వెనువెంటనే నిర్మాణ అనుమతులు
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం రూపొందించిన టీఎస్ బీపాస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ బీపాస్‌గా మార్చింది. తాజాగా ప్రభుత్వం బిల్డ్ నౌ అనే పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అనుమతుల కోసం ప్రజలు టీజీ బీపాస్ పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకునేవారు. ఇక టీజీ బీపాస్‌కు టాటా చెప్పి బిల్డ్ నౌ కు ఒకే చెప్పనున్నారు.
అన్ని అనుమతులు పోర్టల్‌లోనే..
భవన నిర్మాణాలకు సంబంధించి అన్ని అనుమతు లు ఇకపై కొత్త పోర్టల్‌లోనే జరగనున్నాయి. గతంలో ఉన్న పోర్టల్‌కు దీనికి పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. అందులో ఉన్న ఆప్షన్‌లన్నీ ఇందులో కూడా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీపీ పరిధిలో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర మున్సిపాలిటీలకు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. నిమిషాల వ్యవధిలో అనుమతులు లభించనున్నాయి.
లాగిన్ ద్వారానే...
భవన నిర్మాణాలకు యథావిధిగా లాగిన్ కావాలి. తర్వాత దరఖాస్తుదారు వివరాలు, భవన నిర్మాణాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. తగిన డాక్యుమెంట్లు జతపరచాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుదారు పేరుతో లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది. వీటి ద్వారా టౌన్‌ప్లానింగ్ అధికారులు సంబంధిత వ్యక్తుల వివరాలు, అందించిన సమాచారం,జతచేసిన ధ్రువీకరణ పత్రాలు ఒర్జినల్‌ను సరిచూస్తారు. అన్ని నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తే వెంటనే అనుమతులు మంజూరు చేస్తారు.
టీజీ బీపాస్ పోర్టల్
టీజీ బీపాస్ స్థానంలో బిల్డ్ నౌ
కొత్త పోర్టల్
అనుమతులన్నీ ఈ పోర్టల్ ద్వారానే..
బిల్డ్‌నౌ పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి
నగరంలో భవన నిర్మాణాల అనుమతులకు ఇప్పటివరకు టీజీ బీపాస్ పోర్టల్‌లో దరఖా స్తు చేసుకునేవారు. ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను అందుబాటులో కి తెచ్చింది. ఇకపై బిల్డ్‌నౌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే ఈ పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. కొత్తగా భవన అనుమతుల కోసం కొత్త పోర్టల్‌నే వినియోగించుకోవాలి. – ఎల్ శ్రీధర్‌రెడ్డి, ఏసీపీ–2
సేవలు..
బిల్డింగ్ పర్మిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కంప్‌లైంట్స్, కాంపౌండ్‌వాల్, లేఔట్ పర్మిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వంటి సేవలు వినియోగించుకోవచ్చు.
ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ధ్రువీకరణ పత్రాలు
యాజమాన్య పత్రాలు (ఓనర్‌షిప్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్ తదితర), లింక్ డాక్యుమెంట్లు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్, సెట్‌బ్యాక్ వివరాలు, ప్లాట్‌సైజ్, లే ఔట్ మ్యాప్ జతచేయాల్సి ఉంటుంది.
వెనువెంటనే నిర్మాణ అనుమతులు
వెనువెంటనే నిర్మాణ అనుమతులు


