
సిద్దాపూర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు నాణ్యతాలోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలి సి సమీక్షించారు. వర్ని మండల పరిధిలో రూ.258 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్, జాకో ర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై సమావేశంలో చర్చించారు. రిజర్వాయర్ పనులపై కాంట్రాక్టర్, అధికారులు ప్రతి మంగళవారం సమావేశం ఏర్పా టు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలి పారు. పనుల్లో నాణ్యత పాటించాలని, జాప్యం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, కామారెడ్డి ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారీ నీటిపారుదలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్ రెడ్డి