పసుపు రైతుల సంక్షేమానికి కృషి
సుభాష్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని జాతీయ పసు పు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ యన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అనంతరం పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటును హర్షిస్తూ శ్రద్ధానంద్ గంజ్‌లో బీజేపీ నాయకులు, రైతులతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వ డానికి సహకరించిన ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్ట ర్ హనుమంతుకు గంగారెడ్డి ధన్యవాదాలు తెలి పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, వీ మోహన్‌రెడ్డి, పాట్కూరి తిరుపతిరెడ్డి, గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజుతదితరులు పాల్గొన్నారు.


