
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
నిజామాబాద్‌నాగారం: యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా నగరంలోని ఉమెనన్స్ కళాశాల మైదానంలో కొనసాగిన ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓ క్రీడాకారుడిగా క్రీడలకు రూ.3500 కోట్లు నిధులను విడుదల చేశారన్నారు. జిల్లాలో స్టేడియం ఏర్పాటుతోపాటు కోచ్‌లను నియమించే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి కారకులైన రాజేందర్‌రెడ్డి, కవితరెడ్డి, కార్యనిర్వాక కార్యదర్శి సుధీర్, కోచ్ నాగరాజులను అభినందించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి పట్ల సుముఖంగా ఉందన్నారు. టోర్నమెంట్ చైర్మన్ రాజేందర్‌రెడ్డిడ్డి, కన్వీనర్ కవితరెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనగా సీఎఫ్‌ఏ టీం ఇండియా ఉమెన్స్ లీగ్2 కు క్వాలిఫై అయ్యారని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకోని, కాసేపు పుట్‌బాల్ ఆడారు. నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భక్తవత్సలం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, రమేష్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారుక్, జావిద్, సీనియర్ న్యాయవాది నీరజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నగరంలో ముగిసిన తెలంగాణ ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ టోర్నమెంట్

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి