలోని మేనత్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా చేపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్న్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగార్జున్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన నరేందర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇరువైపులా నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఒంటరైన తల్లి..ఆర్మూర్ పట్టణంలోని జెండాగల్లీలో నివాసముండే కొండూరు పద్మ భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాగార్జున్ హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా తమ్ముడు నరేంద్ర అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. వారం క్రితమే ఆర్మూర్‌లోని ఇంటికి వచ్చారు. అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకులు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నారనుకుంటుండగానే రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు లోకం వదిలి వెళ్లడంతో తల్లి పద్మ ఒంటరిగా మిగిలింది. -
‘ట్రామా కేర్’ ఏర్పాటు చేయరూ..!
● అత్యవసర సేవలందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు ● ట్రామాకేర్ సెంటర్‌కు అనుకూలంగా ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి ఆర్మూర్‌టౌన్: రోడ్డు ప్రమాదం లేదా ప్రకృతి విపత్తు సమయంలో సకాలంలో వైద్యమందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. కాస్త ఆలస్యమైనా ప్రాణాలు పోవడంతోపాటు శాశ్వత అంగవైకల్యం బారినపడే ప్రమాదం ఉంది. ఆర్మూర్ పట్టణం రెండు (44వ నంబర్, 63వ నెంబర్) జాతీయ రహదారులకు కూడలిగా ఉండడంతో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన వైద్యం అంది ప్రాణాలు కాపాడొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిసెంటర్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారులకు దగ్గరలోనే ఏరియా ఆస్పత్రి ఉంది. ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర సేవలు అందించి ప్రాణాలను కాపాడవచ్చు. – అరుణ్, ఆర్మూర్ -
ఘనంగా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హైందవ స్వరాజ రక్షకుడిగా, ధర్మవీరుడిగా పిలుచుకునే ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి కార్యక్రమాన్ని శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సేవాసమితి ఇందూరు ఆధ్వర్యంలో నగరంలోని బోర్గాంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మహనీయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ భారతదేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమన్నారు. ప్రతి హిందువు శంభాజీ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకొని దేశరక్షణ, ధర్మరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ శంభాజీ మహరాజ్‌లా తయారుకావాలన్నారు. కార్యక్రమంలో గంగనర్సయ్య, గజానన్, దుర్గాప్రసాద్, బండారి నరేందర్, దిగంబర్, శ్రీనివాస్‌రెడ్డి, పోల్ అర్జున్, ప్రణయ్, శ్రావణ్ కుమార్, రాజు, జ్ఞానేందర్, రాజేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉసురుతీసిన ఆన్లైన్ గేమ్
● రాయకూర్‌లో యువకుడి ఆత్మహత్య రుద్రూర్: ఆన్లైన్ గేమ్ కు అలవాటుపడ్డ యు వకుడు డబ్బులు పో వడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రాయకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) కొంతకాలంగా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. డబ్బులు లేకపోవడంతో తండ్రి ఫోన్లో నుంచి రూ. 5 వేలు తన ఫోన్‌కు ట్రాన్స్ఫర్ చేసుకొని గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ మంగళవారం రాత్రి పాడుబడ్డ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెతుకుతుండగా బుధవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తండ్రి మందలించాడని..డిచ్పల్లి: పని చేయాలనీ లేదా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారులోని ఇటుకబట్టీ వద్ద చోటుచేసుకుంది. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన భరత్ మాజీ, అతని భార్య మెంట్రాజ్‌పల్లిలోని ఆంజనేయులుకు చెందిన ఇటుకబట్టీలో కొంతకాలంగా కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కొడుకు మున్షీ మాజీ (14)ని స్థానికంగా చదువుకోవాలని లేదా పనిచేయాలని తండ్రి మంగళవారం మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన మున్షి మాజీ అర్ధరాత్రి తాము ఉంటున్న రేకుల షెడ్డులోని కర్రకు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు బట్టీ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని.. కామారెడ్డి క్రైం: భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ శివారులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన తక్కడపల్లి శ్రీకాంత్ (32) మెకానిక్‌గా పనిచేస్తూ బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొడవల కారణంగా భార్య పిల్లలతో కలిసి మూడు నెలలుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. దీంతో శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్ బుధవారం జయశంకర్ కాలనీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కరడ్‌పల్లి గ్రామశివారులో పేకాటస్థావరంపై బుధ వారం దాడి చేసి రాజు, సంతోష్, నర్స య్యలను పట్టుకున్నట్లు ఎస్సై మురళి తెలిపా రు. వారిపై కేసు నమోదు చేసి, రూ.8,700 లు, మూడు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
చోరీలకు పాల్పడిన మహిళ అరెస్టు
ఎల్లారెడ్డి: ఇళ్లలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ బుధవారం తెలిపారు. ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల (45) ఎల్లారెడ్డి పట్టణంలో అనుమానాస్పదంగా నగలు విక్రయించేందుకు రాగా పట్టుకొని విచారించడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఏప్రిల్ 3న అనిత అనే ఇంట్లో చోరికి పాల్పడి బంగారు ముక్కుపుడక దొంగిలించిందని తెలిపారు. ఈ నెల 9న దుద్దుల దుర్గయ్య ఇంట్లో 5 తులాల వెండి, రూ.10 వేల నగదు, మంగళి కిషన్ ఇంట్లో 20 తులాల వెండి, చెవి కమ్మలు, రూ.13 వేల నగదును చోరీ చేసినట్లు పేర్కొన్నారు. తానే ఈ చోరీలకు పాల్పడినట్లు మంజుల ఒప్పుకుందని, ఆమె నుంచి ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి, 5 తులాల వెండి కడియం, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితురాలిని పట్టుకున్న ఎస్సై మహేశ్, పీసీ ఇద్రీస్, హోంగార్డు ప్రసాద్‌లను ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలిపారు. -
‘వెంచర్’ చేస్తే.. పక్కాగా ఉండాల్సిందే
నిజామాబాద్ సిటీ: నుడా పరిధిలో వెంచర్ వేయాలంటే నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందేనంటున్నారు అధికారులు. ప్రభు త్వ అనుమతులు సరిగా లేకున్నా, వివాదాస్పద స్థ లాలున్నా నిబంధనలు అతిక్రమించినా వెంచర్ల కథ కంచికేనంటున్నారు. గతంలో వెంచర్లు ఎలా చేసినా చెల్లుబాటు అయింది. కానీ, ప్రస్తుతం మాత్రం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, సరైన ధృవీకరణ పత్రాలుంటేను వెంచర్లకు అనుమతి మంజూరు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న వెంచర్లు.. నగర శివార్లతోపాటు నుడా పరిధిలో వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్లాటింగ్ చేసి వాటిని దళారులతో అమ్మిస్తున్నారు. కొన్నిచోట్ల అక్రమ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు లబోదిబోమంటున్నారు. అమాయకులే లక్ష్యంగా రియల్టర్లు స్థానిక నాయకులతో ములాఖత్ అవుతున్నారు. వారికి కమీషన్ ఆశచూపి వారితో ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుకున్నదే తడవుగా, స్థలం ఉంటే చాలు వెంచర్లు వేస్తున్నారు. ముందస్తు అనుమతులు లేకున్నా పనులు మొదలుపెడుతున్నారు. రాత్రింబవళ్లు పనులు చేసి అధికారుల దృష్టికి వచ్చేలోపు ప్లాట్లన్నీ అమ్మేస్తున్నారు. నగర శివార్లలో అధికం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర శివార్లలో ఈ అక్రమ వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నాగారం, గొల్లగుట్ట, గాంధీనగర్, సారంగపూర్, శా స్త్రీనగర్, మల్కాపూర్–ఏ, ముబారక్‌నగర్, కేశాపూ ర్, బర్దిపూర్, బోర్గాం (పి), న్యాల్కల్, మోపాల్, సి రిపూర్, రాంనగర్, బోర్గాం (కె), ఖానాపూర్, గౌడ్స్ కాలనీ, తారకరామనగర్ శివార్లలో వెంచర్లు వెలుస్తున్నాయి. 2 నుంచి 5 ఎకరాలున్నా చాలు వెంటనే వాటిని వెంచర్లు చేసి హాట్‌కేకుల్లా అమ్మేస్తున్నారు. ప్రభుత్వ, ఇరిగేషన్, వక్ఫ్ భూములు.. వెంచర్లు చేస్తున్న రియల్టర్ల కన్ను ప్రభుత్వ, అసైన్డు, ఇరిగేషన్, వక్ఫ్ భూములు, స్మశానాలపై పడింది. దాంతో తమ స్థలంతో పక్కనే ఉన్న ఈ స్థలాలను సైతం కలుపుకుంటున్నారు. ఇలా నాలాలు, కుంటలు, స్మశాన వాటికలు, పబ్లిక్ పార్కుల స్థలాలనూ వదలడం లేదు. విస్తరించిన నుడా పరిధి.. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో కేవలం 72 గ్రామాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 380 గ్రామాలకు విస్తరించింది. ఇందులో 3 మున్సిపాలిటీలు కూడా వచ్చాయి. ఈ పరిధిలో వెంచర్లు చేయాలంటే నుడా అధికారి డీసీపీ అనుమతి తప్పనిసరి. కానీ, స్థానిక నాయకుల సహకారంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేయడం గమనార్హం. టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి నుడా అనుమతి తప్పనిసరి 10 శాతం స్థలం ఖాళీగా ఉంచాలి నిబంధనలు ఇవే.. వెంచర్చేసే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి. మొత్తం వెంచర్ విస్తీర్ణంలో 10 శాతం స్థలం వదిలివేయాలి. (ఈ స్థలంలో పార్కు, ఆస్పత్రి, కిరాణాషాపు, మెడికల్ షాపు వంటి వాటి కోసం). రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. ఏరియా మార్కెట్ రేటు ప్రకారం ఫీజును నుడాకు లేదా మున్సిపాలిటీకి చెల్లించాలి. 15 శాతం సొమ్ము చెల్లించిన తర్వాత మొదటి డ్రాఫ్ట్ ఇస్తారు. మొదట డమ్మీ వెంచర్ ఏర్పాటు చేయాలి. రెండేళ్ల తర్వాత వెంచర్‌ను పక్కాగా నిబంధనల మేరకు నిర్మించాలి. సూచించిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ఫైనల్ లేఅవుట్‌ను అనుమతిస్తారు. నుడా అనుమతి తీసుకోవాలి టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి పొంది, సరైన ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవద్దు. సరైన పత్రాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులకు సహకరించాలి. నాన్ లేఅవుట్ వెంచర్లు చేస్తే తొలగిస్తాం. వెంచర్ పూర్తయిన తర్వాతే అమ్మకాలు చేయాలి. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కేశ వేణు, నుడా చైర్మన్ అక్రమ వెంచర్లు కూల్చివేస్తాం వెంచర్ చేయాలనుకునేవారు టీఎస్ బీపాస్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలి. డాక్యుమెంట్లలో లోపాలుండొద్దు. సూచించిన స్థలంలోనే వెంచర్ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ప్రజలు జాగ్రతగా ఉండాలి. నాన్ లే అవుట్ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు. ఇటీవల అనుమతి లేని వెంచర్లను తొలగించాం. – శ్రీధర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానర్ -
కూతురు పెళ్లైన రెండు రోజులకే..
నందిపేట్(ఆర్మూర్): కూతురి పైళ్లెన రెండు రోజులకే గుండె పోటుతో తండ్రి మరణించిన ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. నందిపేట మండల కేంద్రంలో గత 30ఏళ్లుగా సేవలందిస్తున్న పోస్టుమన్ గంగాధర్ (50)కు ముగ్గురు కూతుళ్లు కాగా చిన్న కూతురు పెళ్లిని ఆదివారం రోజు ఘనంగా చేశారు. మంగళవారం కూతురి అత్తగారింటికి టాటావ్యాన్లో కుటుంబంతో సహా వెళుతుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా గంగాధర్‌కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, ఫలితం లేకుండా పోయింది. 30ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్‌గా ప్రజలకు సేవలందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిన పోస్టు గంగాధర్.. కూతురు పెళ్లి జరిగి రెండు రోజులు గడువక ముందే హఠన్మరణం చెందడంతో గ్రామస్తులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అంత్యక్రియలలో వేలాది మంది పాల్గొని కంటతడి పెట్టారు. గుండెపోటుతో తండ్రి మరణం -
ముంబై రోడ్లపై ఇందూరువాసి
ఖలీల్‌వాడి: నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ముంబైలోని విక్ రోలీ వెస్ట్ ఫుట్‌పాత్‌పై ఉన్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి వాటర్, టీ తీసుకుంటున్నాడని, ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతున్నాడని, అడ్రస్ అడిగితే నిజామాబాద్ అని చెబుతున్నాడని తెలిపారు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలుబోధన్: అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాల్సిన ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు టౌన్ సీఐ వెంకటనారాయణ సోమవారం తెలిపారు. రాకాసీపేట ప్రాంతానికి చెందిన ఎండీ ఫారూఖ్ మద్యం మత్తులో డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయడంతోపాటు దుర్వినియోగానికి పాల్పడినందున కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి శిక్ష విధించారని పేర్కొన్నారు. ‘డయల్ 100’ను దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని బైరాపూర్ పోచమ్మ తల్లి జాతర పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా ముగిశాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నార్సితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, గాంధారి, మోపాల్, రూరల్, వర్ని మండలాల నుంచి సుమారు వందమందికిపైగా మల్లయోధులు తరలివచ్చారు. వర్ని మండలం సిద్ధాపూర్‌కు చెందిన గోపాల్ తుది పోరులో విజయం సాధించి 5తులాల వెండి కడియాన్ని గెలుపొందారు. తండా పెద్దలు గోపాల్‌కు కడియం బహూకరించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు మోపాల్తోపాటు చుట్టు పక్కల మండలాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హాజరైన వివిధ రాష్ట్రాల మల్లయోధులు -
నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ
ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జానకంపేట గ్రామానికి చెందిన మంగళ రవి కుటుంబం వేసవి ఉక్కపోత భరించలేక ఇంటి తలుపులు తెరిచి నిద్రించారు. దుండగుడు ఇంట్లోకి చొరబడి రవి భార్య లావణ్య మెడలో ఉన్న సుమారు రెండు తులాల పుస్తెలతాడును కత్తిరించి, పుస్తెలను అక్కడే వదిలేసి గొలుసు ఎత్తుకెళ్లాడు. అలికిడి శబ్దం విన్న లావణ్య మేల్కొని అరవడంతో దొంగ పరారయ్యాడు. ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జగదాంబ ఆలయంలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని యాచారం తండా పరిధిలో ఉన్న జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పూజారి రమేశ్ సోమవారం ఉదయం పూజ చేసేందుకు ఆలయానికి వెళ్లగా తాళం పగిలి ఉంది. విషయాన్ని తండా పెద్ద మనుషులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 16 తులాల వెండి, 5 గ్రాముల మంగళసూత్రం, 6 మాసాల పట్టెగొలుసులు అపహరణకు గురైనట్లు పూజారి పేర్కొన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీనివాస్, చుక్కపురం శంకర్, చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిలకు చెందిన 15 కేవీ, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఆదివారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై ఏఈ పండరీనాథ్ సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ట్రాన్స్ఫార్మర్లను అందించాలని బాధితులు కోరగా పైఅధికారులకు నివేదిక అందించి, వారం రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందేలా చూస్తామని ఏఈ తెలిపారు. -
వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని సోమవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, శ్రీధర్ రావు,అర్చకులు డైరెక్టర్లు లక్ష్మి రాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘అమ్మపాడే జోలపాట’ ఫేంకు సన్మానం
సిరికొండ: ‘అమ్మ పాడే జోల పాట’ గాయని జాహ్నవి కొండూర్ గ్రామానికి సోమవారం వచ్చింది. బంధువుల పెళ్లికి వచ్చిన ఆమెను శివాలయం వద్ద పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. జాహ్నవి పాడిన పాట చాలా బాగుందని, హిట్ అయిందని అభినందించారు. నూతన డిగ్రీ కోర్సులుఆర్మూర్టౌన్: ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–2026 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై వేణుప్రసాద్ సోమవారం తెలిపారు. బీఎస్సీ(డిజిటల్ ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ (హెల్త్ కేర్ మేనేజ్మెంట్) కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి గల విద్యార్థులు దోస్త్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశం పొందాలని తెలిపారు. రసాయన మందుల వాడకాన్ని తగ్గించాలిడిచ్పల్లి: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించి సాగు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడాలని కృషి విజ్ఞాన కేంద్రం–రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని డిచ్పల్లి తండాలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు బీవీ రాజ్‌కుమార్, స్వప్న మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. విత్తన, పురుగు మందులను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల ఇన్చార్జి వ్యవసాయాధికారి శ్రీకాంత్, మండల పశువైద్యాధికారి గోపికృష్ణ, ఏఈవోలు సతీశ్, విలాస్, రూపేశ్, వంశీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం ఓ మహిళ తాను చనిపోతానంటూ పరుగెత్తడాన్ని గమనించిన స్థానిక వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే అప్రమత్తమై నిజాంసాగర్ ప్రధాన కాలువ వైపు పరుగెడుతున్న మహిళను పట్టుకొని నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలను రక్షించిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
ఎనిమిది కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టాపల్లి గ్రామానికి చెందిన 8 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు అకారణంగా సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను వేర్వేరుగా కలిసి బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం డిచ్పల్లి మండల కేంద్రంలో విలేకరులతో బాధితులు మాట్లాడుతూ.. గత ఏడాది సెప్టెంబర్ 15న గణేశ్ నిమజ్జనం సందర్భంగా తంగెళ్ల కిషన్, మాసిపెద్ది శ్రీనివాస్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. తర్వాత మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు మిట్టాపల్లి గ్రామానికి చెందిన కంచెట్టి గంగాధర్ అండతో వీడీసీ సభ్యులు మున్నూరు కాపు కులానికి చెందిన ఎనిమిది కుటుంబాలను (తేలు గణేష్, తాజామాజీ సర్పంచ్), ఒడ్డం నర్సయ్య (మాజీ ఎంపీటీసీ భర్త), మాసిపెద్ది శ్రీనివాస్, తేలు గంగాధర్, మాసిపెద్ది రవి, గోపు రాజేశ్వర్, చిత్తపేట నడిపి గంగారం, గోపు చరణ్) సాంఘిక బహిష్కరణ చేసినట్లు తెలిపారు. తమ కుటుంబాల్లో జరిగే శుభ, అశుభ కార్యాలకు గ్రామంలోని ఇతర కులాల వారు హాజరు కావద్దని, ఎలాంటి సహకారం అందించవద్దని వీడీసీ సభ్యులు తీర్మానం చేసి ఈ మేరకు అన్ని కులాల వారికి హుకుం జారీ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాల వారికి మాదిగలు డప్పు కొట్టడం లేదని, చాకలి వారు బట్టలు ఉతకడం లేదని, మంగళి వారు వెంట్రుకలు తీయడం లేదని, కుమ్మరి వారు కుండలు ఇవ్వడం లేదన్నారు. దీంతో గత పది నెలలుగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డిచ్పల్లి సీఐ మల్లేశ్, ఎస్సై ఎండీ షరీఫ్‌లకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో తాము విధిలేక కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. బాధితుల్లో తాజా మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ భర్త -
ప్రజావాణికి 121 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు వివరించారు. ప్రజావాణికి వచ్చే వినతులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరి బ్రిడ్జి గోడ ఎత్తు పెంచాలి.. నవీపేట: యంచ శివారులోని గోదావరి నది బ్రిడ్జికి రెండు వైపుల ఉన్న గోడల ఎత్తును పెంచాలని గ్రామస్తులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం సమర్పించారు. ఎత్తు తక్కువగా ఉండడంతో నదిలో దూకి తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. ఆత్మహత్యల నివారణకు బ్రిడ్జి సమీపంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సెక్యూరిటీ గార్డులను నియమించాలని కోరారు. -
చేపల వేటకు వెళ్లి.. పాము కాటుకు బలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై మృత్యువాత పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన బెస్త అశోక్(47)ఆదివారం గ్రామశివారులోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వల వేసి, చెరువు ఒడ్డున పడుకొని ఉండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అశోక్‌ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో అశోక్ మృతిచెందినట్లు భార్య భారతి నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు.. బాల్కొండ: మెండోరా మండలం సావెల్ శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన కశవత్రి గంగాధర్(46) మృతి చెందాడు. ఎ స్సై యాసర్ ఆరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ సావె ల్ గ్రామంలో తన బంధువు మైసమ్మ పండుగ చేయడంతో భోజనం కోసం వచ్చాడు. రాత్రి దోంచందకు బైక్‌పై తిరిగి వెళుతుండగా ఎదురుగా వెల్కటూర్ నుంచి సావెల్ వైపు వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య కశవత్రి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): ఇంటర్మీడియెట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్) ఓ వరం. 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 20 వరకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 26న మెరిట్ లిస్టు, 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మోడల్ స్కూల్లో ఇంటర్‌తోపాటు ఎంసెట్, నీట్ కోచింగ్‌కు అవకాశం కల్పించారు. ప్రతి గ్రూప్‌లో 40 సీట్లు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 16 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి స్కూల్లో ఎంపీసీ, బై పీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. ప్రతి గ్రూ పులో 40 సీట్ల చొప్పున ఒక్కో పాఠశాలలో 160 సీట్లు కేటాయించారు. ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అందుకు కనీసం 3 కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండేవారు మాత్రమే అర్హులుగా అధికారులు పేర్కొన్నారు. అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ వెబ్సైట్ యూఆర్ఎల్ అడ్రస్.. http://183.82.97.97/mstgదరఖాస్తు చేసుకోవాలి మోడల్ స్కూల్స్‌లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 20 వర కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యాబోధన, లైబ్రరీ, గేమ్స్, వొకేషన ల్ ట్రైనింగ్, కంప్యూటర్ విద్య అందుబాటులో ఉంటుంది.పదో తరగతి ఫలితాల్లో వచ్చిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. – దశరథ్, ప్రిన్సిపాల్, డిచ్పల్లి మోడల్ స్కూల్ -
రేసులో ఆశావహులు
డీసీసీ పీఠం డిగ్రీ పరీక్షలు 16 నుంచి ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ (2020 నుంచి 2024 బ్యాచ్‌లకు) 1, 3, 5వ సెమిస్టర్ పరీ క్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతా యని పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్) ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 14న ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను అనివార్య కారణాలతో 16వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. తెయూ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జి ల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 24,500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity.ac. inను సంప్రదించాలని కంట్రోలర్ సూచించారు. ‘ఏకలవ్య’లో ఖాళీ సీట్ల భర్తీ ఇందల్వాయి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని ఏకలవ్య మోడల్ స్కూల్ గాంధారి (బాయ్స్), ఇందల్వాయి (గర్ల్స్)లలో 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకోసం ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇందల్వాయి) ప్రిన్సిపల్ రమేశ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధారిలో బైపీసీలో 23, సీఈసీ లో 14 ఖాళీలు, ఇందల్వాయిలో బైపీసీలో 15, సీఈసీలో 18 సీట్లు ఖాళీ ఉన్నట్లు వివరించారు. పదో తరగతి మెరిట్, నెస్ట్ అడ్మిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. న్యాయవాదులకు అండగా ‘ఇల్ప’ ఖలీల్‌వాడి: న్యాయవాద వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కా ర్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఇల్ప) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం దేవరాజ్‌గౌడ్ తెలిపారు. నిజామాబాద్ బార్ అసో సియేషన్ హాల్లో సోమవారం ఆయన న్యా యవాదులను ఉద్దేశించి మాట్లాడారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సామాజిక నిర్మాతలుగా ఉండి ప్రజోపయోగ కార్యక్రమాలలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. క ష్ట కాలంలో ఉన్న న్యాయవాదులకు, వారి కుటుంబాలకు ఇల్ప అండగా ఉంటుందని చెప్పారు. బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, ఏ ఆంజనేయులు, ఎన్ జే శ్యాంసన్, కె. వెంకటేశ్వర్‌ప్రసాద్, ఏ సురేశ్, న్యాయవాదులు బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, ఆశ నారా యణ, రంజిత్ సుతారి, బైర గణేశ్, ఆరేటి నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం రే సు పెరిగింది. ఎవరికివారు సైలెంట్‌గా తమ ప్రయత్నాలను ము మ్మరం చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో డీసీసీ పీఠం కోసం డిమాండ్ పెరిగింది. దీంతో ఈ పీఠం దక్కించుకునేందుకు నాయకులు రేసుగుర్రాల మాదిరిగా పోటీ పడుతున్నారు. ఇ దిలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ సంస్థాగత పటిష్టతపై కచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ప్రజాప్రతినిధుల కంటే పార్టీ సారథులకే జిల్లాలో ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి నటరాజన్ ప్రకటించడంతో ఈ పీఠంపై అందరి దృష్టి పడింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పైగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జి ల్లా కావడంతో డీసీసీ పీఠం ఎవరికి కేటాయిస్తా రనే విషయమై అన్నివర్గాల్లో ఆ సక్తి నెలకొంది. అదేవిధంగా పీసీసీ కార్యవర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే విషయమై సైతం చర్చ నడుస్తోంది. అయితే జి ల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇంకా మరికొంద రు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కో సం పట్టుబడుతున్నారు. కాగా మిగిలిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా జెడ్పీ పీఠం ఆశిస్తున్న నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులోకి రావడం గమనార్హం. ● డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానాల మోహన్‌రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నా రు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న బాడ్సి శేఖర్‌గౌడ్ డీసీసీ రేసు లో ముందంజలో ఉన్నా రు. సీనియర్ నా యకుడు మార చంద్రమోహన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన బాస వేణుగోపాల్‌యాదవ్, పీసీసీ ప్ర ధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగే ష్‌రెడ్డి రేసులో పరు గెత్తుతున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సా యిరెడ్డి సైతం రేసులో ఉన్నారు. నరాల రత్నాకర్ కూడా ఆశిస్తున్నారు. డీసీసీ పీఠా న్ని బీసీలకు కేటాయిస్తారా.. ఓ సీల కు కేటాయిస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మ రోవైపు డీసీసీ పీఠాన్ని మాజీ ఎ మ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సైతం ఆశిస్తున్నప్పటికీ 2018 తరువాత వచ్చినవారికి ఈ పదవి ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ పటిష్టత లక్ష్యంగా ముందుకెళుతున్న మీనాక్షి నటరాజన్ ఆలోచన ప్రకారం చూస్తే నిజామాబాద్ రూ రల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కూడా ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ఢిల్లీ వెళ్లి పార్టీ నాయకత్వానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రతిపాదనలు అందించారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏమేరకు పనిచేశారనే విషయమై పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాటిపల్లి నగేష్‌రెడ్డి ● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 20 వరకు గడువు ● ఒక్కో పాఠశాలలో 160 సీట్లు ● ఉమ్మడి జిల్లాలో 16 మోడల్ స్కూళ్లు మార చంద్రమోహన్ బాడ్సి శేఖర్‌గౌడ్ బాస వేణుగోపాల్ యాదవ్ మునిపల్లి సాయిరెడ్డి నేడు పాలిసెట్ నిజామాబాద్ అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) నేడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 16 సెంటర్లలో 6542 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. నిర్ణీత సమయానికి గంటముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని ఎగ్జామినేషన్ కన్వీనర్ శ్రీనివాస్ సూచించారు.సీట్ల కేటాయింపులు ఇలా పోటీలో శేఖర్‌గౌడ్, వేణుగోపాల్‌యాదవ్, కాటిపల్లి నగేష్‌రెడ్డి 2018 తరువాత పార్టీలోకి వచ్చినవారికి అవకాశాల్లేవని చర్చ పీసీసీ కార్యవర్గంలోకి వెళ్లేదెవరు..? స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం నేపథ్యంలో నాయకుల్లో డైలమా పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో పదవుల పంపకాలపై ఆసక్తి -
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
నిజామాబాద్‌అర్బన్: ప్రజలకు సేవలందించడంలో రెడ్‌క్రాస్ ముందుంటుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ స్థాయిలో రెడ్‌క్రాస్ అవార్డు అందుకున్న రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్‌ను సోమవారం కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. రాజశేఖర్ చాలా ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రూపొందించిన వడదెబ్బ నివారణ సూచనల పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ సేవలు అందించడంపై ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
బుద్ధుడి బోధనలు అనుసరణీయం
బోధన్: విశ్వశాంతిని ఆకాంక్షించిన గౌతమ బుద్ధుడి బోధనలు అనుసరణీయమని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నేటితరం యువత బుద్ధుడు చూపిన సన్మార్గంలో నడవాలన్నారు. సాలూర మండలంలోని హున్సా గ్రామంలో దళిత, అంబేడ్కర్ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పంచశీల బుద్ధ విహార్ (గౌతమ బుద్ధుడి మందిరం)ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మందిరంలో ఏర్పాటు చేసిన బుద్ధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ,ఆయన సతీమణి రమాబాయి విగ్రహాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శంకర్, టీపీసీసీ డెలిగేట్ బీ గంగాశంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, సొసైటీ చైర్మన్లు అల్లె జనార్దన్, మందర్నా రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు, బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మండల అధ్యక్షుడు గోపీకిషన్, బుద్ధ విహార్ కమిటీ ప్రతినిధులు శ్రీకాంత్, గౌతం, బాలాజీ, అలోక్, విశ్వనాథ్ పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి -
అటకెక్కిన విజిలెన్స్ విచారణ
● బాల్కొండ నియోజకవర్గంలో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలు ● విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు మోర్తాడ్(బాల్కొండ): రైతాంగానికి మేలు చేయాలనే సంకల్పంతో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణాల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంతో వరదల తాకిడికి చెక్‌డ్యాంలు కొట్టుకపోయి రైతులకు తీవ్రనష్టాన్ని చేకూర్చాయి. బాల్కొండ నియోజకవర్గంలోని పెద్దవాగు, కప్పల వాగులలో 12 చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించగా, ఐదు చెక్‌డ్యాంలు వరద తాకిడిని తట్టుకోలేక కుంగిపోయాయి. కట్టలు తెగి పంట పొలాల్లోకి నీరు చేరింది. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం నీటి పాలైంది. చెక్‌డ్యాంల పరిస్థితి ఇలా.. ● వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ల మధ్య 2019లో రూ.4.78 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం నిర్మించారు. 3 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించగా అంచనా వ్యయం పెంచుకోవడానికి 4.1 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వరద తాకిడిని అంచనా వేయకపోవడంతో మట్టి కట్టలు కూలిపోయి పంట పొలాలను నీరు ముంచెత్తింది. ● మోర్తాడ్ మండలం సుంకెట్ వద్ద రూ.9.38 కోట్లతో చెక్‌డ్యాం పనులు సకాలంలో పూర్తికాలేదు. దీంతో వర్షాకాలంలోనూ పనులు కొనసాగించాలని చూశారు. రెండుసార్లు చెక్‌డ్యాం కొట్టుకపోయి పంట పొలాలు నీటమునగడంతోపాటు ఇసుక మేటలు వేయడంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ● మోర్తాడ్ మండలం పాలెం– ధర్మోరాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం మట్టికట్ట కూలిపోయి పంటలు నీట మునిగాయి. ఇదే చెక్‌డ్యాం వద్ద కాజ్వే నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంతో మూడుసార్లు కాజ్వే కుంగిపోవడం, కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం శెట్పల్లి మధ్య పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.4.80 కోట్లు ఖర్చు చేశారు. 2.5 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం ఎత్తును 4 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిలువ సామర్థ్యం ఎక్కువై పంట పొలాల్లోకి నీరు చేరింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట ఎత్తును కుదించారు. ● భీమ్‌గల్ మండలం బెజ్జోరా వద్ద కప్పలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు అధికంగా ఉండటంతో పొలాలకు నీరు చేరి రైతులు సాగు చేసుకోలేని దుస్థితిలో ఉండిపోయారు. నేతలదే హవా.. చెక్‌డ్యాంల నిర్మాణంలో ఇంజినీర్ల మాట కంటే అప్పటి అధికార పార్టీ నేతల మాటనే నెగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రాలిక్ అనుమతులు తీసుకోకపోవడం, సుమోటో అనుమతులతోనే చెక్‌డ్యాంలు నిర్మించడంతో ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. రైతులకు న్యాయం చేయాలి చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది. అప్పట్లో అధికార పార్టీ నేతలకు వి న్నవిస్తే వారు లెక్కచేయలేదు. రైతు ల పట్ల దురుసుగా వ్యవహరించా రు. విచారణ జరిపి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. – నవీన్ యాదవ్, రైతు, సుంకెట్ తుది నివేదిక ఎక్కడ? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్‌డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి ఆ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటి పారుదల శాఖ నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల బృందం చెక్‌డ్యాంలను పరిశీలించి వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు తుది నివేదికను అందించకపోవడం గమనార్హం. -
ఎమ్మెల్యే పెళ్లి పత్రికకు షష్టి పూర్తి
బాన్సువాడ రూరల్(నిజామాబాద్): రాష్ట్ర ప్రభుత్వ వ్యవసా య సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగిడి అరవై ఏళ్లవుతోంది. 1965 మే 12న బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్కు చెందిన పుష్పవతితో ఆయన వివాహం జరిగింది. కాగా వీరి పెళ్లి పత్రికను పోచారం శ్రీనివాస్‌రెడ్డి బావమరిది ఇబ్రాహీంపేట్ మాజీ సర్పంచ్ మాలెపు నారాయణరెడ్డి ఫ్రేం కట్టించి భద్రపరచుకున్నారు. 30 కిలోల మీనండొంకేశ్వర్(ఆర్మూర్) : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఓ మత్స్యకారుడి వలకు బొచ్చ రకానికి చెందిన 30 కిలోల భారీ చేప చిక్కింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. భరత్ అనే మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. దీనిని వ్యాపారులకు విక్రయించాడు. ప్రతి వేసవిలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గి 20 నుంచి 30 కిలోల పైబడిన చేపలు మత్స్యకారులకు చిక్కుతున్నాయి. -
ఇబ్బందులు కలిగించకుండా నల్లమట్టి తరలించాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎవరికీ ఇబ్బందులు, నష్టం కలిగించకుండా నల్ల మట్టి తరలించుకోవాలని, మ ట్టి రోడ్లపై పడితే ప్రమాదాలు జరుగుతాయని మా జీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన డొంకేశ్వర్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని నికాల్పూర్కు వెళ్లే రోడ్డులో ఉన్న ఇరిగేషన్ కెనాల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇరుకుగా ఉన్న వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని, అలాగే మట్టి పూడికను తీయించాల ని రైతులు సుదర్శన్‌రెడ్డిని కోరగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నా రు. అన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఆయన బస్తాల రవాణాకు ఇబ్బందులు లే కుండా చూస్తామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అన్నారం మాజీ సర్పంచ్ పోశన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గొడిసె రం భూమేశ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ భరత్‌రెడ్డి, లిఫ్టు కమిటీ చైర్మన్ భోజారెడ్డి, నాయకులు ఉన్నారు. -
ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకులు
నిజామాబాద్‌అర్బన్: టీజీ ఎప్‌సెట్ ఫలితాలు ఆదివారం వెలువడగా, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్త మ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ వి భాగంలో నగరంలోని నారాయణ జూనియ ర్ కళాశాల విద్యార్థిని పంచమహల్కర్ రియా 319వ ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ విభాగంలో ఎస్ఆర్ కళాశాలకు చెంది న కార్తీక్ 572, విష్ణువర్ధన్ 689వ ర్యాంకులు సాధించారు. అలాగే ఉత్తమ ప్రతిభచాటిన కాకతీయ కళాశాల విద్యార్థులను సంస్థ డైరెక్టర్ రామోజీరావు ఘనంగా సన్మానించారు.గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్ఆర్సీవో గంగారాం నాయక్ఇందల్వాయి : రీజియన్ పరిధిలోని మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని గిరిజ న సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2025 –26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ ఎన్ గంగారాం నాయక్ ఒక ప్ర కటనలో తెలిపారు. మెదక్, చేగుంట, నర్సాపూర్, కోనాపూర్, ఎల్లారెడ్డి, హన్మాజీపేట, ఇందల్వాయి బాలికల జూనియర్ కళాశాల లో ఎంపీసీ, బైపీసీ సీట్లు, నర్సాపూర్‌లో సీ ఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉ న్నాయన్నారు. కౌడిపల్లి, నాగిరెడ్డిపేట, చీమన్‌పల్లి బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సీట్లు, బాన్సువాడలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపా రు. మొదట గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. -
సైనికులకు అండగా నిలబడాలి
నిజామాబాద్ రూరల్: దేశ ప్రజలంతా సైనికులకు అండగా నిలబడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ‘మనం సైతం – దేశం కోసం’ నినాదంతో సారంగాపూర్‌లోని హనుమాన్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల అంతానికి భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు తెలిపారు. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన నడుంబిగించినట్లు పేర్కొన్నారు. యుద్ధంలో పోరాడుతున్న సైనికులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను కల్పించాలని, భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని పూజలు చేశామన్నారు. ఆయన వెంట పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బీజేపీ నాయకులు ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతుంది ఎంపీ అర్వింద్ ధర్మపురి -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలోగల 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అముల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో భార్య బోయర్ ప్రణీత(19)తో కలిసి ఆదివారం సాయంత్రం కారులో విశాఖపట్నం బయలుదేరా డు. అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వీరి వాహనం అ దుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రణీతకు తీవ్ర గా యాలు కాగా అముల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత మృతి చెందింది. అముల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
ఇళ్లలో కూర్చుని లబ్ధిదారుల ఎంపిక
నిజామాబాద్‌అర్బన్: కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో కూర్చుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారని, డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవో నంబర్ 7 ప్రకా రం గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, జిల్లాలో ఎక్కడా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెల లు అయినా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు అందించలేదన్నారు. జిల్లాలో లక్షా 80వేల మంది పేదలు దరఖాస్తు చేసుకుంటే 70 వేల మందిని ఎంపిక చేశారని, నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చే యాలని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయిస్తామన్నా రు. రాజీవ్యువవికాస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.4 లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కాంగ్రెస్ కా ర్యకర్తలనే అర్హులుగా గుర్తించి ఇవ్వబోతోందని ఆ రోపించారు. వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ నే తలు జేబులు నింపుకునేందుకు ఈ పథకం తీసుకవచ్చినట్లు విమర్శించారు. గ్రామసభలు పెట్టకుండా నిర్వహించినట్లు అధికారులు రికార్డుల్లో రాస్తున్నా రని దీనిపై ఉన్నతాధికారులకు విన్నవిస్తామన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన కొనసాగుతోందని, పదిలక్షల మెట్రిక్‌టన్నుల సేకరించాల్సి ఉండ గా, ఏడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు సేకరించా రన్నారు. 17 వేల మెట్రిక్‌టన్నులను తరుగుకింద తీసివేస్తున్నారని, రైస్‌మిల్లర్లు దోచుకుంటున్నారని కలెక్టర్ దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం లే దన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకా శ్, సూదం రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామసభలు లేకుండా ఎలా చేస్తారు.. నిబంధనలు పాటించకుంటే కోర్టులను ఆశ్రయిస్తాం కాంగ్రెస్ కార్యకర్తలకే ‘యువ వికాస్’ అందించే యత్నం ధాన్యం సేకరణలో ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి -
ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు
● సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు వర్ని: మండల కేంద్రంలో ఆది వారం సాయంత్రం జరిగిన ఇ రు వర్గాల మధ్య ఘర్షణలో ప లువురికి గాయాలయ్యాయి. ఘర్షణపై పోలీసులకు సమాచా రం ఇచ్చిన స్పందించలేదని స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. వర్నిలో ఆదివారం సాయంత్రం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈఘటనపై ఇరువురి వాహనదారుల మధ్య మాటామాట పెరిగి చివరకి అంతాపూర్, తగిలేపల్లి గ్రామస్తుల మధ్య ఘర్షణగా మారింది.సుమారు గంటన్నరపాటు ఇరువర్గాలు తోపులాట, తిట్టుకోవడం, కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సుమారు గంటన్నర నుంచి పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసిన స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నిఘా వేయగా ట్రాక్టర్ పట్టుబడింది. ఈ ట్రాక్టర్‌ను కోటగిరి పోలీస్‌స్టేషన్ తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామానికి చెందిన బండిసాయిలు అనే రై తు పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి కాయిల్ చోరీచేశారు. సుమారు రూ.40వేల నష్టం వాటిల్లిన ట్లు ట్రాన్స్‌కో రూరల్ ఏఈ కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం వరికోతలు పూర్తికావడంతో రైతులు పొలాలవైపు వెళ్లకపోవడంతో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. 29 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నవీపేట: నిజామాబాద్ నుంచి ధర్మాబాద్ వైపు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ ఆదివారం తెలిపారు. టాటాఏస్ వాహనంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు రావడంతో నవీపేట శివారులో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ మహేష్‌కుమార్‌కు అప్పగించామన్నారు. నిజామాబాద్‌లోని మాలపల్లికి చెందిన వాహన యజమాని షేక్ ఖయ్యూమ్, డ్రైవర్ సొఫియాన్లపై కేసు నమోదు చేశామన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామ శివారులోగల తోట గణేష్ అనే వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమయింది. వడదెబ్బ తగిలి సుమారు రెండు మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, కాఫీ కలర్ టీషర్టు ఉన్నదని, సంబంధీకులు ఎవరైన ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
‘అమ్మకు వినూత్న వందనం’
మోపాల్: మండలకేంద్రంలోని చిన్నారులు ఆదివారం మదర్స్ డే సందర్భంగా అమ్మకు వినూత్నంగా శుభాకాంక్షలను తెలియజేశారు. చిన్నారులు గ్రామస్తులతో కలిసి చెట్ల ఆకులతో ‘అమ్మకు వందనం’ అని లిఖించి మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరికి తొలి గురువు అమ్మేనని, తల్లి ప్రేమను మించినది ఈ సృష్టిలో ఏదీ లేదని చిన్నారులు అన్నారు. కార్యక్రమంలో నవీన్‌రెడ్డి, ముత్యం, గంగాధర్, శేఖర్, సంజీవ్‌రెడ్డి, చిన్నారులు అక్షర, ఆకృతి, ఖుషి, చిన్ను, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.అమీర్‌నగర్ వాసికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డుకమ్మర్పల్లి: మండలంలోని అమీర్‌నగర్ గ్రామానికి చెందిన మెరుగు నాగేశ్వర్రావు అనే వ్యక్తికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఎంఎన్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగేశ్వర్రావు ‘మన రసం’ అనే షార్ట్ ఫిల్మ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, మాటలు రాసి భరత్ అనే లీడ్ రోల్ పోషించారు. రెండు నెలల క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశాయగా భారీ వ్యూస్‌తో వీక్షకుల మన్నలను పొందింది. ఈ చిత్రానికి జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇటీవల హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం చేతుల మీదుగా నాగేశ్వర్రావు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అధినేత సంజోష్ తగరంకు, జ్యూరీ సభ్యులకు నాగేశ్వర్రావు కృతజ్ఞతలు తెలిపారు.రెడ్‌క్రాస్ జిల్లాకు గర్వకారణంనిజామాబాద్నాగారం: సమాజ సేవలో ముందుంటూ ప్రగతి సాధిస్తున్న జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ జిల్లాకే గర్వకారణమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్‌కు రెడ్‌క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు దక్కడంతో ఆదివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆయనను సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజం కోసం సేవలు అందించాలని అప్పుడే అభివృద్ధికి బాటపడుతుందన్నారు. రాజశేఖర్ ఇటు వృత్తిలోనూ అటు సేవారంగంలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్రె డ్డి, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయు లు, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త రవీందర్ అబ్బాపూర్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, మైపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదునిజామాబాద్రూరల్: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు రూ రల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ తెలిపారు. వివ రాలు ఇలా.. తిర్మన్‌పల్లి గ్రామంలో బోనాలపండుగ నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామంలో ఉ న్న ఎస్టీలకు ఇతర ప్రజలకు మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తి ర్మన్పల్లి గ్రామస్తుల ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యా దు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా
నిజామాబాద్‌అర్బన్: ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఫలితాలు విడుదల కాగా, పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన హర్షిత్‌కు అగ్రికల్చర్ విభాగంలో 1314 ర్యాంకు, నిహాల్‌కు 2553 ర్యాంకు వచ్చింది. పదివేల లోపు పదిర్యాంకులు, 20వేలలో పు 26 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు ఏజీఎం లక్ష్మారెడ్డి అన్నారు. కాకతీయ కళాశాలలో.. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు అనస్అలీ 1766 ర్యాంకు(అగ్రికల్చర్), ఎం.సంకీర్త్ 2398 , జి.వేదస్కర్ 2881, భవ్యశ్రీ 3310, ఎం.లోకేశ్ 3671, ఏ.వైష్ణవి 4172, రిషిక్ 5932, వి.నికేతన్ 6293 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ రామోజీరావు సన్మానించారు. కళాశాల డైరెక్టర్ తేజస్విని, ప్రిన్సిపల్ సందీప్, రణదీప్, శ్యామ్ పాల్గొన్నారు. ఎస్ఆర్ కళాశాలలో.. నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు కార్తీక్ 572 ర్యాంకు, విష్ణువర్ధన్ 689 ర్యాంకు (అగ్రికల్చర్), అతీఫ్అఫ్నాన్ 1305 (అగ్రికల్చర్), నవదుర్గ 1484 (ఇంజనీరింగ్), శ్రీకాంత్ 1611(అగ్రికల్చర్), తేజస్విని 1914(అగ్రికల్చర్), జి.సిరి 2117(అగ్రికల్చర్), రాజశ్రీ 2175 ర్యాంకు (అగ్రికల్చర్) సాధించారు. విద్యార్థులను కళాశాల ఏజీఎం గోవర్ధన్‌రెడ్డి సన్మానించారు. వెక్టార్ జూనియర్ కళాశాలలో.. నగరంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు శ్రీవర్షిణి 1316 ర్యాంకు, మామిడి నిశాంత్‌రెడ్డి 1737, చంద్రవన్రెడ్డి 2532, వినాయక్ జోషి 2660, ఆర్గుల్ వెన్నెల 3554 ర్యాంకు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ మధుసూదన్జోషి అభినందించారు. క్షతియ జూనియర్ కళాశాలలో.. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు వివేక్‌రెడ్డి 1,813 ర్యాంకు (ఇంజినీరింగ్), హరివర్థిని 3,724 ర్యాంకు (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ) సాధించినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్ రావు తెలిపారు. పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కునిజామాబాద్ నాగారం: పెన్షన్ ప్ర భుత్వ భిక్ష కాదని, ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర యత్నిస్తున్నాయని ఇన్సూరెన్స్ ఉ ద్యోగుల జాతీయ నాయకుడు జీ తిరుపతయ్య అన్నారు. ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్ భవన్లో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఈపీఎస్, న్యూ పెన్షన్ స్కీం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లంటూ వర్గీకరించి పెన్షన్‌ను ఎగవేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మికులు పోరాటం చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 20న సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్, స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ రామ్మోహన్రావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటేశ్ , ఈవిల్ నారాయణ, నేతి శేఖర్, శ్రీనివాసరావు, విజయానందరావు, ఎల్ శ్రీధర్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం కాదు.. హత్యే..
మాక్లూర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట దాబా పైనుంచి పడి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేయగా, కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం తెలిసింది. కేసు వివరాలను ఆదివారం నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు. మాక్లూర్ మండలం కల్లెడి తండాలో ఈ నెల 5న రాత్రి గూగులోత్ శంకర్ దాబా పైనుంచి పడి మృతి చెందాడని భార్య యమున నమ్మించింది. మరుసటి రోజు అంత్యక్రియలు సైతం పూర్తిచేశారు. ఈ విషయమై మృతుడి కుమారుడు గూగులోత్ రమేష్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 10 మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజశేఖర్ వెంటనే విచారణ ప్రారంభించి యమునను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు. 5వ తేదీ రాత్రి తన ప్రియుడు నందుతో కలిసి భర్త శంకర్‌ను దాబా పైనుంచి తోసివేసింది. అనంతరం కర్రతో కొట్టి గొంతు నులిమి హత్య చేశారు. దీంతో భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య దాబా పైనుంచి పడి చనిపోయాడని నమ్మించిన వైనం కుమారుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు -
దశాబ్దాల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
సాక్షి నెట్వర్క్: చిన్ననాటి మిత్రులందరూ దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికిలోనైన స్నేహితులు -
పంచశీల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
నిజామాబాద్‌నాగారం: నగరంలోని బురుడుగల్లీలో ఇటీవల పంచశీల జెండా గద్దె, సంఘం బోర్డును మున్సిపల్, పోలీస్ సిబ్బంది కూల్చివేశారని వెంటనే మళ్లీ ఏర్పాటు చేయాలని దళిత కళ్యాణ సమితి అధ్యక్షుడు పింకి పాయక్రావు అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్దెకు అనుమతి ఉండగా, వేరే వ్యక్తులు అకారణంగా కాషాయ జెండా గద్దెను ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తొలగించారన్నారు. ఇటీవల అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు, సిబ్బంది మా జెండాను, గద్దెను తొలగించారన్నారు. వెంటనే జెండా గద్దెను నిర్మించకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. నాయకులు బంగారు సాయిలు, మోహన్, భీమ్ ఆర్మీ అజయ్, విజయ్ పాల్గొన్నారు.పెన్షనర్ల సదస్సును జయప్రదం చేయండినిజామాబాద్నాగారం: నగరంలోని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో ఆదివారం నిర్వహించనున్న పెన్షనర్ల జిల్లాస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు, ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ రాంమోహన్‌రావు అన్నారు. నగరంలోని సంఘ కార్యలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రాధా కిషన్, తదితరులు ఉన్నారు.నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంనిజామాబాద్నాగారం: నగరంలోని వినాయక్‌నగర్ పద్మజ్యోతి పద్మశాలి సంఘం 49వ తర్పా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు సంఘాల బాధ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకం రాజేందర్, గజం సుదర్శన్, కోశాధికారి సుప్పాల వెంకట లక్ష్మణ్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులతో నగర సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ప్రతినిధులు పుల్గం హన్మాండ్లు, గుడ్ల భూమేశ్వర్, బత్తుల భుమయ్య, కొట్టూరి హన్మండ్లు, పాము రాకేష్, బొమ్మెర సాయన్న, పెంట నారాయణ, కట్ట వరప్రసాద్, గడ్డం సురేష్, బత్తుల మురళి, రెగోండ మెహన్కూమార్, పెంట అంబదాస్, అడిచర్ల మధుసూదన్ పాల్గొన్నారు.పీవీ రావుకు ఘన నివాళినిజామాబాద్నాగారం:మాలమహానాడు వ్యవ స్థాపకుడు పీవీరావు జయంతిని సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా నగరంలోని పూలాంగ్చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మాలమహానాడు నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మాల మహానాడు ప్రతినిధులు గైని గంగారాం, సక్కి విజయ్ కుమార్, సక్కి ప్రభంజన్, సుంకరి విజయ, సక్కి చంద్రశేఖర్, గైని విద్యాసాగర్, మగ్గిడి దేవరాజ్, ప్రశాంత్, బేగరి శోభన్, దండు అనిల్, సుంకరి మల్లేష్, సంధ్య, మంజుల, లావణ్య, గంగామణి పాల్గొన్నారు.ధర్పల్లిలో ఆరోగ్య శిబిరంధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు పలువురికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. వైద్యులు శివశంకర్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువు
నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని చాలా గ్రామాల్లో ఆరోగ ఉపకేంద్రాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 19 గ్రామాలు ఉండగా కేవలం మల్లారం, తిర్మన్‌పల్లి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లో ఏఎంఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు గ్రామాల్లోని పంచాయతీ భవనాల్లో ప్రజలకు చికిత్సలు, మందులు అందిస్తున్నారు. దీంతో ఆరోగ్యఉపకేంద్రాలు లేని గ్రామాల్లో ప్రజలు వైద్యం, మందుల కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. గుండారంలో నిలిచిన పనులు.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుండారం గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రానికి స్థలం కేటాయించి నాలుగేళ్లు అవుతుంది. అప్పట్లోనే భవ న నిర్మాణం కోసం పనులు ప్రారంభించగా, కాంట్రాక్టర్ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. అ సంపూర్తి పనుల కారణంగా ప్రస్తుతం జీపీ భవనంలోని ప్రత్యేక గదిలో వైద్య సిబ్బంది ప్రజలకు సేవ లు అందిస్తున్నారు. మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు ఆరోగ్య ఉపకేంద్రాలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు నిర్మించి, వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. రూరల్ మండలంలో 19 గ్రామాలుండగా కేవలం రెండు గ్రామాల్లోనే ఏర్పాటు మిగిలిన గ్రామాల్లో జీపీ కార్యాలయాల్లో వైద్యసేవలు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నాం.. మా గ్రామంలో ఇప్పడి వరకు ఎలాంటి ఆరోగ్య ఉప కేంద్రం లేదు. గ్రామంలో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు వైద్య సేవల కోసం గుండారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి వెళుతుంటారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో ప్రజలు సమీప గ్రామాలకు ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. –అంజలి, మల్కాపూర్ (ఏ) అధికారులు స్పందించాలి.. గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రానికి దాదాపు మల్కాపూర్(ఏ), అనంతగిరి, సమీప గ్రామాలకు చెందిన గర్భిణులు, బాలింతలతోపాటు రోగులు వస్తూంటారు. గతంలో ఆరోగ్య ఉప కేంద్రం పంచాయతీ కార్యాలయంపై ఉండేది. రోగులకు ఇబ్బందికరంగా ఉండటంతో కింది గదికి మార్చాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. –ఒంటెల శంకర్‌రెడ్డి, మాజీ ఉపర్పంచ్, గుండారం -
సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ: నగర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని ఖిల్లా చౌరస్తా వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి రాములు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల డ్రైవర్లను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ సెక్షన్ 106(1(2)ను రద్దుచేయాలన్నారు. ఈ ప్రమాదాల్లో డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే సెక్షన్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రవాణారంగ కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు సయ్యద్ రఫీయుద్దిన్, సయ్యద్ ఇర్ఫాన్, షేక్ జావిద్, షేక్ మసూద్, షేక్ మజీద్ పాల్గొన్నారు. -
పనిభారం తగ్గించాలి
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవనంలో ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని,ఆర్టి జన్ ఉద్యోగులకు 8 గంటల పనిగంటలు కల్పించా లని సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్ కోరారు. స మస్యను విద్యుత్ అధికారులకు విన్నవించగా అంగీకరించినట్లు ఆమె తెలిపారు.జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఆర్టిజన్ ఉద్యోగుల పనిభారం తగ్గించాలని,8 గంటల పని కల్పించాలని అ ధికారులను కోరామని, దానికి వారు అంగీకరించి సర్క్యూలర్ జారీచేశారన్నారు.అన్ని డివిజన్, సబ్ డివిజన్ సెక్షన్లలో కూడా ఈ సర్క్యూలర్‌ను అమలుచేయాలన్నారు.నాయకులు నరేష్, గంగాధర్, ము రళి, మహేష్,రాజు, రవీందర్, నవీన్ పాల్గొన్నారు.