నిజామాబాద్
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● జక్రాన్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2021లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా (డిసెంబర్‌లో) కొత్తగా కొర్రీలు పెట్టింది. స్థలం అనుకూలంగా ఉన్నప్పటికీ రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కావాలని చెప్పడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
రాజకీయ, విద్యా రంగాల్లో కీలక మలుపులు చోటు చేసుకున్న 2025 సంవత్సరానికి జిల్లా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉండిపోనుంది. జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు, ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం నిధులు మంజూరయ్యాయి. అయితే జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న జక్రాన్‌పల్లి ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం నిరాశకు గురి చేసింది. రాజకీయాలకు వస్తే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కాగా.. కేసీఆర్ తనయ బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ఏడాది జిల్లాపై ప్రత్యేక ముద్రవేసి వెళ్లిపోతోంది..
గేయ రచయితకు
రాష్ట్రస్థాయి బహుమతి
ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన గేయ రచయిత సాయికుమార్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయ పాటల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో 500 మంది రచయితలు పోటీపడగా, సాయికుమార్ రచించిన పాటకు మొదటి బహుమతికి ఎంపికయ్యింది. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.
చైనామాంజా
వినియోగిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్‌అర్బన్: చైనా మాంజా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాంజా కారణంగా వ్యక్తులకు ప్రాణహాని కలిగిస్తే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మనుషులు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా చైనామాంజా వాడకం పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు చైనా మాంజా తీసుకువచ్చినట్లు సమాచారం ఉందని, దాడులు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
సాఫ్ట్‌బాల్ చాంపియన్‌గా నిజామాబాద్
సుభాష్‌నగర్: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ 10వ సబ్ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్‌గా నిజామాబాద్ జట్టు నిలిచిందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్ సో మవారం తెలిపారు. ఫైనల్‌లో మెదక్ జిల్లా జట్టుపై 2–1 పరుగుల తేడాలో విజయం సాధించిందన్నారు. టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా రేవంత్ నిలిచి బహుమతి అందుకున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా అనికేత్, తిరుపతి వ్యవహరించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాపై 2025 సంవత్సరం చెరగని ముద్రవేసి కాలగర్భంలోకి వెళ్లిపోతోంది. ఈ ఏడాది అనేక కీలక పరిణామాలు, మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. రాజకీయాలు అనుకోని మలుపులు తిరిగాయి.
2012లో రోస్టర్ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణ యూనివర్సిటీలో భర్తీ చేసిన అధ్యాపక పోస్టులను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయంస్థానం నవంబర్‌లో తీర్పునిచ్చింది. తక్షణమే కొత్త నోటిఫికేషన్ వేయాలని జారీ చేసుకోవచ్చని సూచనలు చేసింది.
ఉత్తర తెలంగాణలో ప్రధానమైన ధర్మపురి – కొండగట్టు – వేములవాడ – లింబాద్రిగుట్ట – బాసర పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌లో నిధులు మంజూరు చేసింది. మొదటి దశలో నిజామాబాద్ – 1 సర్కిల్‌లోని 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు గాను రూ.412.33 కోట్లు, నిజామాబాద్ – 2 సర్కిల్‌లో మరో 15 రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.243.69 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్ 76ను ఈ నెల 13న జారీ చేసింది. రోడ్ల నిర్మాణాన్ని హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో చేపట్టనున్నారు. జిల్లా పరిధిలోని పలు రోడ్లు మరింత అభివృద్ధి కానున్నాయి. వీటిలో 8 ముఖ్యమైన రహదారులు ఉన్నాయి.
డిసెంబర్‌లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 362 గ్రామాల్లో కాంగ్రెస్, 76 గ్రామాల్లో బీఆర్‌ఎస్, 47 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు, 60 గ్రామాల్లో స్వతంత్రులు సర్పంచులుగా విజయం సాధించారు.
డీసీసీబీ, సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో జిల్లాలో 89 సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులు ఇంటికెళ్లాల్సి వచ్చింది.
ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.
జూలైలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. 211 మంది టీచర్ల సర్దుబాటు పూర్తి చేశారు.
పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవకతలకు జరిగాయని ఏసీబీ అధికారులు నవంబర్‌లో పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు.
భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తరువాత జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కారం ప్రక్రియ నడుస్తోంది.
రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం చేపట్టారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు తిరిగి జిల్లాకు వచ్చారు.
వైద్యారోగ్య శాఖలో నవంబర్‌లో అవుట్ సోర్సింగ్‌విధానంలో ఏఎన్‌ఎంలను నియమించారు.
వర్ని మండలం సిద్ధాపూర్ చుట్టుపక్కల 13 గ్రామాల రైతులకు సాగునీరందించేందుకు చేపట్టిన సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయాయి. 2022లో రూ.72 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో 20 శాతం పనులు అయిన తరువాత నిలిచిపోయాయి. ఇది పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుంది.
నిజాంసాగర్ కాలువ ఎగువ భాగంలోని నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో జాకోరా, చందూర్, చింతకుంట వద్ద నిజాంసాగర్ కాలువ నుంచి నీరు అందించాలన్న లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 2022 సంవత్సరంలో రూ.106 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు లిఫ్టులు పూర్తయితే 9వేల ఎకరాలకు సాగునీరందుతుంది.
పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి
పెద్ద పదవి
బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెన్షన్
జిల్లాలకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు
ప్రశాంతంగా ముగిసిన
పంచాయతీ పోరు
జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి
కేంద్రం కొర్రీలు
తెయూలో అక్రమ నియామకాలు రద్దు
బాక్సింగ్‌లో ప్రపంచ
చాంపియన్‌గా నిఖత్ జరీన్
జిల్లాపై 2025 సంవత్సరానికి
ప్రత్యేక ముద్ర
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్


