నిజాంషుగర్స్ లేఆఫ్‌కు పదేళ్లు
బోధన్: సరిగ్గా పదేళ్ల క్రితం నిజాంషుగర్స్ యాజ మాన్యం లేఫ్ ప్రకటించింది. 2015 డిసెంబర్ 23న బోధన్, ముత్యంపేట (జగిత్యాల), ముంబోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. అయితే, రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాగానే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేర కు 2024 జనవరి 12న ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, మంత్రి దామోదర రాజనర్సింహ కో–చైర్మన్‌గా, బోధన్, మెదక్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్, జీవన్‌రెడ్డిలతోపాటు అప్పటి రాష్ట్ర ఆ ర్థిక ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ, సహకార శాఖ, రాష్ట్ర షుగర్ అండ్ కేన్ కమిషనర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 2024 ఫి బ్రవరి 24న బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి రైతులతో సమావేశమైంది. ఫ్యాక్టరీల పునరుద్ధరణ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీకి సంబంధించిన బ్యాంక్ రు ణ బకాయిలు సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వం పలు విడతల్లో చెల్లించింది. మరోవైపు రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి చెరుకు సాగు ప్రాధాన్యతపై రైతులతో సమావేశాలు నిర్వహించారు. మహారాష్ట్రలో సహకార సంఘాల ఆధ్వర్యంలో లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీల వద్దకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించారు.
ప్రభుత్వం చేతిలోనే ఫ్యాక్టరీ భవిష్యత్తు..
ఫ్యాక్టరీని తెరిపించేందుకు సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు నిపుణుల కమిటీ వేసి, తుది నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేప డుతుందని పునరుద్ధరణ కమిటీ పేర్కొంది. అయి తే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కిరాలే దు. కమిటీ వేసి రెండేళ్లు పూర్తికావొస్తున్నా పునరుద్ధరణ చర్యలు మొదలుకాలేదు. మరోవైపు చెరుకు పంట సాగు వైపు రైతులు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై చెరుకు రైతులు, కార్మికులు, ఈ ప్రాంత ప్రజ లు ఇన్నాళ్లుగా ఆశల పల్లకీలో ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్ప ష్టమైన విధాన ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాక్టరీ భ విష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మిగిలిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులు కనీసం బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ
ఎటూ తేలని ఫ్యాక్టరీ భవిష్యత్తు
ఆవిరవుతున్న ఆశలు
నిజాంషుగర్స్ లేఆఫ్‌కు పదేళ్లు


