ఆదర్శం ఎల్లారెడ్డిపల్లె
ఇందల్వాయి : రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. గ్రామ ముఖద్వారం వద్ద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి హెల్మెట్‌లను అందుబాటులో ఉంచింది. గ్రామం నుంచి ద్విచక్ర వాహనాలపై బయటికి వెళ్లే వారు రూ.10 చెల్లించి హెల్మెట్ తీసుకెళ్లి తిరిగి వచ్చిన తరువాత తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ద్విచక్ర వాహనదారుల ప్రాణాల రక్షణ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ మఠముల సుజాత తెలిపారు. కార్యక్రమాన్ని ఎస్సై సందీప్ సోమవారం ప్రారంభించి గ్రామస్తులను అభినందించారు. వీడీసీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.


