అంకితభావంతో పని చేయాలి
● గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులు క్రియాశీల పాత్ర పోషించాలి
● ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి
బోధన్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పని చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గ్రామాలభివృద్ధిలో క్రీయాశీల పాత్ర పోషించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలపై బోధన్ పట్టణంలోని లయ న్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్‌లో బుధ వా రం నియోజకవర్గ స్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామాభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించా లని సూచించారు. ముఖ్యంగా వీధిదీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల శుభ్ర త, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. ఆదాయ వనరుల పెంపునకు కృషి చేయాలని, మా ర్చినెలాఖరు నాటికి ప్రతి పంచాయతీలో వందశా తం పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న పంచా యతీ కార్యదర్శులకు స్థాన చలనం కల్పించాలని, బదిలీలు పాదర్శకంగా చేపట్టాలన్నారు. పనితీ రు సక్రమంగా లేని వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేశా రు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం పను వసూ లు చేయాలన్నారు. పన్ను వసూళ్ల ప్రగతిని తాను స్వయంగా సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవన్నారు. సమీక్షాసమావేశానికి గైర్హాజరైన కార్యదర్శులపై ఆరా తీశారు. గైర్హాజరైన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వికాస్‌మహతో, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్‌పీవో నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.


