
నిర్లక్ష్యం వద్దు
భయపడొద్దు
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య నిపుణుల సూచన
● దేశంలో వ్యాపిస్తున్న కరోనా జేఎన్ 1
● ఒమిక్రాన్‌లాగే ఇలావచ్చి
అలా వెళ్తుందంటున్న వైద్యులు
● సాధారణంగా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి దీని లక్షణాలు
● బాధితులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో సర్వం సిద్ధం
నిజామాబాద్‌నాగారం: కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాపిస్తుండడంతో మళ్లీ ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో మరణాలు సంభవిస్తుండడం, మన దేశంలోని మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం కరోనాకు భయపడొద్దని.. అదే సమయంలో నిర్లక్ష్యం పనికిరాదని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో అంతగా వైరస్ ప్రభావం లేదని, గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ లాగే ఇలా వచ్చి అలా వెళ్తుందని తేల్చిచెబుతున్నారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం మాత్రం కరోనా వ్యాపిస్తే బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వార్డులను ఏర్పాటు చేసింది.
జేఎన్–1 లక్షణాలు..
● తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, బలహీనత తదితర లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే అక్కడే అడ్మిట్‌చేసుకొని ప్రత్యేక చికిత్స అందించనున్నారు. ఇంటి వద్ద వారం రోజుల పాటు ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. 10 మేల్, 10 ఫిమేల్(ఆడ) వా రి కోసం బెడ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు జీజీహెచ్‌కు వస్తే వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి
● భౌతిక దూరం పాటించాలి
● చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి
● నాణ్యమైన ఆహారం తీసుకోవాలి
● తాజా పండ్లు, కూరగాయలు తినాలి

నిర్లక్ష్యం వద్దు

నిర్లక్ష్యం వద్దు

నిర్లక్ష్యం వద్దు