గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ నుంచి బాబాపూర్‌కు వెళ్లే దారిలో ఓ దుకాణం వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మంగళవారం ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని రాగి శ్రీనివాస్‌కు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు చొక్క, బూడిద రంగు పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని యాచకుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బోధన్: ఎడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలో మంగళవారం చి లిగిరి రమేష్‌కు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. వీధి కుక్కల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నామని పెంపకందార్లు పేర్కొంటున్నారు.


