టీబీ నిర్ధారణ సర్వేకు సహకరించాలి
నిజామాబాద్‌నాగారం: టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా క్షయ నిర్ధారణ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి బి రాజశ్రీ తెలిపారు. ఖానాపూర్‌లోని బస్తీ దవాఖానలో సోమవారం సర్వేను డీఎంహెచ్‌వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని, వైద్య సిబ్బందికి ప్ర జలు సహకరించాలన్నారు. క్షయ బారినపడే అవకాశాలు ఉన్న మధుమేహం, క్యాన్సర్, రక్తపోటు, గతంలో టీబీ బారిన పడినవారు 60 ఏళ్ల వయస్సు పైబడిన వారు, ఫ్యాక్టరీల్లో పని చేసే, ధూమపానం, మద్యపానం చేసే వారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి గ్రస్తుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతినెలా రూ.వెయ్యి చొ ప్పున ఆరు నెలలపాటు జమ చేస్తుందని, పోషకాహారం తీసుకునేందుకు ఆ డబ్బులను వినియోగించుకోవా లన్నారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారిణి దేవినాగేశ్వరి, ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్, డాక్టర్లు అవంతి, ప్రత్యూష, టీబీ కో ఆర్డినేటర్ రవి, హెల్త్ సూపర్‌వైజర్ మధుకర్, సీఎస్‌వో నవీన్, లక్ష్మణ్, నరేశ్, స్రవంతి, భూపాల్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యారోగ్యశాఖాధికారిణి బి రాజశ్రీ


