గుట్టలు హాంఫట్
యథేచ్ఛగా తోడేశారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గుట్టలు గుల్ల చేసి.. వాటి ఆనవాళ్లను సైతం మాయం చేసి భారీ గోతులుగా మారుస్తున్నారు. గుట్టలను హాంఫట్ చేసిన ప్పటికీ గనుల శాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు నిద్ర నటిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులోని ధాత్రి లేఅవుట్ సమీపంలో ఎఫ్‌సీ ఐ గోదాముల గోడను ఆను కుని విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. సా యంత్రం 6 గంటల లోపు మాత్రమే తవ్వకాలు చేసుకునేందుకు పరిమిత అనుమతులు ఉండగా, నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి సమయంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నా రు. అభివృద్ధి పనుల పేరుతో మొరం తరలిస్తూ ఒక్క వేబిల్లు మీద పదుల సంఖ్యలో టిప్పులు రవాణా చేస్తున్నా రు. భారీ టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా తవ్వకాలు చే స్తున్నారు. తమకు అధికార పార్టీ నుంచి కీలక ప్రజా ప్రతినిధుల అండ ఉందని చెబుతూ అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేస్తూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఇక్క డ గుట్టలకు బదులు భారీ క్వారీల మాదిరి పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. రోజుకు 200 నుంచి 300 ట్రిప్పు లు రవాణా చేస్తున్నారు. గోరంత అనుమతి.. కొండలను మింగేలా తవ్వకాలు చేయడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తవ్వకాల్లో కొందరు అధికార పార్టీ నాయకులకు అత్యధిక భాగసామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు భారీగా మామూళ్లు ముడుతుండడంతో చూసీచూడనట్లు, తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తుండడం విశేషం. ఈ విషయాలపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి మైనింగ్ అధికారులను పంపించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అడ్డూఅదుపులేని మొరం దందా కారణంగా గుట్టల స్థానంలో గోతులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు. జిల్లా కేంద్రం శివార్లలోని నాగారం ప్రాంతంతోపాటు మల్లారం గ్రామం వద్ద కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల అండ ఉందని చెప్పుకుంటూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. నిజామాబాద్‌నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసమని అనుమతులు తీసుకుని నాగారం
ప్రాంతం నుంచి పొద్దునరాత్రి తేడా లేకుండా వందలాది ట్రిపుల మొరాన్ని తరలించారు.
గుట్టపైనుంచి మొరం
తరలించేందుకు వచ్చిన టిప్పర్లు
అభివృద్ధి పనుల పేరుతో నగర
శివారులో మొరం తవ్వకాలు
మాయమవుతున్న గుట్టలు
అధికార పార్టీ నేత హస్తం
పరిమిత అనుమతులతో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు
జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టల స్థానంలో ఏర్పడిన గోతులు
ఒక్క వేబిల్లుతో పదుల సంఖ్యలో
ట్రిప్పుల రవాణా
రాత్రి సమయంలో భారీ టిప్పర్లతో
వందలాది ట్రిప్పులు తరలింపు
మైనింగ్ అధికారులను పంపి చర్యలు తీసుకుంటాం : కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
గుట్టలు హాంఫట్
గుట్టలు హాంఫట్
గుట్టలు హాంఫట్


