
మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం తగదు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం తగదని నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ(ఇంజినీరింగ్ ఇన్ ఛీప్ మెయింటెనెన్స్) శ్రీనివాస్ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. వరద గేట్లను, కాకతీయ కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను, ఫ్లడ్ కంట్రోల్ రూంలో నీటి మట్టాన్ని, డ్యాం ను పరిశీలించి పలు వివరాలను అధికారులు, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గేట్లు, డ్యాం పై మెయింటెనెన్స్ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే తలెత్తే ఇబ్బందుల గురించి వివరించారు. వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, డిప్యూటీ ఈఈ గణేశ్, ఏఈఈలు, సిబ్బంది ఉన్నారు.