రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతి
మోర్తాడ్: మెండోరా మండలం పోచంపాడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ ఆఫీసర్ మృతిచెందారు. వివరాలు ఇలా.. పోచంపాడ్‌లో నివాసం ఉంటున్న బొమ్మల ప్రియాంక (43) స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధుల నిమిత్తం తన తమ్ముడి మోటర్‌సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వేముల మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు మెండోరా ఎస్సై సుహసినీ తెలిపారు.


