ప్రభుత్వం గుర్తించిన సన్నాలనే సాగు చేయాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం గుర్తించిన 33 రకా ల సన్నాలను రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అ ధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నో టిఫై చేసిన వరి విత్తనాలను రైతులు వినియోగించా లని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హోసింగ్ ఏఈలు, ఏపీవోలు, సహకార శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ బుధవారం స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన సన్నాలను కాకుండా ఇతర రకాలను కొంత మంది రైతులు సాగు చేస్తుండడంతో ధాన్యం సేకరణ సమయంలో కొను గోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మరో రెండు వారాల్లో ఖరీఫ్ సీజన్ ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నకిలీ, నాణ్యత లోపంతో కూడిన విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కే సులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్‌లో జిల్లా వ్యా ప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వి విధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా, అందులో ఒక్క వరి పంటనే 4.37 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్నరకాలు సాగు చేస్తారని భావిస్తున్నామన్నారు.
భూభారతి అమలులో భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత ఉన్న వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడా లన్నారు. ప్రైవేట్ సర్వేయర్లు ప్రభుత్వం నుంచి లైసెన్సు కోసం సీసీఎల్‌ఏ కమిషనర్ కార్యాలయాని కి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. రేషన్ (ఆహార భద్రత) కార్డులు, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ మొదటి, రెండో వారంలో చేపట్టే వన మహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీల్లో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని, పంపిణీ చేసే ప్రతి మొక్కనూ నాటి కాపాడుకునేలా చూడాలన్నారు. పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల పెంపకం జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నకిలీ, నాణ్యతలేని విత్తనాలు,
ఎరువులు విక్రయిస్తే కేసులు
రైతులకు అవగాహన కల్పించాలి
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
రాజీవ్‌గాంధీ హనుమంతు


