
ఆపరేషన్ సిందూర్‌కు ఉపాధ్యాయుల మద్దతు
నిజామాబాద్‌అర్బన్: కశ్మీర్ పర్యాటకులపై దాడికి నిరసనగా శనివారం సుభా ష్‌నగర్‌లో ఉన్న ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో కొనసాగుతున్న తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల్లో స్వల్ప విరామ సమయంలో నిరసన తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా జాతీయ పతాకాన్ని పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం కోర్సు డైరెక్టర్ శకుంతల మాట్లాడుతూ.. పర్యాటరులపై దాడికి నిరసనగా ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ గొప్ప విజయమని అన్నారు. ఇందులో ఆర్పీలు కాసార్ల నరేశ్‌రావు, గంటల ప్రసాద్, చింతల శ్రీనివాస్, అజయ్ కుమార్, కేసీ లింగం, నీలవేణి, సంధ్యారాణి, దస్తగిరి, కేవీ రమణాచారి, కృష్ణవేణి, ఉపాధ్యాయులు ఉన్నారు.