
హోన్నాజీపేట్‌లో చోరీ
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్‌లో చోరీ జరిగినట్లు ఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొంటకొల్ల గంగారం సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి దాబాపై నిద్రపోయారు. విషయం గమనించిన దుండగులు రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, రూ. మూడు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బంక్‌లో డీజిల్..
మోపాల్: మండలంలోని కాస్‌బాగ్ తండా శివారులో ఉన్న ఇండియన్ బంక్‌లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 154 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బంక్ వెనక వైపు నుంచి లోపలికి వచ్చి సీసీ కెమెరాలను నిలిపేశారు. ఆ తర్వాత బంక్‌లోని ఆన్‌లైన్ సిస్టమ్‌ను బ్రేక్ చేశారు. డీజిల్ గన్‌ను అన్‌లాక్ చేసి రూ.14,951 విలువైన 154 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. ఈవిషయమై ఎస్సై యాదగిరి గౌడ్ వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.