సావిత్రిబాయి ఫూలే ఆశయాలను సాధిద్దాం
నిజామాబాద్ రూరల్: దేశంలో మహిళల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగరలో ఉన్న మహనీయుల విగ్రహల వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి మహేశ్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. మహిళల చదువుకోసం, సమన్యా యం కోసం సావిత్రిబాయి పోరాటం చేశారన్నారు. బీసీ రిజర్వేషన్ ద్వారా సమన్యాయం అందించా లని తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి రిజర్వేషన్‌లే బలమైన ఆయుధమని అన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సావిత్రిబాయి ధైర్యం, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. మన ఆడబిడ్డలు చదువుకుంటున్నా రంటే, ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, తలెత్తుకు ని నడుస్తున్నారంటే దానికి మూలం సావిత్రిబాయి త్యాగమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, సభాధ్యక్షుడు నరాల రత్నాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆకుల లలిత, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్‌ల కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది
సామాజిక, ఆర్థికాభివృద్ధికి
రిజర్వేషన్‌లే ఆయుధం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే
విగ్రహావిష్కరణ


