సర్పంచ్‌లకు ఊరట | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు ఊరట

Dec 26 2025 8:40 AM | Updated on Dec 26 2025 8:40 AM

సర్పం

సర్పంచ్‌లకు ఊరట

సర్పంచ్‌లకు ఊరట

పంచాయతీలో చిల్లిగవ్వలేదు

అభివృద్ధి పనులకు వెచ్చిస్తాం

నేరుగా నిధులు ఇస్తానన్న

సీఎం రేవంత్‌

చిన్న జీపీలకు రూ.5 లక్షలు..

పెద్ద జీపీలకు రూ.10 లక్షలు

రెంజల్‌(బోధన్‌) : ‘‘గ్రామాల అభివృద్ధికి సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచ్‌లకే నిధులు ఇస్తా. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు మంజూరు చేస్తా. కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటికి సంబంధం లేదు’’. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటన సర్పంచుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా.. చాలా గ్రామాలు జీరో బ్యాలెన్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చుకోలేని స్థితి ఉంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం.. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేపట్టడానికి ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే గ్రామ పంచాయతీలకు సీఎం నిధుల నుంచి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఇవ్వనుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడుగులు పడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.

రెండేళ్లుగా స్తబ్ధత..

రెండు సంవత్సరాలుగా జీపీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారులు భారంగా నెట్టుకువచ్చారు. చాలా గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బును సౌకర్యాల కల్పన కోసం వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అప్పులు తెచ్చి కార్యదర్శులు పనులు చేపట్టారు. అలాగే మాజీ సర్పంచులు అడ్వాన్స్‌గా గ్రామాల్లో పనులు చేపట్టారు. మాజీలతోపాటు కార్యదర్శులకు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంబీ రికార్డులు చేయించుకుని గ్రాంటు రాగానే రాబట్టుకునేందుకు మాజీలు జీపీల చుట్టూ తిరుగుతున్నారు. కార్యదర్శులు సైతం అప్పులు తెచ్చిన డబ్బులకు ఎంతకాలం వడ్డీలు కట్టాలని వాపోతున్నారు.

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలో అభివృద్ది పనులకు చిల్లిగవ్వలేదు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్‌లు, కార్యదర్శులు చేసిన అభివృద్ది పనులకు సంబంధించి రూ.42 లక్షల వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన ఊరటనిచ్చింది.

– తిరుపతి లలిత, సర్పంచ్‌, రెంజల్‌

ముఖ్యమంత్రి ఇస్తానన్న రూ.10 లక్షలతో కొంతైనా గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలను చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా నిధులను అభివృద్ది పనులకు ఉపయోగిస్తాం.

– లచ్చవార్‌ సుహాసిని, సర్పంచ్‌, సాటాపూర్‌

సర్పంచ్‌లకు ఊరట1
1/2

సర్పంచ్‌లకు ఊరట

సర్పంచ్‌లకు ఊరట2
2/2

సర్పంచ్‌లకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement