నిధులు రావాలి.. అభివృద్ధి సాగాలి
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో స ర్పంచ్‌ల పాలన మొదలైంది. అయితే, అభివృద్ధి ప నుల నిర్వహణకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే అభివృద్ధి పనులకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం ఆర్థిక సంఘం నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. 2024 ఫిబ్రవరి 2 గత పాలకవర్గ పదవీకాలం ముగియగా, రాష్ట్ర ప్రభు త్వం వెంటనే ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు ప్రతి నెలా రూ.10,30,24,879 చొప్పున ఆర్థిక సంఘం ద్వారా జమ కావాల్సిన నిధులు నిలిచిపోయాయి. సుమా రు 22 నెలలకు సంబంధించి రూ.226,65,47,338 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
నేరుగా పంచాయతీలకే నిధులు...
ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం మొదట్లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సరిగా పంచాయతీలకు చేరవేయడం లే దనే కారణంతో కేంద్రం జీపీలతో ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరిపించింది. నిధులను ఖాతాలకు వి డుదల చేయడంతోపాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంది. అయితే, ఖాతాలు తెరిచిన తర్వాత పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడం గమనార్హం. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళితే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. బకాయిలతోపాటు కొత్తగా విడుదల కావాల్సిన నిధులు పంచాయతీ ఖాతాల్లోకి చేరితే మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని నూతన ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామ పంచాయతీలకు పేరుకుపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు
నిలిచిన రూ.226.65 కోట్ల నిధులు
పాలకవర్గాలు లేవనే కారణంతో బ్రేక్ వేసిన కేంద్రం


