పంచశీల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పంచశీల బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి

May 11 2025 12:38 PM | Updated on May 15 2025 5:07 PM

నిజామాబాద్‌నాగారం: నగరంలోని బురుడుగల్లీలో ఇటీవల పంచశీల జెండా గద్దె, సంఘం బోర్డును మున్సిపల్‌, పోలీస్‌ సిబ్బంది కూల్చివేశారని వెంటనే మళ్లీ ఏర్పాటు చేయాలని దళిత కళ్యాణ సమితి అధ్యక్షుడు పింకి పాయక్‌రావు అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్దెకు అనుమతి ఉండగా, వేరే వ్యక్తులు అకారణంగా కాషాయ జెండా గద్దెను ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తొలగించారన్నారు. ఇటీవల అర్ధరాత్రి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది మా జెండాను, గద్దెను తొలగించారన్నారు. వెంటనే జెండా గద్దెను నిర్మించకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. నాయకులు బంగారు సాయిలు, మోహన్‌, భీమ్‌ ఆర్మీ అజయ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

పెన్షనర్ల సదస్సును జయప్రదం చేయండి

నిజామాబాద్‌నాగారం: నగరంలోని పెన్షనర్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించనున్న పెన్షనర్ల జిల్లాస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్‌ సంఘాల నాయకులు, ఎంప్లాయీస్‌ స్టడీ సర్కిల్‌ జిల్లా కన్వీనర్‌ రాంమోహన్‌రావు అన్నారు. నగరంలోని సంఘ కార్యలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవీఎల్‌ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రాధా కిషన్‌, తదితరులు ఉన్నారు.

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

నిజామాబాద్‌నాగారం: నగరంలోని వినాయక్‌నగర్‌ పద్మజ్యోతి పద్మశాలి సంఘం 49వ తర్పా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు సంఘాల బాధ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకం రాజేందర్‌, గజం సుదర్శన్‌, కోశాధికారి సుప్పాల వెంకట లక్ష్మణ్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులతో నగర సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ప్రతినిధులు పుల్గం హన్మాండ్లు, గుడ్ల భూమేశ్వర్‌, బత్తుల భుమయ్య, కొట్టూరి హన్మండ్లు, పాము రాకేష్‌, బొమ్మెర సాయన్న, పెంట నారాయణ, కట్ట వరప్రసాద్‌, గడ్డం సురేష్‌, బత్తుల మురళి, రెగోండ మెహన్‌కూమార్‌, పెంట అంబదాస్‌, అడిచర్ల మధుసూదన్‌ పాల్గొన్నారు.

పీవీ రావుకు ఘన నివాళి

నిజామాబాద్‌నాగారం:మాలమహానాడు వ్యవ స్థాపకుడు పీవీరావు జయంతిని సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా నగరంలోని పూలాంగ్‌చౌరస్తాలో ఆయన చిత్రపటానికి మాలమహానాడు నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మాల మహానాడు ప్రతినిధులు గైని గంగారాం, సక్కి విజయ్‌ కుమార్‌, సక్కి ప్రభంజన్‌, సుంకరి విజయ, సక్కి చంద్రశేఖర్‌, గైని విద్యాసాగర్‌, మగ్గిడి దేవరాజ్‌, ప్రశాంత్‌, బేగరి శోభన్‌, దండు అనిల్‌, సుంకరి మల్లేష్‌, సంధ్య, మంజుల, లావణ్య, గంగామణి పాల్గొన్నారు.

ధర్పల్లిలో ఆరోగ్య శిబిరం

ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు పలువురికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. వైద్యులు శివశంకర్‌, శ్రీకాంత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ధర్పల్లిలో ఆరోగ్య శిబిరం1
1/1

ధర్పల్లిలో ఆరోగ్య శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement