మోపాల్: మండలకేంద్రంలోని చిన్నారులు ఆదివారం మదర్స్ డే సందర్భంగా అమ్మకు వినూత్నంగా శుభాకాంక్షలను తెలియజేశారు. చిన్నారులు గ్రామస్తులతో కలిసి చెట్ల ఆకులతో ‘అమ్మకు వందనం’ అని లిఖించి మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరికి తొలి గురువు అమ్మేనని, తల్లి ప్రేమను మించినది ఈ సృష్టిలో ఏదీ లేదని చిన్నారులు అన్నారు. కార్యక్రమంలో నవీన్‌రెడ్డి, ముత్యం, గంగాధర్, శేఖర్, సంజీవ్‌రెడ్డి, చిన్నారులు అక్షర, ఆకృతి, ఖుషి, చిన్ను, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
అమీర్‌నగర్ వాసికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు
కమ్మర్‌పల్లి: మండలంలోని అమీర్‌నగర్ గ్రామానికి చెందిన మెరుగు నాగేశ్వర్‌రావు అనే వ్యక్తికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఎంఎన్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగేశ్వర్‌రావు ‘మన రసం’ అనే షార్ట్ ఫిల్మ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, మాటలు రాసి భరత్ అనే లీడ్ రోల్ పోషించారు. రెండు నెలల క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశాయగా భారీ వ్యూస్‌తో వీక్షకుల మన్నలను పొందింది. ఈ చిత్రానికి జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇటీవల హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం చేతుల మీదుగా నాగేశ్వర్‌రావు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అధినేత సంజోష్ తగరంకు, జ్యూరీ సభ్యులకు నాగేశ్వర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్‌క్రాస్ జిల్లాకు గర్వకారణం
నిజామాబాద్‌నాగారం: సమాజ సేవలో ముందుంటూ ప్రగతి సాధిస్తున్న జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ జిల్లాకే గర్వకారణమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్‌కు రెడ్‌క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు దక్కడంతో ఆదివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆయనను సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజం కోసం సేవలు అందించాలని అప్పుడే అభివృద్ధికి బాటపడుతుందన్నారు.
రాజశేఖర్ ఇటు వృత్తిలోనూ అటు సేవారంగంలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్‌రె డ్డి, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయు లు, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త రవీందర్ అబ్బాపూర్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, మైపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు
నిజామాబాద్‌రూరల్: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు రూ రల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ తెలిపారు. వివ రాలు ఇలా.. తిర్మన్‌పల్లి గ్రామంలో బోనాలపండుగ నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామంలో ఉ న్న ఎస్టీలకు ఇతర ప్రజలకు మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తి ర్మన్‌పల్లి గ్రామస్తుల ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యా దు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

‘అమ్మకు వినూత్న వందనం’

రెడ్‌క్రాస్ జిల్లాకు గర్వకారణం