
బల్దియాలో హెల్ప్‌డెస్క్
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే నగరవాసుల సౌలభ్యం కోసం కమిషనర్ దిలీప్‌కుమార్ ‘హెల్ప్‌డెస్క్’ ఏర్పాటు చేయించారు. నిరక్షరాస్యులు, తెలుగు భాషరానివారు, వృద్ధులు తమ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో కార్పొరేషన్ భవనంలోని ప్రతి అంతస్తులో తిరుగుతుంటారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయించి ఇద్దరిని విధుల్లో నియమించారు. అలాగే ఫిర్యాదుల బాక్స్ సైతం ఏర్పాటు చేయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రుల్లో ప్రత్యేక
బృందాల తనిఖీలు
ఖలీల్‌వాడి: అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ప్రత్యేక బృందం సోమవారం తనిఖీ చేసింది. ప్రుడెన్స్, తక్ష, మెడికవర్ ఆస్పత్రు లను తనిఖీ చేసిన అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. అగ్నిప్రమాద నివారణ పరికరాల నిర్వహణ, అత్యవసర నిష్క్రమణ మార్గాల నిర్దిష్టత, సిబ్బందికి అవగాహన లేకపోవడం వంటి లోపాలను గుర్తించి ఆస్పత్రుల నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో పట్టణ సీఐ శ్రీనివాస్‌రాజు, జిల్లా అగ్నిమాపక అధికారి పరమేశ్వర్, డాక్టర్ అంజన పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు ఈ బృందం సంయుక్త తనిఖీ చేపడుతోంది. బృందంలో జిల్లా వైద్యారోగ్య అధికారి, జిల్లా అగ్నిమాపక శాఖ, నిజామాబాద్ పోలీసు శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.
జిల్లాకు
కాయకల్ప బృందం
● నేటి నుంచి సీహెచ్‌సీ, ఏరియా
ఆస్పత్రుల పరీశీలన
నిజామాబాద్ నాగారం: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాయకల్ప అవార్డు(ప్రోత్సాహక బహుమతి) కోసం దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను పరిశీలించేందుకు నేడు కాయకల్ప బృందం జిల్లాకు రానుంది. నేడు డిచ్‌పల్లి సీహెచ్‌సీ, జూన్ 2న ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి, జూన్ 3న బోధన్ జిల్లా ఆస్పత్రిని ప్రత్యేక అ ధికారులు సందర్శించనున్నారు. ఆస్పత్రులో అన్ని రకాల రిజిస్టర్లు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు రికార్డులు పక్కాగా ఉంటే రాష్ట్రస్థాయిలో రూ. 25లక్షల నిధులు మంజూరు చేయనున్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
● అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి
● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ అవతరణ వేడుకల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయంలోని కాన్ఫరె న్స్ హాలులో సోమవారం ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. జూన్ 2వ తేదీన నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చే సి వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించే లా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

బల్దియాలో హెల్ప్‌డెస్క్

బల్దియాలో హెల్ప్‌డెస్క్