పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ
● అందుబాటులో లేని టీచర్
● రిజిస్టర్‌లో సంతకాలు చేసిన వైనం
ఖలీల్‌వాడి: నగరంలోని కోటగల్లీ శంకర్‌భవన్ హైస్కూల్‌లో పీఎంశ్రీ నిధుల గోల్‌మాల్‌పై సోమ వారం సౌత్ మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి విచారణ చేపట్టారు. పీఎంశ్రీ ద్వారా పాఠశా లకు సుమారు రూ.10 లక్షల వరకు నిధులు వచ్చా యి. ఈ నిధులతో పాఠశాలలో వివిధ పనులతోపాటు విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే, నిధుల్లో నుంచి విహారయాత్ర కోసం రూ.3.27 లక్షలు మంజూరయ్యాయి. ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ మల్లేశం, ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ ఆధర్యంలో రెండు విడుతల్లో భువనగిరి ఫోర్ట్, యాదగిరి గుట్టతోపాటు హైదరాబాద్‌లో ని నెహ్రూజూలజికల్ పార్క్, సాలార్‌జంగ్ మ్యూజియానికి విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. వీటికి రూ. 2.92 లక్షలు ఖర్చు చేశారు. దీంతోపాటు రూ.50 వేలు స్కూల్ డేకు కేటాయించారు. నిధులు మార్చిలో మంజూరైతే ఏప్రిల్‌లో విద్యార్థులను తీసుకువెళ్లాల్సి ఉండగా టీచర్లు విహారయాత్ర పేరిట నిధులను గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రెండు నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదులు వెళ్లాయి. విజ్ఞాన విహారయాత్రకు మంజూరై నిధు లు, ఎప్పుడు వెళ్లారు, టూర్ కోసం డీఈవో, ఎంఈవో అనుమతి తీసుకున్నారా? ఎలా వెళ్లారు? తదితర వివరాలను అందించాలని శంకర్‌భవన్ ఇన్‌చా ర్జి హెచ్‌ఎంకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈవో సాయిరెడ్డి సో మవారం విచారణ చేపట్టగా ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ మల్లేశం అందుబాటులో ఉండగా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
హాజరు రిజిస్టర్‌లో సంతకాలు
సోమవారం ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం ఎంఈవో సాయిరెడ్డి పాఠశాలకు చేరుకో గా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేరు. హాజరుపట్టికను పరిశీలించగా ఉదయం, మధ్యాహ్నానికి సంబంధించిన రెండు సంతకాలను ఒకేసారి చేసి బయటికి వెళ్లినట్లు సమాచారం. అత్యవసర పనిపై వెళితే ఉదయం పూట మాత్రమే సంతకం చేయాల్సి ఉండగా రెండు సంతకాలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోసారి విచారిస్తాం..
పీఎంశ్రీ నిధులపై విచారణ చేయగా ఫిజిక్స్ టీచర్ వెనిగాల సురేశ్ అందుబాటులో లేరు. దీంతో మరో తేదీని నిర్ణయించి విచారిస్తాం. సోమవారం హాజరు రిజిస్టర్‌లో ఉదయం, మధ్యాహ్నం సంతకాలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి విచారణ చేస్తాం. టీచర్ సురేశ్ అంత్యక్రియలకు వెళ్లినట్లు సమాచారం ఉంది. – సాయిరెడ్డి, సౌత్ ఎంఈవో


