గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి: తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవే శ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రేమలత బు ధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 21 జనవరి 2026 దరఖాస్తుకు తుది గడువు అని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జనవరి 5లోగా
ఫీజు చెల్లించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల పీజీ పరీక్షల ఫీజు జనవరి 5వ తేదీలోగా చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల థియరీ, ప్రాక్టికల్స్ 2026 జనవరిలో జరుగుతాయని తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో జనవరి 7వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీజీ (ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంకాం) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీఈ) అన్ని సబ్జెక్టులకు రూ. 500, ఐపీసీహెచ్ (అన్ని సబ్జెక్టులకు రూ. 600) ఎంబీఏ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించాలని సూచించారు.
సాఫ్ట్‌బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపిక
డిచ్‌పల్లి: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరగబోయే 10వ తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ 2025 – 26కు తమ పాఠశాల విద్యార్థిని మాదరి ప్రణయ ఎంపికై నట్లు ధర్మారం (బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రేమలత బుధవారం తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రణయను ప్రిన్సిపల్ మాధవీలత, ఫిజికల్ డైరెక్టర్ నీరజ, పీఈటీ స్వప్న, సుమలత, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ గంగామోహన్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్డీఎస్‌ఎల్‌కు
బల్దియా నోటీసులు
బోధన్‌టౌన్(బోధన్): ఆస్తి పన్ను బకాయిలు రూ.11 కోట్ల 55లక్షలు చెల్లించాలని పట్టణంలోని ఎన్‌డీఎస్‌ఎల్(నిజాం షుగర్స్) ఫ్యాక్టరీ కి బోధన్ మున్సిపాలిటీ అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి ఆస్తిపన్ను బకాయిలు 2015 నుంచి ఇప్పటి వరకు చెల్లించలేదని, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ జాదవ్ కృష్ణ స్పష్టం చేశారు.


