
తూనికలు, కొలతల మోసాలపై చైతన్యవంతం కావాలి
సుభాష్‌నగర్: వినియోగదారులు, రైతులు తూనిక లు, కొలతల మోసాలపై చైతన్యవంతం కావాలని, లీగల్ మెట్రాలజీ చట్టం–2011పై అవగాహన పెంచుకోవాలని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ సూచించా రు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ వారోత్సవాల సందర్భంగా ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి, భారత వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ముద్రించిన గోడప్రతులను గురువారం మార్కెట్ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్ర వీణ్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల్లో మోసాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వినియోగ దారుల నిత్య జీవితం తూనికలు, కొలతలతో ము డిపడి ఉంటుందని అపర్ణ తెలిపారు. వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంపొందించుకున్నప్పుడే తన హక్కులను పొందుతాడన్నారు. సీసీఐ రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లలో ఎలక్ట్రానిక్ తూకాలు సక్రమంగా పని చేసేవిధంగా చూడాలని కోరారు. గ్రేడ్–2 సెక్రెటరీ శ్రీధర్, గ్రేడ్–3 సెక్రెటరీ మధుసూదన్, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమితి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, వీవెన్ వర్మ, శ్రీనివాస్, గైని రత్నాకర్, యాటకర్ల దేవేష్ పాల్గొన్నారు.