టైప్ రైటింగ్ పరీక్షలో ప్రతిభ
ఆర్మూర్: ఇటీవల నిర్వహించిన టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ పరీక్షలో ఆర్మూర్ పట్టణానికి చెందిన పవార్‌కృప నక్షత్ర రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించినట్టు ఆర్మూర్‌లోని సంత్ జ్ఞానేశ్వర్ టైప్ రైటింగ్ ఇన్స్‌ట్యూట్ ప్రిన్సిపాల్ దొండి రవి వర్మ సోమవారం తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులను హైదరాబాద్‌లో తెలంగాణ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ ఇన్స్‌ట్యూట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావు సన్మానించినట్లు పేర్కొన్నారు. టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇన్స్‌ట్యూట్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


