
వరల్డ్ స్కిజోఫ్రెనియా డే పై అవగాహన
నిజామాబాద్‌నాగారం: నగరంలోని ఖలీల్‌వాడిలో ఉన్న డాక్టర్ విశాల్ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్కిజోఫ్రెనియా డే పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ మాట్లాడుతూ.. ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కిజోఫ్రెనియా లక్షణాలు, చికిత్సా విధానాలు, ప్రారంభ దశలో గుర్తింపు ప్రాముఖ్యతపై వివరించారు. ప్రజలతో సంభాషించి, స్కిజోఫ్రెనియాకు సంబంధించిన అపోహలు నివృత్తి చేశారు. అవగాహనను మరింత విస్తృతం చేసేందుకు స్కిజోఫ్రెని యా కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నవీన్, భవానీ ప్రసాద్, జీవన్ రావు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
జక్రాన్‌పల్లి: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త బానోత్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని ధర్పల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు. శనివారం జక్రాన్‌పల్లి మండలంలోని వివేక్‌నగర్ తండాలో మృతుడు బానోత్ శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బాజరెడ్డి జగన్ హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు నట్ట బోజన్న, నాయకులు దీకొండ శ్రీనివాస్, కుంచాల రాజు, చింత మహేశ్, అక్బర్‌ఖాన్ తదితరులు ఉన్నారు.
అనాథల ఆత్మ శాంతి కోసం..
నిజామాబాద్‌నాగారం: అనాథల ఆత్మశాంతి కోసం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాశీలోని మణికర్ణికా ఘాట్ వద్ద సంప్రదాయ పద్ధతిలో శనివారం కర్మ కాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షు డు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 133 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయా మత సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు ఐలేని సంతోష్, ఇందూరు శేఖర్, విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.

వరల్డ్ స్కిజోఫ్రెనియా డే పై అవగాహన

వరల్డ్ స్కిజోఫ్రెనియా డే పై అవగాహన