తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారు నగలు,
రూ. 30వేల నగదు అపహరణ
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన బత్తుల పోశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వారి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. పోశెట్టి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాను చిందరవందరగా పడేసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లోని 5 తులాల బంగారు నగలు, రూ.30వేల నగదును చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
డిచ్‌పల్లిలో పట్టపగలే..
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న ఎస్‌బీఐ మినీ బ్యాంకులో సోమవారం పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రే పింది. బాధితులు, డిచ్ పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా.. డిచ్‌పల్లి బస్టాండ్ ఎదురుగా రాజు అనే వ్యక్తి ఎస్‌బీఐ మినీ బ్యాంకు నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్నాహ్యం షాపు గ్లాస్ డోర్‌కు తాళం వేసి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికీ ఓ కస్టమర్ అతడికి ఫోన్ చేసి షాపు తెరిచి ఉందని ఎక్కడ ఉన్నావని అడిగాడు. దీంతో తాను తాళం వేసి వస్తే డోర్ ఎలా తెరిచి ఉంటుందని ఆందోళన చెందిన వెంటనే బైక్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి చూడగా టేబుల్ డ్రాలో ఉన్న రూ.60వేలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా నెత్తిన టోపి ధరించిన గుర్తు తెలియని దుండగుడు పెద్ద స్క్రూడ్రైవర్‌తో గ్లాస్ డోర్‌ను తెరిచి లోనికి వచ్చాడు. అదే స్క్రూడ్రైవర్‌తో టేబుల్ డ్రాను తెరిచి, అందులోని రూ.60వేలను అపహరించాడు. సమీపంలోని దుకాణం ముందర బైక్‌పై ఒక యువకుడు వేచి ఉండగా, మరొక యువకుడు లోనికి వచ్చి ఈ చోరీకి పాల్పడి వెంటనే అదే బైక్‌పై పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎల్లమ్మ ఆలయంలో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో గల ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. సాంంకేతిక ఆధారాల సహాయంతో అనుమానితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చోరీకి ఉపయోగించిన గడ్డపార, దొంగిలించబడ్డ గల్లాపెట్టె, ఆటో, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడినది గాంధారి వాసి అయినా ర్యాకం సాయిలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వాసి జూలపాల రాములుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ


