
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీజీఎస్‌పీ) బెటాలియన్స్ డీఐజీ సీ సన్ని సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా డిచ్‌పల్లిలోని టీజీఎస్‌పీ ఏడో బెటాలియన్ను మంగళవారం ఆయన సందర్శించారు. కమాండెంట్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఐజీ కి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇన్స్‌పెక్షన్ పరే డ్‌కు కమాండర్‌గా అసిస్టెంట్ కమాండెంట్ కేపీ స త్యనారాయణ వ్యవహరించారు. బెటాలియన్ సి బ్బంది నుంచి డీఐజీ సన్ని గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం దర్బార్ నిర్వహించి అధికారులు, సిబ్బంది సమస్యలను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల ప్రాత కీలకమన్నారు. మంచి ఆహారం, తగినంత వ్యాయామం, యోగా ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తర్వాత బెటాలియన్ ఆవరణలో డీఐజీ మొక్కను నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్‌కుమార్, ఆర్‌ఐలు కే త్రిముఖ్, ఏ నవనీత్‌కుమార్, బి వసంత్‌రావు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.