కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం క ప్పల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాపై క లెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు కలిసి, సమస్యను విన్నవించారు. ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసుల వివరాలను ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించా లని కలెక్టర్‌ను కోరారు. నాయకులు నవీన్, గు న్నల బాల భాగత్, బోదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్, సతీష్ గౌడ్, అశోక్, సునీల్, రథన్, బచ్చల్వార్ శ్రీనివాస్, లాల రామకృష్ణ ఉన్నారు.


