యువ వికాసమేదీ..?
● ఆరు నెలలైనా జాడలేని నిధులు
● స్వయం ఉపాధి కోసం యువతకు
తప్పని నిరీక్షణ
మోర్తాడ్(బాల్కొండ): స్వయం ఉపాధి కోసం రాజీ వ్ యువ వికాసం పథకం ద్వారా రూ.2లక్షల రు ణం కోసం మోర్తాడ్‌కు చెందిన రాణి దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణా దుకాణం, లేడీస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. ఇప్పటి వరకు యువ వికాసం రుణం మంజూరు కాలేదు. రాణిలాగే జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షి స్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2కు ముందుగానే దరఖాస్తులను స్వీకరించారు.
రూ.50 వేల లోపు వారికి వంద
శాతం రాయితీ
రాజీవ్ యువ వికాసం కింద రూ.50వేల లోపు రు ణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వంద శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష వరకు రుణం పొందేవారికి 90 శాతం రా యితీ, రూ.2లక్షల వరకు రుణం తీసుకునేవారికి 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్ష ల వరకు రుణం పొందేవారికి 70 శాతం రాయితీని అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఎక్కువ మంది రూ.4 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2న రాయితీ రుణాలను పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో వాయిదా పడగా.. ఇప్పటి వరకు షెడ్యూల్‌ను ఖరారు చేయలేదు. కనీసం ఎప్పుడు రాయితీ రుణాలను అందిస్తారో ప్రభుత్వం వెల్లడించకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికార యంత్రాంగం రాజీవ్‌యువ వికాసంపై ఏమీ మాట్లాడలేకపోతోంది. ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాలకు నిధులను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో 58వేల దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందేందుకు జిల్లా వ్యాప్తంగా 58వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజిక వర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.


