
ఆవులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్టు
ఖలీల్‌వాడి: ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి కారుల్లో ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్నట్లు సీసీఎస్ సీఐ సురేష్ గురువారం తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్, ముంబాయికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమీర్, అబ్దుల్‌కలామ్, సయ్యద్ సోయాబ్, సమీర్‌ఆలీ, మహబూబ్‌అలీలు కార్లపై ప్రెస్, పోలీస్ బోర్డులు పెట్టుకుని దొంగ నెంబర్ ప్లేట్లతో నడుపుతూ ఆవులను ఇన్నోవా వెహికల్, ఇతర వాహనాలలో దొంగతనంగా తరలించేవారన్నారు. కార్లలో సీట్లు తీసివేసి ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, ఎక్కించేవారన్నారు. నాందేడ్‌కు ప్రత్యేక బృందంతో వెళ్లి, రెండు రోజులు గాలించి ముఠా సభ్యులు పట్టుకున్నట్లు తెలిపారు. ముఠా సభ్యులపై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్రలోని దెగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. సీసీఎస్ సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలే్ ష, నరేష్ ఉన్నారు.