ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించా రు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల వి భాగం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను జనవరి 13లోగా పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియతోపాటు ఓటర్ల జాబితాలో పాత ఫొటోలు, పేర్లు, జెండర్ తదితర పొరపాట్లు ఉంటే ఫారం 8 ద్వారా సవరించాలని సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రూరల్ ని యోజకవర్గాలలో పూర్తి చేశామని, అర్బన్ సెగ్మెంట్ లో వేగవంతంగా చేపట్టి గడువులోపు పూర్తి చేస్తామ ని వివరించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కు మార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కా ర్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.


