మా ఇష్టం
నిజామాబాద్
మా రూల్స్..
బంగారు భవిష్యత్తును..
యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ శ్రీనివాస్‌రావు సూచించారు.
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
–8లో u
క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేపట్టాలి
బాల్కొండ: భూ భారతిలో రైతులు అందజేసిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విచారణ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ బృందాలకు సూచించారు. మెండోరా మండలంలోని బుస్సాపూ ర్, దూదిగాం గ్రామాల్లో రెవెన్యూ బృందా లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణను కలెక్టర్ మంగళవారం పర్యవేక్షించారు. మెండోరా మండలం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక కావడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో భూ భారతి గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారులు లేకుండా విచారణ చేపట్టొద్దని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూ చించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగు తున్న డెస్క్ వర్క్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్, తహసీల్దార్‌లు శ్రీకాంత్, సంతోష్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మూడు క్లినిక్‌లు సీజ్
నిజామాబాద్‌నాగారం: ఆర్మూర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను వైద్యారోగ్య శా ఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్‌లోని భారతి, ప్రియాంక క్లినిక్‌లలో 2014 నుంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. బెంగాల్ నుంచి వచ్చినవారు ఆర్‌ఎంపీలుగా చలామణి అవుతూ ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారని, అబార్షన్‌లు సైతం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరో ఆయుర్వేద క్లినిక్‌ను సీజ్‌చేశారు. క్లినిక్‌లలో అనుమతి లేని మందులు, ఇతర పరికరాలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.
పూర్తయిన గాలికుంటు టీకాల పంపిణీ
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగిన పశువులకు గాలికుంటు టీకాల పంపిణీ పూర్తయ్యింది. జిల్లాకు 2లక్షల డోసులు తెప్పించగా, ఇప్పటి వరకు 1.82లక్షల పశువులకు (82శాతం) టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రోహిత్ రెడ్డి తెలిపారు. టీకాలు ఇంకా అందుబాటులో ఉన్నాయని తెల్ల, నల్లజాతి పశువులకు ఇంకా ఎవరైనా టీకాలు వేయించని పక్షంలో స్థానిక పశువైద్య అధికారులను సంప్రదించి వేయించాలని సూచించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చట్టాలు, నిబంధనలు బేఖా తరు చేస్తూ మా రూల్స్.. మా ఇష్టం అన్నట్లుగా ఫైళ్ల కథలు నడిపిస్తున్నారు. ముడుపులు అందనంతవరకు అనుమతు లు ఇవ్వకుండా.. ముడుపులు ముట్టాక వాటికే త క్షణ అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నా యి. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసినప్పటికీ చూసీచూడనట్లు ఉంటున్నారు.
● పూసలగల్లీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి సైతం అన్ని నిబంధనలు అతిక్రమించి భవనం నిర్మించేలా టీపీఎస్ రాజేష్ కథ నడిపిస్తున్నట్లు ప లువురు ఫిర్యాదులు చేశారు. మాస్టర్‌ప్లాన్ మేరకు 60 అడుగుల రోడ్డుకు బదులు 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. నగరపాలక సంస్థకు గిఫ్ట్‌గా ఇచ్చి న 10 అడుగుల స్థలంలోనూ నిర్మాణం చేస్తున్నారు. రోడ్‌ఎఫెక్టెడ్ ఏరియా వదలకుండానే భవనం కడుతున్నారు. పైగా ఇటీవల దీనికి సంబంధించి రోడ్డుపైనే బోరు వేయడం గమ నార్హం. బోరు విషయమై ఫి ర్యాదు వచ్చినప్పటికీ నగరపాలక అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అదే బోరును వాడుతుండడం విశేషం. ఈ భవనానికి సంబంధించి అనుమతుల కోసం 14.11.2024, 25.11.2024, 30.12.2024, 27.02. 2025న దరఖాస్తులు చేసుకోగా నాలుగుసార్లు తిర స్కరించారు. మళ్లీ మరుసగా ఐదోసారి 19.04. 2025న దరఖాస్తు చేసుకోగా టీపీఎస్ రాజేష్ అనుమతులు ఇవ్వడం గమనార్హం. గతంలో టీపీఎస్ రాజేష్ రెండుసార్లు, టీపీఎస్ అనుపమ ఒకసారి, టీపీఎస్ రాజేంద్రప్రసాద్ ఒకసారి తిరస్కరించారు. మళ్లీ ఐదోసారి టీపీఎస్ రాజేష్ అనుమతులు ఇచ్చే లా కథ నడపడం గమనార్హం. ఈ విషయమై పలువురు నగరపాలక కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. టీపీఎస్ రాజేష్ ఇచ్చిన అనుమతులన్నింటిపై తనిఖీలు చేయాలని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ఈ విషయమై పరిశీలించి తగి న చర్యలు తీసుకుంటామని కమిషనర్ దిలీప్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
న్యూస్‌రీల్
ఇదీ నిజామాబాద్ నగరపాలక సంస్థ అధికారుల తీరు
రిజెక్ట్ చేస్తారు.. తరువాత
అనుమతులిస్తారు
మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలకు దన్నుగా నిలుస్తున్న
అధికారులు
ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ
పట్టించుకోని ఉన్నతాధికారులు
విజయ ఆస్పత్రి విషయమై హైకోర్టుకు
అనుమతులు సక్రమంగా లేకుండానే విజయ ఆస్పత్రి భవన నిర్మాణం చేశారు. 2011లోనే అనుమతులు తీసుకున్నారని టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ రాజేశ్ చెప్పడం అవినీతికి నిదర్శనం. నగరపాలక, అగ్నిమాపక అధికారులకు ముడుపులు ముట్టడంతో కళ్లముందే నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలేదు. మరోవైపు వైద్యులు లేకుండానే చికిత్సలు చేస్తున్న విషయమై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా మొక్కుబడిగా రూ.10 వేలు జరిమానా విధించి వదిలేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
– తిరుపతి హనుమాన్లు, ఫిర్యాదుదారు
నగరంలోని ఖలీల్‌వాడిలో గల విజయ ఆస్ప త్రి బహుళ అంతస్తుల భవనానికి సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. కనీసం ఇక్కడ ఫైర్ ఇంజిన్ తిరిగే పరిస్థితి లేదు. పై గా రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేశారు. సెట్‌బ్యాక్ ఊసే లేదు. సెల్లార్ అనుమతులు లేవు. ఇక పార్కింగ్ సైతం లేదు. ఇలాంటి నేపథ్యంలో నగరపాలక అధికారులు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం. టీపీఎస్ రాజేష్ ఆఽ ద్వర్యంలో అన్ని ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యా దు దారుడు హనుమాన్లు పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆస్పత్రిలో ఇటీవల రిసెప్షనిస్టే వైద్యం చేసిన నేపథ్యంలో నవీపేట మండలం నాళేశ్వర్‌కు చెందిన కొందరు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా రూ.10 వేలు జరిమా నా విధించి మమ అనిపించారు. వైద్యులు లేకుండానే చికిత్స చేసిన విషయమై రగడ చోటుచేసుకుంది. కాగా విజయ ఆస్పత్రికి సంబంధించి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం
మా ఇష్టం


