వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
క్రైం కార్నర్
పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాయు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్(54) అనే రైతు సోమవారం గగ్గుపల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ బోరు బావి మోటార్‌ను స్టార్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యడు. తీవ్ర అస్వస్థతకు గురైన భూమేష్వర్‌ను స్థానికులు గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
వేల్పూర్ మండలంలో..
వేల్పూర్: వేల్పూర్ మండలం అమీనాపూర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. లక్కోర గ్రామానికి చెందిన అబ్బాని భూమన్న(52) గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు తన టీవీఎస్ మోపెడ్‌పై సోమవారం భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. అమీనాపూర్ సమీపంలో మూలమలుపువద్ద వేల్పూర్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఆటో అతివేగంగా వచ్చి భూమన్నను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూమన్న తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వర్ని మండలంలో..
వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకని వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. వర్ని ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగని ప్రవీణ్ (29) సోమవారం ఉదయం ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చెరువులోకి దిగిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించి న ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. రా మారెడ్డి మండలం పోసానిపే ట గ్రామానికి చెందిన కనుగందుల నవీన్ (23) వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. రైలు సమీపించగానే భయంతో ప క్కకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆలస్యం కా వడంతో రైలు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఆలూర్ మండలంలో కరెంట్ షాక్‌తో రైతు ప్రాణాలు కోల్పోయాడు. వేల్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు, వర్ని మండలంలో చేపలవేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు.
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి


