
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
ఇందల్వాయి: విద్యుత్ సమస్యలను పరిష్కరించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చైర్మన్ సీజీఆర్‌ఎఫ్–2, టీజీఎన్‌పీడీసీఎల్ ఎరుకల నారాయణ అన్నారు. ఇందల్వాయి మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌లో గురువారం తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి నారాయణతోపాటు, టెక్నికల్ మెంబర్ సలంద రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ లకావత్ కిషన్, సీజీఆర్‌ఎఫ్ మరిపల్లి రాజాగౌడ్‌లు హాజరై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ కృషి చేస్తుందని అన్నారు. బిల్లులలో అవకతవకలు, లూస్ లైనింగ్, ఓవర్ లోడ్, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో జాప్యం వంటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని వాటిని వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. సమస్యలను ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కరిస్తామని, అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.