
కనువిందు చేసిన ఆరుద్ర పురుగు
డిచ్‌పల్లి: ఆరుద్ర కార్తె సమయంలో విరివిగా కనిపించే ఆరుద్ర పురుగు ఈసారి కాస్త ముందుగానే కనిపించింది. ప్రతి ఏటా వానాకాలం ప్రారంభమైన తర్వాత ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే ఈ ఎర్రటి దూదిలాంటి పురుగులు కన్పిస్తుంటాయి. అయితే ఈసారి మే నెలలోనే వర్షాలు కురుస్తుండటంతో డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్, దూస్‌గాం గ్రామాల శివార్లలో ఆరుద్ర పురుగులు నేలలోంచి బయటకు వచ్చి తిరుగాడుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
జూన్ 4లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
నిజామాబాద్ అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఎంబీఏ, ఎంఏ జర్నలిజం సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఫీజులను జూన్ 4లోపు చెల్లించాలని సెంటర్ నిర్వాహకురాలు రంజిత ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 11లోపు చెల్లించవచ్చన్నారు. జూన్ 26 నుంచి జర్నలిజం సెమిస్టర్ వన్ పరీక్షలు, జూలై 2నుంచి ఎంఏ జర్నలిజం మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్ 26 నుంచి ఎంబీఏ ఒకటో సెమిస్టర్ పరీక్షలు, జూలై 2నుంచి ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయన్నారు. మిగతా వివరాలకు 73829 29612ను సంప్రదించాలన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్: నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో గురువారం జిల్లా సంక్షేమ శాఖలోని వసతిగృహ అధికారుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. వీరిని టీఎన్జీవోస్ నాయకులు సన్మానించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, నాయకులు శ్రీనివాస్, మచ్చేందర్, దినేష్, గంగ కిషన్ ప్రకాష్, పద్మ పాల్గొన్నారు.
మహిళ శిశు సంక్షేమ సంఘం..
నిజామాబాద్‌నాగారం: నగరంలోని కలెక్టరేట్‌లోగల టీఎన్జీవోస్ హాల్‌లో గురువారం మహిళ, శిఽశుసంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షురాలిగా గాలి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా శ్రీప్రియ, 16మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, నాయకులు వనం సుధాకర్, ఇందిరా, స్వర్ణలత, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహించగా, 1431 మంది విద్యార్థులకు గాను 1331 మంది పరీక్షలకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు.

కనువిందు చేసిన ఆరుద్ర పురుగు