కళాభవన్‌కు నిధులు మంజూరు చేయాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ (కళాభారతి) పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, జీరో అవర్‌లో ధన్‌పాల్ మాట్లాడారు. రూ.116 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కేవలం రూ.50 కోట్ల మాత్రమే విడుదల కావడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. కాంట్రాక్టర్‌కు బకాయిలు పెండింగ్‌లో ఉండటం, అంచనాలు మారడం కారణంగా రూ.70 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల జీరో అవర్‌లో ఆయన.. భీమ్‌గల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 100 పడలక ఆస్పత్రి మంజూరు కాగా.. 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికాకపోవడంతో సిబ్బంది వేరే దగ్గర సర్దుకుని పని చేయాల్సి వస్తోందని వివరించారు. పనులు పూర్తి చేస్తే పేదలకు ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లారు.
కళాభవన్‌కు నిధులు మంజూరు చేయాలి


