పీవోకే సున్నిత అంశం
సుభాష్‌నగర్/నిజామాబాద్‌రూరల్/బోధన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సున్నితమైన అంశమని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకవచ్చని జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్, ఉన్నత విద్యాశాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నిమ్మగడ్డ వెంకటప్రసాద్ ఆకాంక్షించారు. ‘కశ్మీర్ చరిత్రలో వక్రీకరణలు – వాస్తవాలు’ అనే అంశంపై ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పట్టణ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో, బోధన్ పట్టణంలో బుధవారం సదస్సులు నిర్వహించారు. అంతకుముందు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిమ్మగడ్డ వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆక్రమిత కశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. కశ్మీర్ దేశంలో విలీనం కాకుండా మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నె హ్రూ, కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ భార త్‌పై చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని 1997 ఫిబ్రవరి 24న ప్రధాని పీవీ నర్సింహరావు హయాంలో సామూహిక తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం 12 రోజుల్లోనే పూర్తి చేసిందని, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పా మన్నారు. అనంతరం దేశంలో భద్రత, రక్షణ, సైనికులు, కశ్మీర్, ఆపరేషన్ సిందూర్ అంశాలపై ప్రజలకు ఉన్న సందేహాలను ఆయన నివృత్తిచేశారు. హైకోర్టు న్యాయవాది కాటిపల్లి మహేందర్‌రెడ్డి, కలువకోట నరేశ్‌కుమార్, గౌరవసలహాదారు ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు, బోధన్‌లో యార్లగడ్డ శ్రీనివాస్‌రావు, ఏకచక్ర సేవా సమితి అధ్యక్షుడు అంకు మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాం
భగవద్గీత, రామాయణంతో దేశంపై గౌరవాన్ని పెంచుకోవాలి
జమ్మూకశ్మీర్ స్టడీ సెంటర్ దక్షిణ భారత కన్వీనర్
నిమ్మగడ్డ వెంకటప్రసాద్


