రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
నెలలో రెండో ఘటన
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలు మళ్లీ పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లా కేంద్రంలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. తెల్లవారుజామున ముసుగు ధరించుకొని బైక్‌లపై వస్తున్న దుండగులు జనంలేని ప్రాంతాల్లో ఉండే మహిళల బంగారు గొలుసులు లా క్కెళ్తున్నారు. వారం రోజుల క్రితం వినాయక్‌నగర్, కసాబ్‌గల్లీలో అడ్రస్ అడుగుతూ మహిళల మెడలో ని పుస్తెలతాడును లాకెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తుండగా, తాజాగా సోమవారం సుభాష్‌నగర్ ఎస్‌బీఐ బ్యాంక్ వెనుక ప్రాంతంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఇంటి వద్ద పూలు తెంపుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు.
క్లూ దొరికింది..
సుభాష్‌నగర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి చైన్ స్నాచర్ల క్లూ దొరికింది. త్వరలోనే పట్టుకుంటాం. మిగతా రెండు కేసుల్లో విచారణ వేగంగా జరుగుతోంది. బంగారం రేటు పెరగడంతోనే చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.
– రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్
సంవత్సరం చోరీలు పోలీసులు
ఛేదించినవి
2022 26 13
2023 40 18
2024 37 07
2025 17 13
జిల్లా జరిగిన చైన్‌స్నాచింగ్‌లు


