అర్చకుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్చకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ధూప, దీప, నైవేధ్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ మాట్లాడుతూ.. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 5లోపు వేతనం అందించాలని అన్నారు. అర్చకులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలన్నారు. ప్రతి జిల్లాలో అర్చక భవన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల అర్చకుల వేతనం, ధూప, దీప నైవేద్యంలకు రూ.35వేలు (వేతనం రూ.25వేలు, ధూప, దీప నైవేధ్య రూ.10వేలు) వరకు పెంచాలన్నారు. ప్రముఖ దేవాలయాల్లో డీడీఎన్ అర్చక కుటుంబాలకు ఉచిత శీష్రు దర్శనం కల్పించాలన్నారు. అనంతరం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ విజయరామారావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రాజప్ప స్వామి, అంజన్న స్వామి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ శర్మ, కిరణ్ శర్మ, క్యాషియర్ రాజేందర్, పరమేష్, రాష్ట్ర సభ్యులు చర్మసప్ప, నావనంది శివ, శివప్ప, అరవింద్, రాజేశ్వర, సెక్రటరీ రాజేశ్వర్, దత్తాత్రేయలు, కృష్ణమాచార్యులు, సంగమేశ్వర్, మల్లికార్జున్ స్వామి, అనిల్ కుమార్, సునీల్, కాంత్ అప్ప, భాస్కర్, జగదీష్, సిద్దేశ్వర్, అర్చకులు పాల్గొన్నారు.


